తమన్ గొప్ప మనసుని ఆయన అభినందించారు. థాంక్యూ డియర్ తమన్.. గొప్ప మనసుతో పేషంట్ కి సాయం చేసి కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్ విజయవంతంగా జరిగేలా చేశావు. నీ కైండ్ హార్ట్ ని జీవితాంతం గుర్తు పెట్టుకుంటా అని లీలా కృష్ణ పోస్ట్ చేశారు. తమన్ తో ఉన్న ఫోటోని ఆయన షేర్ చేశారు. హైదరాబాద్ లోని ఐను హాస్పిటల్స్ లో ఈ చికిత్స జరిగింది. గాడ్ ఈజ్ గ్రేట్ డియర్ డాక్టర్ అంటూ లీలా కృష్ణ కి తమన్ రిప్లై ఇచ్చారు. పేషంట్ ప్రాణాలు నిలిచేలా సాయం చేసిన తమన్ ని నెటిజన్లు, అభిమానులు అభినందిస్తున్నారు.