చాలా కాలంగా సరైన హిట్ లేక ఇబ్బందిపడుతోంది హీరోయిన్ పూజా హెగ్డే. వరుస ప్లాప్ సినిమాల వల్ల ఆమెకు అన్ లక్కీ హీరోయిన్ అన్న పేరు పడిపోయింది. ఇక తాజాగా 800 కోట్ల భారీ ప్రాజెక్ట్ లో బంపరాఫర్ కొట్టేసింది స్టార్ బ్యూటీ. ఇకనైనా అదృష్టం కలిసి వస్తుందా?
స్టార్ హీరోయిన్ గా వరుస సక్సెస్ లు అందుకున్న పూజా హెగ్డే.. మధ్యలో వరుస డిజాస్టర్లతో ఐరన్ లెగ్ అన్న విమర్శలు ఫేస్ చేసింది. అల్లు అర్జున్, ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు లాంటి స్టార్ హీరోల సరసన సూపర్ హిట్ సినిమాలు చేసిన పూజా.. ఆతరువాత వరుసగా ప్లాప్ లు కూడా చూసింది. ఎంత ప్రయత్నించిన ఒక్క హిట్ పడకపోవడంతో.. ఇండస్ట్రీలో పూజాకు ఆఫర్లు తగ్గిపోయాయి. పూజా ఉంటే సినిమా ప్లాప్ అవుతుందన్న టాక్ గట్టిగా నడిచింది. దాంతో కెరీర్ లో భారీ కుదుపును చూసింది పూజా హెగ్డే. ఇక ఇప్పుడిప్పుడే మళ్లీ కోలుకునే ప్రయత్నం చేస్తోంది. అందుకు తగ్గట్టుగానే మంచి మంచి ఆఫర్లు కూడా పూజాకు వస్తున్నట్టు సమాచారం.
24
బంపర్ ఆఫర్ కొట్టేసిన పూజా..
గతంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో రెండు సినిమాల్లో నటించింది పూజా హెగ్డే. దువ్వాడ జగన్నాథమ్ మూవీతో పాటు అలవైకుంఠపురములో మూవీలో ఈ జంట సందడి చేశారు. ఇక ముచ్చటగా మూడోసారి బన్నీతో కలిసి ఆడబోతోంది పూజా. ఐకాన్ స్టార్, తమిళ దర్శకుడు అట్లీ కాంబినేషన్‌లో రాబోతోన్న భారీ బడ్జెట్ మూవీ గురించి అందరికి తెలిసిందే. ఈ సినిమాకు సబంధించిన ఆసక్తి కరమైన చర్చ ప్రస్తుతం జరగుతోంది. AA22xA6 వర్కింగ్ టైటిల్ తో రూపొందుతోన్న ఈ ప్రాజెక్టులో ఓ స్పెషల్ సాంగ్ కోసం పూజా హెగ్డేను సంప్రదించినట్లు సమాచారం. అంతే కాదు ఈ సాంగ్ కోసం పూజాకు ఏకంగా 5 కోట్లు పారితోషికంగా ఆఫర్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది.
34
కూలీ సినిమాతో పెరిగిన డిమాండ్
రీసెంట్ గా రిలీజ్ అయిన కూలీ సినిమా వల్ల పూజాహెగ్డే కు డిమాండ్ భారీగా పెరిగిపోయింది. ఈసినిమాలో పూజా డాన్స్ చేసిన మోనికా... సాంగ్ కు దేశ వ్యాప్తంగా భారీగా రెస్పాన్స్ వచ్చింది. కూలీ సినిమాకు ఈ సాంగ్ చాలా ప్లస్ అయ్యింది. పూజా హెగ్డే చేసిన స్పెషల్ సాంగ్ కు వచ్చిన అద్భుతమైన స్పందన చూసి.. ఆమెకి అవకాశాలు వెల్లువెత్తుతున్నాయని సమాచారం. ఇదే నేపథ్యంలో అల్లు అర్జున్‑అట్లీ వారి సినిమాకు పూజా హెగ్డే ఐటమ్ సాంగ్ ను పెట్టాలని చూస్తున్నాట. ఈసాంగ్ పెడితే సినిమాకు ఖచ్చితంగా ప్లస్ అవుతుందని భావించినట్లు టాక్. ఈ ప్రతిపాదనకు ఆమె కూడ సానుకూలంగా స్పందించినట్లు సమాచారం.
దాదాపుగా 800 కోట్ల బడ్జెట్ తో AA22xA6 సినిమాను సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తోంది. భారీ బడ్జెట్‌తో సైన్స్‑ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్‌గా ఈసినిమా తెరకెక్కుతుంది. ఈ ప్రాజెక్టును అల్లు అర్జున్ పుట్టినరోజు అయిన ఏప్రిల్ 8న అధికారికంగా ప్రకటించారు. ప్రస్తుతం ముంబైలో షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ మూవీలో అల్లు అర్జున్ జంటగా ఆరుగురు హీరోయిన్లు నటిస్తున్నారని గట్టిగా ప్రచారం జరుగుతోంది. దీపికా పదుకొణే, జాన్వీ కపూర్, మృణాల్ ఠాకూర్, రష్మిక మందన్న వంటి పేర్లు వినిపిస్తున్నాయి. అయితే, పూజా హెగ్డే స్పెషల్ సాంగ్ విషయంలో మూవీ టీమ్ నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు.