దళపతి విజయ్ తన చివరి సినిమా 'జన నాయగన్'తో చాలా కాలంగా వార్తల్లో ఉన్నారు. ప్రస్తుతానికి ఈ సినిమా రిలీజ్‌పై ఎలాంటి క్లారిటీ లేదు. ఈ గ్యాప్‌లో, విజయ్ నటించిన కొన్ని అదిరిపోయే సినిమాలు ఓటీటీలో అందుబాటులో ఉన్నాయి. అవేంటంటే?
2023లో వచ్చిన ఈ యాక్షన్ థ్రిల్లర్ 'లియో' బాక్సాఫీస్‌ను బద్దలు కొట్టింది. ఈ సినిమాను ప్రేక్షకులు విపరీతంగా ఇష్టపడ్డారు. ఇందులో విజయ్‌తో పాటు త్రిష కృష్ణన్, సంజయ్ దత్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమాను నెట్‌ఫ్లిక్స్‌లో చూడొచ్చు.
26
ది గోట్
దళపతి విజయ్ సైన్స్ ఫిక్షన్ ఫిల్మ్ 'ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్' 2024లో రిలీజైంది. ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది. ఇందులో విజయ్‌తో పాటు ప్రశాంత్, ప్రభుదేవా, మోహన్, జయరాం, అజ్మల్ అమీర్, వైభవ్, యోగి బాబు, ప్రేమ్‌గీ అమరేన్, స్నేహ, లైలా, మీనాక్షి చౌదరి ప్రధాన పాత్రల్లో ఉన్నారు. ఈ సినిమాను నెట్‌ఫ్లిక్స్‌లో చూడొచ్చు.
36
వారసుడు
దళపతి విజయ్ నటించిన 'వారసుడు' 2023లో విడుదలైంది. ఇది ఒక ఫ్యామిలీ డ్రామా యాక్షన్ ఫిల్మ్. ఇందులో విజయ్‌తో పాటు రష్మిక మందన్న, ప్రకాష్ రాజ్, శ్రీకాంత్, జయసుధ, సంగీత, సంయుక్త షణ్ముఘనాధన్, నందిని రాయ్, యోగి బాబు, గణేష్ వెంకట్రామన్, సుమన్ నటించారు. ఈ అద్భుతమైన సినిమాను నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియోలో చూడొచ్చు.
'మాస్టర్' 2021లో వచ్చిన దళపతి విజయ్ యాక్షన్ డ్రామా ఫిల్మ్. ఇందులో విజయ్‌తో పాటు విజయ్ సేతుపతి, మాళవిక మోహనన్, ఆండ్రియా జెరెమియా, అర్జున్ దాస్, శంతను భాగ్యరాజ్, గౌరీ జి కిషన్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమాను అమెజాన్ ప్రైమ్ వీడియోలో చూడొచ్చు.
56
తెరి
'తెరి' 2016లో వచ్చిన యాక్షన్ థ్రిల్లర్ సినిమా. ఇందులో విజయ్, సమంత రూత్ ప్రభు, అమీ జాక్సన్, నైనికా ప్రధాన పాత్రలు పోషించారు. ఈ పవర్‌ఫుల్ యాక్షన్ థ్రిల్లర్‌ను అమెజాన్ ప్రైమ్ వీడియోలో చూసి ఎంజాయ్ చేయొచ్చు.
66
మెర్సల్
దళపతి విజయ్ నటించిన 'మెర్సల్' 2017లో రిలీజైన యాక్షన్ థ్రిల్లర్. ఈ సినిమాలో విజయ్ ట్రిపుల్ రోల్‌లో కనిపించారు. ఆయనతో పాటు నిత్యా మీనన్, ఎస్‌జే సూర్య, కాజల్ అగర్వాల్, సమంత రూత్ ప్రభు, వడివేలు, సత్యరాజ్, హరీశ్ పేరడీ, కోవై సరళ, సత్యన్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఇంట్లో కూర్చొని ఈ సినిమాను నెట్‌ఫ్లిక్స్‌లో చూసి మీ మైండ్ ను రీ ఫ్రెష్ చేసుకోవచ్చు.