Tollywood Action Love story movies : వాలెంటైన్స్ డే రోజు కేవలం ఫీల్ గుడ్ లవ్ స్టోరీ చిత్రాలు మాత్రమే కాదు.. యాక్షన్ లవ్ స్టోరీ చిత్రాలు కూడా చూడొచ్చు. ఈ తరహా చిత్రాలు తెరకెక్కించడంలో టాలీవుడ్ దర్శకులకు తిరుగులేదు.
Tollywood Action Love story movies :వాలెంటైన్స్ డే రోజు కేవలం ఫీల్ గుడ్ లవ్ స్టోరీ చిత్రాలు మాత్రమే కాదు.. యాక్షన్ లవ్ స్టోరీ చిత్రాలు కూడా చూడొచ్చు. ఈ తరహా చిత్రాలు తెరకెక్కించడంలో టాలీవుడ్ దర్శకులకు తిరుగులేదు. యాక్షన్ ప్లస్ లవ్ జోనర్ లో టాప్ 5 బెస్ట్ మూవీస్ ఏంటో ఇప్పుడు చూద్దాం.
26
Raviteja
భద్ర: మాస్ మహారాజ్ రవితేజ, మీరా జాస్మిన్ నటించిన ఈ చిత్రాన్ని బోయపాటి తెరకెక్కించారు. ఈ చిత్రంలో లవ్ సీన్స్ రవితేజ స్టైల్ లో ఎంటర్టైనింగ్ గా ఉంటాయి. కథలో ఫ్యాక్షన్ టచ్ కూడా ఉంటుంది.
36
Ram Charan, Kajal
మగధీర: దర్శక ధీరుడు రాజమౌళి పునర్జన్మల నేపథ్యంలో తెరకెక్కించిన అద్భుతమైన ప్రేమ కథ ఈ చిత్రం. దృశ్య కావ్యంలా ఉంటుంది. రాంచరణ్, కాజల్ కెమిస్ట్రీ.. పోరాట సన్నివేశాలు అద్భుతంగా ఉంటాయి.
46
Varsham
వర్షం : హీరోయిన్ పై విలన్ మనసు పడితే ఎలా ఉంటుంది అనే పాయింట్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రంలో ప్రభాస్, త్రిష కెమిస్ట్రీ, దేవిశ్రీ ప్రసాద్ అందించిన పాటలు హైలైట్. గోపీచంద్ విలన్ గా నటించాడు.
56
సీతారామం: బోర్డర్ లో దేశం కోసం పోరాడే సైనికుడి ప్రేమ కథ ఇది. ట్రాజడీ లవ్ స్టోరీ అయినప్పటికీ యాక్షన్ సీన్స్ కూడా ఉత్కంఠ భరితంగా ఉంటాయి. దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ నటన.. హను రాఘవపూడి దర్శకత్వం నెక్స్ట్ లెవల్ అంతే.
66
Venkatesh
బాడీ గార్డ్ : ఫోన్ లో సాగే కన్ఫ్యూజన్ లవ్ స్టోరీ చిత్రంగా బాడీ గార్డ్ మూవీ తెరకెక్కింది. వెంకీ స్టైల్ లో యాక్షన్ టచ్ కూడా ఈ చిత్రంలో ఉంటుంది. వెంకటేష్, త్రిష ఎమోషనల్ పెర్ఫామెన్స్ ఈ చిత్రానికి హైలైట్. ఈ చిత్రాలన్నింటినీ సిన్సియర్ లవర్స్ బాగా ఎంజాయ్ చేస్తారు.