Resul Pookutty
ప్రముఖ సౌండ్ ఇంజినీర్, ఆస్కార్ అవార్డ్ గ్రహీత రసూల్ పూకుట్టి... గతంలో ఆర్‌ఆర్‌ఆర్ మూవీ మీద చేసిన ఒక ట్వీట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. దానికి రిప్లైగా కీరవాణి చేసినట్లుగా చెబుతున్న ట్వీట్ మరింత వివాదంగా మారింది.
తాజాగా మరోసారి రసూల్ పూకుట్టి తన గళం ఇనిస్ట్రాలో విప్పారు. ఈ సారి ఆయన కంగువ చిత్రాన్ని టార్గెట్ చేసారు. ఈ సినిమా సౌండ్ మిక్సింగ్ పై ఆయన చేసిన కామెంట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. ఇంతకీ రసూల్ ఏమన్నారు.
Kanguva Suriya
సూర్య (Suriya) హీరోగా దిశా పటాని (Disha Patani) హీరోయిన్ గా తెరకెక్కిన చిత్రం ‘కంగువా’ (Kanguva). ఈ చిత్రం భారీ అంచనాల నడుమ శుక్రవారం తమిళ,తెలుగుతో పాటు హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో కూడా రిలీజ్ అయ్యింది. రిలీజ్ కి ముందు సినిమాకి భారీ హైప్ ఉంది.
కానీ మార్నింగ్ షేక్ టాక్ మాత్రం నెగిటివ్ గా వచ్చింది. దర్శకుడు శివ (Siva) మంచి కథని తీసుకున్నప్పటికీ దానిని సరిగ్గా డీల్ చేయలేకపోయాడు అనే కంప్లైంట్ ఆడియన్స్ నుండి అందింది. అయితే ముందు నుండి ఉన్న హైప్ కారణంగా మొదటి రోజు అడ్వాన్స్ బుకింగ్స్, కలెక్షన్ బాగా ఉన్నాయి.
kanguva suriya
ఈ నేపధ్యంలో రసూల్ పూకుట్టి చేసిన ఓ కామెంట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. రసూల్ తన అభిప్రాయాలు నిర్మహమాటంగా చెప్తూంటారు. ఇప్పటికే ఆయన చాలా సినిమాలపై తన నెగిటివ్ కామెంట్స్ ని ,ఫీడ్ బ్యాక్ ని అందించారు. తాజాగా కంగువ చిత్రంపై ఆయన తన అభిప్రాయాన్ని ఇనిస్ట్రాలో పోస్ట్ గా పెట్టారు. సౌండ్ మిక్సింగ్ సరిగ్గా జరగలేదని, డైలాగుల్లో క్లారిటీ లేదని ఆయన అన్నారు.
రూసూల్ పెట్టిన ఇనిస్ట్రా పోస్ట్ లో ఏముంది అంటే.... నా స్నేహితుడు, రీ-రికార్డింగ్ మిక్సర్, ఈ క్లిప్‌ని నాకు పంపారు... ఇలాంటి మన జనాదరణ పొందిన చిత్రాలలో సౌండ్ గురించి రివ్యూ ను చూడటం చాలా నిరుత్సాహపరుస్తుంది.
మా క్రాఫ్ట్ మరియు కళాత్మకత రెండు కూడా లౌడ్‌నెస్ వార్‌లో చిక్కుకున్నాయి... ఎవరిని నిందించాలి?! సౌండ్ ఇచ్చిన అతన్నా? లౌడ్ నెస్ వలన ప్రేక్షకులు తలనొప్పితో బయటికి వెళ్లిపోతే ఏ సినిమాకు రిపీట్ వాల్యూ ఉండదు అంటూ చెప్పుకొచ్చారు.
ప్రస్తుతం కంగువ మూవీకి నెగటివ్ టాక్ నడుస్తోంది. ఇక కేరళ, కర్ణాటక అండ్ రెస్ట్ ఆఫ్ ఇండియా మొత్తం మీద ప్రస్తుతం ఈ మూవీ టికెట్ బుకింగ్స్ పరంగా ఓకే అనిపిస్తోంది. కానీ బ్రేక్ ఈవెన్ రావాలంటే బుకింగ్స్ జోరు పెరగాల్సిన అవసరం ఉంది.
ప్రస్తుతానికి అయితే ఈ సినిమా మొదటిరోజు ప్రపంచవ్యాప్తంగా 55 నుంచి 60 కోట్ల గ్రాస్ ఓపెనింగ్స్ ను రాబట్టిందని వినిపిస్తోంది. మరి ఇంత నెగిటివ్ టాక్ మధ్య ‘కంగువ’ (Kanguva) మూవీ వీకెండ్ లో కలెక్షన్స్ బాగుంటే అనుకున్న రేంజ్ లో వసూళ్లను వచ్చేస్తాయి. వీకెండ్ తర్వాత ఎలాగూ అనుమానమే? . ఇక ఈ సినిమా మరో ‘బాహుబలి’ అవుతుందంటూ సూర్యతో పాటు చిత్ర టీమ్ మొత్తం నమ్ముతోంది.