'హను మాన్' సెన్సార్ రివ్యూ వచ్చేసింది, మైండ్ బ్లోయింగ్ విజువల్స్.. సంక్రాంతి సినిమాలకు దెబ్బ పడడం ఖాయం ?

Published : Dec 30, 2023, 03:13 PM IST

చైల్డ్ ఆర్టిస్ట్ గా తెలుగులో గుర్తింపు సొంతం చేసుకున్న యువ నటుడు తేజ సజ్జా ప్రస్తుతం హీరోగా ఒక్కో మెట్టు ఎదుగుతున్నాడు. వైవిధ్యమైన చిత్రాలు చేస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్నాడు.

PREV
17
'హను మాన్' సెన్సార్ రివ్యూ వచ్చేసింది, మైండ్ బ్లోయింగ్ విజువల్స్.. సంక్రాంతి సినిమాలకు దెబ్బ పడడం ఖాయం ?

చైల్డ్ ఆర్టిస్ట్ గా తెలుగులో గుర్తింపు సొంతం చేసుకున్న యువ నటుడు తేజ సజ్జా ప్రస్తుతం హీరోగా ఒక్కో మెట్టు ఎదుగుతున్నాడు. వైవిధ్యమైన చిత్రాలు చేస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్నాడు. ప్రయోగాల బాట పడుతూ పెద్ద సాహసాలే చేస్తున్నాడు ఈ యంగ్ హీరో. 

27

ప్రస్తుతం తేజ సజ్జా.. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో హను మాన్ అనే పాన్ ఇండియా చిత్రంలో నటిస్తున్నాడు. హను మాన్ చిత్రం ఆంజనేయ స్వామి నేపథ్యంలో విజువల్ వండర్ గా తెరకెక్కుతోంది. తేజ సజ్జా, ప్రశాంత్ వర్మ హను మాన్ తో పెద్ద అద్భుతమే సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ చిత్రంలో తేజ సజ్జా సూపర్ హీరోగా నటిస్తున్నాడు. అమృత అయ్యర్ కథానాయికగా నటిస్తోంది. 

37

సంక్రాంతి కానుకగా ఈ చిత్రం జనవరి 12 న పాన్ ఇండియా రిలీజ్ కి రెడీ అవుతోంది. ఈ క్రమంలో ఒక్కో కార్యక్రమాన్ని పూర్తి చేసుకుంటోంది. తాజాగా హను మాన్ చిత్ర సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. సెన్సార్ సభ్యులు ఈ చిత్రానికి యు/ఏ సర్టిఫికేట్ జారీ చేశారు. డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఈ చిత్రానికి 2 గంటల 38 నిమిషాల రన్ టైమ్ ఫైనల్ చేశారు. 

47

హను మాన్ చిత్రానికి సెన్సార్ సభ్యులు ఇచ్చిన రివ్యూ, రెస్పాన్స్ కూడా ప్రస్తుతం వైరల్ గా మారింది.  ఈ చిత్రంలో ఉన్న క్వాలిటీ, విజువల్స్ మైండ్ బ్లోయింగ్ అనిపించే విధంగా ఉన్నాయట. యాక్షన్ అంశాలు భారీ పాన్ ఇండియా చిత్రాలకు ధీటుగా తెలుస్తోంది. సెన్సార్ సభ్యులు చిత్ర యూనిట్ ని అభినందించినట్లు తెలుస్తోంది. 

57

ప్రశాంత్ వర్మ స్క్రీన్ ప్లే, కంటెంట్ చూపించిన విధానం అద్భుతంగా ఉన్నట్లు సెన్సార్ సభ్యులు అభినందించారట. ఏఈ మ్యాటర్ బయటకి రావడంతో సంక్రాంతి సినిమాలకు హను మాన్ గట్టి పోటీ ఇవ్వడం ఖాయం అని అంటున్నారు. సంక్రాంతి సినిమాల ఓపెనింగ్స్ కి హను మాన్ గండి పెట్టబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. 

67

హను మాన్ రిలీజ్ అవుతున్న రోజే సూపర్ స్టార్ మహేష్ బాబు గుంటూరు కారం చిత్రం కూడా రిలీజ్ అవుతోంది. దీనితో అభిమానుల్లో ఉత్కంఠ మరింతగా పెరిగిపోతోంది. గుంటూరు కారం చిత్రం మహేష్ బాబు మూవీ.. కానీ ఈ చిత్రంతో పోల్చుకుంటే హను మాన్ లో చాలా ప్రత్యేకతలు కనిపిస్తున్నాయి. చిన్న పిల్లలని ఆకర్షించే కంటెంట్ ఈ చిత్రంలో ఉంది. 

77

అదే సమయంలో వెంకటేష్ సైంధవ్, రవితేజ ఈగల్ చిత్రాలు వస్తున్నాయి. నాగార్జున నా సామిరంగ చిత్రం గురించి ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో హను మాన్ చిత్ర ఎఫెక్ట్ ఏ మూవీపై పడనుందో అనే ఉత్కంఠ నెలకొని ఉంది. 

click me!

Recommended Stories