విగ్నేష్ తప్పేం లేదు, అతడిని నయనతార ఎలా ప్రేమలోకి దించిందో తెలుసా.. అలా చేస్తే డైరెక్టర్ల పని అంతే  

First Published | Nov 15, 2024, 8:35 AM IST

చిత్ర పరిశ్రమలో లవ్ అఫైర్లు సాధారణంగా జరుగుతూ ఉంటాయి. నటీనటులు, దర్శకులు ప్రేమలో పడుతుంటారు. హీరోయిన్లు హీరోల ప్రేమలో మాత్రమే కాదు దర్శకుల ప్రేమలో కూడా పడుతుంటారు. గతంలో చాలా మంది హీరోయిన్లు దర్శకులని ప్రేమించి పెళ్లి చేసుకుని సెటిల్ అయ్యారు.

Nayanthara

చిత్ర పరిశ్రమలో లవ్ అఫైర్లు సాధారణంగా జరుగుతూ ఉంటాయి. నటీనటులు, దర్శకులు ప్రేమలో పడుతుంటారు. హీరోయిన్లు హీరోల ప్రేమలో మాత్రమే కాదు దర్శకుల ప్రేమలో కూడా పడుతుంటారు. గతంలో చాలా మంది హీరోయిన్లు దర్శకులని ప్రేమించి పెళ్లి చేసుకుని సెటిల్ అయ్యారు. అలాంటి జంటలలో నయనతార, విగ్నేష్ శివన్ కూడా ఉన్నారు. 

విగ్నేష్ శివన్, నయనతార ప్రేమించుకోవడం, పెళ్లి చేసుకోవడం అందరికీ తెలిసిన సంగతే. అయితే వీళ్ళిద్దరూ ఎలా ప్రేమలో పడ్డారు అనేది మాత్రం ఎవరికీ తెలియదు. ఎట్టకేలకు ఆ సస్పెన్స్ వీడింది. సౌత్ లేడీ సూపర్ స్టార్ గా ఉన్న నయన్ లవ్ స్టోరీ తెలుసుకోవాలని ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నారు. ప్రేమించుకోవడం మొదలు పెట్టాక నయన్.. విగ్నేష్ తో బహిరంగంగానే తిరిగింది. అయితే ప్రేమ ఎలా మొదలైంది.. ఎవరు ముందుగా ప్రపోజ్ చేశారు లాంటి విషయాలని నయనతార రివీల్ చేసింది. 


Nayanthara

నయనతార తొలిసారి విగ్నేష్ శివన్ దర్శకత్వంలో నానుమ్ రౌడీ దాన్ అనే చిత్రంలో నటించింది. ఈ మూవీలో విజయ్ సేతుపతి హీరో. 2015లో ఈ చిత్రం తెరకెక్కింది. విగ్నేష్ కి ఈ మూవీతో మంచి గుర్తింపు వచ్చింది. అప్పుడప్పుడే విగ్నేష్ డైరెక్టర్ గా కెరీర్ ప్రారంభిస్తున్నాడు. పాండిచ్చేరిలో ఈ చిత్ర షూటింగ్ షెడ్యూల్ జరిగిందట. పాండిచ్చేరి రోడ్లపై కొన్ని సీన్లు చిత్రీకరిస్తున్నారు. 

నయన్ మాట్లాడుతూ.. అది విజయ్ సేతుపతి నటించాల్సిన షాట్. నేను రోడ్డు పక్కన కూర్చుని నా షాట్ కోసం వెయిట్ చేస్తున్నా. విగ్నేష్.. విజయ్ సేతుపతికి సన్నివేశం వివరిస్తున్నారు. అనుకోకుండా నేను విగ్నేష్ వైపు చూశాను. విగ్నేష్ నాకు చాలా క్యూట్ గా కనిపించాడు. మళ్ళీ మళ్ళీ చూడాలనిపించేలా ఉన్నాడు. ఈసారి ఇంకా క్రేజీగా అతడి వంక చూశాను. విగ్నేష్ యాటిట్యూడ్, డైరెక్టర్ గా అతడు ప్రవర్తిస్తున్న విధానం నాకు బాగా నచ్చాయి. 

బహుశా ఆ క్షణమే విగ్నేష్ తో నేను ప్రేమలో పడ్డానేమో. మా ఇద్దరిలో ముందుగా ప్రపోజ్ చేసింది నేనే. విగ్నేష్ నాతో సినిమా గురించి మాట్లాడుతుంటే.. సినిమా గురించి తర్వాత మాట్లాడవచ్చు.. మనిద్దరం ప్రైవేట్ గా ఏమైనా మాట్లాడుకుందాం అని అతడికి హింట్ ఇచ్చా. పరోక్షంగా అతడిపై ఇష్టాన్ని తెలియజేశా. షూటింగ్ చివరి రోజు మేమిద్దరం చాలా బాధపడ్డాం. ఒకరినొకరు కలుసుకోకుండా ఉండలేకపోయాం. నయనతార విగ్నేష్ తో అలా మాట్లాడినప్పటి నుంచి అతడికి కూడా ఇష్టం ఏర్పడిందట. ఆ తర్వాత ఏం జరిగిందో అందరికీ తెలిసిందే అని నయనతార పేర్కొంది. ఆరేళ్ళు ప్రేమించుకున్న తర్వాత 2022లో వీరిద్దరూ వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం నయన్ ఇద్దరు పిల్లలకు తల్లి. 

నయనతార తన లవ్ స్టోరీ బయట పెట్టడంతో నెటిజన్లు ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు. హీరోయిన్లంతా నయనతారలాగా దర్శకులని డిస్టర్బ్ చేస్తే వాళ్ళు అట్టర్ ఫ్లాప్ అవుతారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. విగ్నేష్ కంటే ముందు నయన్.. శింబు, ప్రభుదేవాలని ప్రేమించి విడిపోయింది.   

Latest Videos

click me!