Diwali Box Office: ఈ దీపావళి పండుగని పురస్కరించుకుని ఐదు సినిమాలు వచ్చాయి. `థామా`, `కే ర్యాంప్`, `తెలుసు కదా`, `డ్యూడ్` చిత్రాల్లో ఏ మూవీకి ఎంత కలెక్షన్లు వచ్చాయనేది చూస్తే.
దీపావళి పండుగని పురస్కరించుకుని ఈ సారి దాదాపు ఐదు సినిమాలు విడుదలయ్యాయి. అందులో మూడు తెలుగు సినిమాలుండగా, ఒకటి తమిళం, మరోటి హిందీ చిత్రం ఉంది. గత వారం `మిత్ర మండలి`, `తెలుసు కదా`, `డ్యూడ్`, `కే ర్యాంప్` చిత్రాలు విడుదలైన విషయం తెలిసిందే. వీటిలో `మిత్ర మండలి` ఫస్ట్ షో నుంచే డిజాస్టర్‌గా మిగిలింది. సిద్ధు జొన్నలగడ్డ `తెలుసుకదా` ఏమాత్రం మెప్పించలేకపోయింది. ప్రదీప్ రంగనాథన్ `డ్యూడ్` తమిళంలో దుమ్ములేపుతుంది. కిరణ్ అబ్బవరం `కే ర్యాంప్` మాత్రం బాక్సాఫీసు వద్ద రచ్చ చేస్తోంది. ఇక తాజాగా రష్మిక మందన్నా `థామా` మూవీ మంగళవారం విడుదలైంది. మరి ఈ మూవీస్ బాక్సాఫీసు వసూళ్లు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
25
రష్మిక `థామా` ఫస్ట్ డే క్రేజీ కలెక్షన్లు
నేషనల్ క్రష్ రష్మిక మందన్నా బాలీవుడ్‌లో నటించిన లేటెస్ట్ మూవీ `థామా`. ఆయుష్మాన్ ఖురానా హీరోగా నటించిన ఈ చిత్రంలో నవాజుద్దీన్ సిద్ధిఖీ విలన్‌గా నటించారు. మడాక్ హర్రర్ కామెడీ సినిమా యూనివర్స్ లో భాగంగా వచ్చిన చిత్రమిది. ఆదిత్యా సర్పోత్దార్ దర్శకత్వం వహించారు. మడాక్ ఫిల్మ్స్ నిర్మించింది. దీపావళి పండగని పురస్కరించుకుని మంగళవారం విడుదలైన ఈ మూవీ తెలుగులో పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. నార్త్ లో మిశ్రమ స్పందన లభించింది. కాకపోతే ఫస్ట్ డే భారీ అంచనాల మధ్య విడుదలైంది. దీంతో కలెక్షన్ల పరంగానూ దుమ్ములేపింది. ఈ చిత్రం ఇండియాలో రూ.25.11కోట్లు, ప్రపంచ వ్యాప్తంగా రూ.35కోట్ల వరకు రాబట్టినట్టు సమాచారం.
35
కిరణ్ అబ్బవరం `కే ర్యాంప్` ర్యాంపేజ్
దీపావళి పండగ సందర్భంగా విడుదలైన చిత్రాల్లో కిరణ్ అబ్బవరం `కే ర్యాంప్` కూడా ఉంది. జైన్స్ నాని దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో యుక్తీ తరేజా హీరోయిన్‌గా నటించింది. ఈ చిత్రం శనివారం విడుదలైంది. నాలుగు రోజుల్లో ఇది సుమారు రూ. 20కోట్లు వసూలు చేసినట్టు సమాచారం. ఇది దాదాపు పది కోట్లకుపైగా షేర్ సాధించింది. ఇప్పటికే ఇది బ్రేక్ ఈవెన్ దాటి లాభాల్లోకి వెళ్లింది. తెలుగులో `కే ర్యాంప్` దీపావళి విన్నర్‌గా నిలిచిందని చెప్పొచ్చు.
ఇక దీపావళి పండగా సందర్భంగా విడుదలైన మరో తెలుగు మూవీ `తెలుసు కదా`. సిద్ధు జొన్నలగడ్డ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. నీరజ కోన దర్శకత్వం వహించారు. ఇందులో రాశీఖన్నా, శ్రీనిధి శెట్టి హీరోయిన్లుగా నటించారు. ఈ మూవీ శుక్రవారం విడుదలైంది. డివైడ్ టాక్ తెచ్చుకుంది. ఐదు రోజులు పూర్తి చేసుకున్న ఈ సినిమా రూ.12కోట్లు రాబట్టింది. ఈ మూవీకి అయిన బిజినెస్ రూ.23 కోట్లు. ఇప్పుడు ఆరు కోట్లు మాత్రమే వచ్చింది. ఇంకా రూ.17కోట్లు రావాలి. ఈ మూవీకి మంగళవారం నుంచే కలెక్షన్లు దారుణంగా పడిపోయాయి. చూడబోతుంటే ఇది డిజాస్టర్‌గా నిలవబోతుందనిపిస్తోంది.
55
వంద కోట్లకి చేరువలో `డ్యూడ్`
దీపావళి కానుకగా విడుదలైన మరో మూవీ `డ్యూడ్`. కోలీవుడ్ హీరో ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటించారు. మమితా బైజు హీరోయిన్‌గా చేసింది. కీర్తిశ్వరన్ దర్శకత్వం వహించిన ఈ మూవీ శుక్రవారం విడుదలైంది. ఐదు రోజుల్లో ఇది సుమారు రూ.95కోట్లు వసూలు చేసింది. తెలుగులో ఈ చిత్రం రూ.13కోట్లు రాబట్టింది. మంగళవారం వసూళ్లు బాగా పడిపోయాయి. అయితే తమిళంలో బాగా ఆడుతోంది. ఇది ప్రపంచ వ్యాప్తంగా వంద కోట్ల క్లబ్‌లో చేరబోతుంది. తెలుగులో ఈ చిత్రానికి వ్యాపారం విలువ పది కోట్లు. ఇంకా నాలుగు కోట్లు షేర్ రావాల్సి ఉంది. అంటే ఏడు కోట్ల గ్రాస్ రావాలి. చూడబోతుంటే అది కష్టమనిపిస్తుంది. ఏం జరుగుతుందో చూడాలి.