కాస్ట్లీ కార్లు.. ఇంద్రభవనం లాంటి ఇల్లు.. దళపతి విజయ్ ఆస్తుల విలువ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..?

First Published Jan 18, 2023, 3:11 PM IST

తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ తెలుగు మార్కెట్ పై కూడా కన్నేశాడు. ఇక్కడ కూడా వరుస సినిమాలు ప్లాన్ చేసుకుంటున్నాడు. పాన్ ఇండియా స్టార్ గా ఎదగాలని చూస్తున్నాడు. ఈక్రమంలో ఆయన రెమ్యూనరేషన్ తో పాటు.. విజయ్ ఆస్తులు పై కూడా రకరకాల వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.. ఇంతకీ విజయ్ ఆస్తులు ఎన్ని కోట్లు ఉండి ఉంటాయి.

తమిళంలో స్టార్ హీరోగా వెలుగు వెలుగుతున్నాడు దళపతి విజయ్. ఆయనకు ఉన్న ఫాలోయింగ్.. ఫ్యాన్ బేస్ మామూలు విషయం కాదు. సూపర్ స్టార్ రజనీ కాంత్ తరువాత ఆకోవలో దళపతి విజయ్ కు ఫ్యాన్స్ ఉన్నారు. అటు అజిత్ కు కూడా అదే రేంజ్ లో ఉన్నారను కోండి అది వేరే విషయం. కాని విజయ్ మాత్రం సంపాదనలో టాప్ పొజీషన్ లో ఉన్నాడట. 

రీసెంట్ గా ఆయన టాలీవుడ్ నుటార్గెట్ గా పెట్టుకుని.. తెలుగు దర్శకుడు విజయ్ పైడిపల్లితో  చేసిన వారసుడు మూవీ పెద్దగా ప్రభావం చూపించలేకపోయింది. అంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న  తమిళంలో ఈ సినిమా యావరేజ్ గా నిలిస్తే.. తెలుగులో ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. వారసుడు సినిమాతో తెలుగులో మార్కెట్ పెరుగుతుందని భావించిన విజయ్ కు ఈ సినిమా ఫలితం నిరాశనే మిగిల్చింది. 

అయితే రెమ్యూనరేషన్ విషయంలో మాత్రం విజయ్  ఏమాత్రం తగ్గడంలేదు.  ఈ సినిమాకు విజయ్ 150 కోట్లు తీసుకున్నాడని టాక్.  ఇక ఈ క్రమంలో.. విజయ్ ఆస్తుల గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో కొన్ని టాపిక్స్ వైరల్ అవుతున్నాయి. కాస్ట్లీ కార్లు.. భరీ భవంతులతో పాటు.. ఎస్టేట్ లు.. ఫామ్ హౌస్ లు.. పొలాలు కూడా కొనుగోలు చేసినట్టు టాక్. అయితే విజయ్ ఆస్తుల విలువ ఏకంగా 445 కోట్ల రూపాయలు అని బోగట్టా. 
 

తమిళ ఫిల్మ్  ఇండస్ట్రీలో ఈ స్థాయిలో ఆస్తులను కలిగి ఉన్న హీరోలు చాలా తక్కువమంది మాత్రమే ఉన్నారు. అందులో విజయ్ టాప్ ప్లేస్ లో ఉన్నట్టు టాక్. అంతే కాదు విజయ్ సినిమాలతో పాటు కొన్ని బిజినెస్ లకు కూడా ఉన్నట్టు సమాచారం. వాటితో పాటు ఆయన యాడ్స్ ద్వారా కూడా  కోట్ల రూపాయిలు తీసుకోవడంతో.. భారీ స్థాయిలో ఆదాయం దక్కుతోందని సమాచారం. 
 

విజయ్ కు ఖరీదైన కార్లు, బంగ్లాలు ఉన్నాయని బోగట్టా. విజయ్ ఆస్తులు ఈ రేంజ్ లో ఉన్నాయా అని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. విజయ్ ఇతర హీరోలకు భిన్నంగా కథలను ఎంచుకుంటున్నారు. మాస్ సినిమాలలో నటిస్తూనే ఆ సినిమాలు కొత్తగా ఉండేలా విజయ్ కెరీర్ ను ప్లాన్ చేసుకుంటున్నారు.

చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ ను మొదలు పెట్టాడు విజయ్. హీరోగా మారి.. ఒక్కో మెట్టు ఎక్కుతూ.. కోలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరిగా ఎదిగాడు. ఏ హీరో తీసుకోని స్థాయిలో పారితోషికం తీసుకునే స్థాయికి ఎదిగారు విజయ్. ఇక త్వరలో ఆయన  రాజకీయాల్లోకి వస్తారనే మాట కూడా వినిపిస్తుంది. దాదాపు ఆయన పొలిటికల్  ఎంట్రీ కన్ ఫార్మ్ అయినట్టే తెలుస్తోంది. 
 

Vijay

రజనీకాంత్ పాలిటిక్స్ లోకి వస్తానని వెనకడుగు వేయడంతో.. విజయ్ కు లైన్ క్లియర్ అయినట్టు టాక్. ఇక నటన విషయంలో విజయ్ పైన నెగిటివ్ కామెంట్లు చేసినా వాటిని పట్టించుకోకుండా విజయ్ ముందుకు వెళుతున్నారు. ఇక ముందు ముందు ఆయన ఎలాంటి స్టెప్పులు వేస్తారో చూడాలి. 

click me!