ప్రస్తుతం కుర్చీ తాత పాషా పేరు ట్రెండ్ అవుతోంది. ఆ మధ్యలో ఆయన చెప్పిన ‘కుర్చీ మడతపెట్టి’ Kurchi Madatha Petti డైలాగ్ నెట్టింట ఎంత సెన్సేషన్ గా మారిందో తెలిసిందే. దాంతో పాషా పాపులర్ అయ్యారు. ఒక రకంగా చెప్పాలంటే సోషల్ మీడియా సెలబ్రెటీగా మారిపోయారు.
కుర్చీ తాత చెప్పిన డైలాగ్ తో ఏకంగా సూపర్ స్టార్ మహేశ్ బాబు Mahesh Babu నటించిన లేటెస్ట్ ఫిల్మ్ Guntur Kaaram లో సాంగ్ పెట్టడం ప్రస్తతం చర్చనీయాంశంగా మారింది. మొత్తానికి Kurchi Madatha Petti Song Promo రిలీజ్ తో అందరి చూపు గుంటూరు కారంపైనే ఉంది.
అయితే, ఈ సాంగ్ ప్రోమో విడుదల తర్వాత రెండ్రోజులు కనిపించని కుర్చీ తాత పాషా తాజాగా ఓ యూట్యూబ్ ఛానెల్ కు ఇంటర్వ్యూ ఇచ్చారు. కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. తను రెండ్రోజుల కింద వరంగల్ లోని తన బంధువుల ఇంటికి వెళ్లినట్టు చెప్పారు.
అక్కడే ఉన్నానని, తన భార్య ఏడ్వటంతో వెనక్కి వచ్చినట్టు తెలిపారు. ఇక ‘గుంటూరు కారం’లో తన పాటను పెట్టడం హ్యాపీగా ఉందని చెప్పారు. ఆ పాటను తనే పాడానని కూడా చెప్పాడు. మరో సింగర్ కూడా గాత్రం అందించినట్టు తెలుస్తోంది.
ఇక థమన్ తనకు రూ.లక్ష మాత్రం అందించినట్టు ఇంటర్వ్యూలో తెలిపారు. మహేశ్ బాబును కలిసే అవకాశం రాలేదన్నారు. ఒకసారి తను స్టూడియోకు వెళ్లే వరకే బాబు కారు వెళ్లిపోయిందని చెప్పారు. ప్రస్తుతం ‘కుర్చీ మడతపెట్టి’ ఫుల్ సాంగ్ రాబోతోంది. ఆ తర్వాత ఎంత సెన్సేషన్ గా ఉండబోతుందనేది చూడాలి.
ఈ చిత్రాన్ని మాటల మాంత్రికుడు త్రివ్రికమ్ శ్రీనివాస్ Trivikram దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. శ్రీలీలా Sreeleela, మీనాక్షి చౌదరి Meenakshi Chawdhary హీరోయిన్లుగా నటిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా 2024 జనవరి 12న విడుదల కాబోతోంది.