
`జబర్దస్త్` కామెడీ షో నుంచి యాంకర్ సౌమ్య రావు ఇటీవల తప్పుకుంది. కానీ ఆమెని తప్పించారనే ప్రచారం జరుగుతుంది. దీనిపై సౌమ్యరావు స్పందించడం లేదు, నిర్వాహకులు స్పందించరు. ఈ నేపథ్యంలో ఒక సస్పెన్స్ క్రియేట్ అయ్యింది. ఆ తర్వాత జడ్జ్ లు మారుతూ వచ్చారు. కొత్త పాత ఇలా రకరకాల మార్పులు జరిగాయి. దీంతో మరింత ఆసక్తి నెలకొంది.
దీనికితోడు `జబర్దస్త్` షో ఇక ఉండబోదని, స్టాప్ చేస్తున్నట్టు ప్రచారం జరిగింది. ఇలా రకరకాల వార్తల నేపథ్యంలో తాజాగా ఓ విషయం బయటకు వచ్చింది. అసలు యాంకర్ సౌమ్య రావుని తప్పించారా? ఆమెనే తప్పుకుందా అనేదానిపై ఓ ఆసక్తికర విషయం లీక్ అయ్యింది. ఇది కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తుంది. తెలుస్తున్న సమాచారం మేరకు జబర్దస్త్ షో నుంచి సౌమ్య రావుని నిర్వాహకులే తప్పించినట్టు తెలుస్తుంది. దానికి బలమైన కారణం వినిపిస్తుంది.
గతంతో పోల్చితే `జబర్దస్త్` షోకి రేటింగ్ రావడం లేదట. ఆశించిన స్థాయిలో హైప్ రావడం లేదు. గతంలో ఉన్న క్రేజ్ లేదు. అంతగా షో పండటం లేదు. రేటింగ్ చాలా వరకు పడిపోయిందట. సౌమ్య రావుని తప్పించడానికి ఇదొక కారణమని తెలుస్తుంది. అయితే సౌమ్య రావు వల్లే రేటింగ్ రావడం లేదనేది కాదు, నిర్వాహకులు కొత్త ప్రయోగాలు చేస్తున్నారు. అందులో భాగంగా జడ్జ్ ల నుంచి యాంకర్ల వరకు, కమెడియన్ల టీమ్‌ల మార్పులను కూడా చేస్తున్నట్టు తెలుస్తుంది.
సౌమ్య రావుని తప్పించిన తర్వాత జడ్జ్ లుగా మారారు. అయితే ఖుష్బూ డేట్స్ కుదరకపోవడం వల్ల మహేశ్వరీని తీసుకొచ్చారు. ఆమె వల్ల రేటింగ్ రావడం లేదు. దీంతో మనోని మళ్లీ దింపారు. అయినా పెద్దగా యూజ్ లేదు. పైగా కృష్ణభగవాన్, మనో ఇలా ఇద్దరు మేల్స్ కావడంతో గ్లామర్ పాళ్లు తగ్గుతాయి. మళ్లీ ఖుష్బూనే జడ్జ్ గా వ్యవహరిస్తున్నారు.
సౌమ్య రావుని తప్పించిన తర్వాత జడ్జ్ లుగా మారారు. అయితే ఖుష్బూ డేట్స్ కుదరకపోవడం వల్ల మహేశ్వరీని తీసుకొచ్చారు. ఆమె వల్ల రేటింగ్ రావడం లేదు. దీంతో మనోని మళ్లీ దింపారు. అయినా పెద్దగా యూజ్ లేదు. పైగా కృష్ణభగవాన్, మనో ఇలా ఇద్దరు మేల్స్ కావడంతో గ్లామర్ పాళ్లు తగ్గుతాయి. మళ్లీ ఖుష్బూనే జడ్జ్ గా వ్యవహరిస్తున్నారు.
అయితే సౌమ్య రావు స్థానంలో బిగ్ బాస్ బ్యూటీ సిరి హన్మంతుని తీసుకొచ్చారు. ఆమె అంతకు ముందు ఒకటి రెండు షోస్ కి యాంకర్ గా చేసింది. యాక్టర్‌గా మెప్పిస్తుంది. `జవాన్`లోనూ మెరిసి షాకిచ్చింది సిరి. ఇప్పుడు `జబర్దస్త్ ` షోకి యాంకర్‌గా చేసే అవకాశం రావడం విశేషం. మరి సిరి హన్మంతు వచ్చాక ఈ కామెడీ షో రేటింగ్ పెరిగిందా? లేదా అనేది చూడాలి.
గత తొమ్మిదేళ్లుగా జబర్దస్త్ షోకి అనసూయ యాంకర్‌గా వ్యవహరించింది. అందంతో అభినయంతో మెప్పించింది. పిచ్చిగా రేటింగ్ తీసుకొచ్చింది. కానీ అనూహ్యంగా ఇటీవల ఆమె తప్పుకుంది. ఆమె స్థానంలో కన్నడ బ్యూటీ సౌమ్యరావుని తీసుకొచ్చారు. ప్రారంభంలో ఆమె బాగా మెప్పించింది. హైపర్ ఆదితో కలిసి పంచ్‌లతో ఫేమస్ అయ్యింది. జడ్జ్ ల నుంచి, కమెడియన్ల వరకు అందరికి పంచ్‌లు వేస్తూ అలరించింది. కానీ ఆ తర్వాత ఆమె యాంకరింగ్ చాలా సప్పగా ఉందనే కామెంట్స్ వచ్చాయి. అది రేటింగ్‌పై కూడా ఎఫెక్ట్ పడిందని, దీంతో ఆమెని తప్పించాల్సి వచ్చిందని అంటున్నారు.
మరి ఇందులో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది. ఇప్పుడు రేటింగ్ ఎంత మేరకు వస్తుంది? ఇంకా ఎన్ని మార్పులు చేస్తారనేది చూడాలి. ఇదిలా ఉంటే `జబర్దస్త్` షోనే స్టాప్ చేస్తున్నారనే వార్తలు కూడా ఆ మధ్య వినిపించాయి. కానీ రెండు కలిపి ఒక షోగా తీసుకురావాలనే ఆలోచనలో కూడా మల్లెమాల టీమ్ ఉందని తెలుస్తుంది. కొత్తగా మరో కొత్త షోని తీసుకురావాలనుకుంటున్నట్టు తెలుస్తుంది. అయితే ఇది ప్రాథమిక ఆలోచనే అని అంటున్నారు. కానీ మున్ముందు ఏదైనా జరగొచ్చనేది టాక్.