`వీక్‌` అంటూ ట్రోల్‌ చేసిన వారికి సమంత ఆన్సర్‌ చెంప దెబ్బే.. ఒక్క ఫోటోతో నోళ్లు మూయించిందిగా!

Published : Jan 18, 2023, 02:35 PM ISTUpdated : Jan 18, 2023, 02:38 PM IST

స్టార్‌ హీరోయిన్‌ సమంత మయోసైటిస్‌ వ్యాధితో బాధపడుతున్న విషయం తెలిసిందే. దీని కారణంగా చాలా ట్రోల్స్ కి గురయ్యింది. విమర్శలు ఎదుర్కొంది. ఈ నేపథ్యంలో తాజాగా దానికి అదిరిపోయే సమాధానం ఇచ్చింది సమంత. 

PREV
15
`వీక్‌` అంటూ ట్రోల్‌ చేసిన వారికి సమంత ఆన్సర్‌ చెంప దెబ్బే..  ఒక్క ఫోటోతో నోళ్లు మూయించిందిగా!

సమంత గత కొంత కాలంగా మయోసైటిస్‌(కండరాలకు సంబంధించిన) వ్యాధితో బాధపడుతుంది. ఈ అరుదైన వ్యాధిని ఆమెని బాగా దెబ్బతీసింది. ఓ వైపు నాగచైతన్యతో విడాకుల కారణంగా బాగా కుంగిపోయింది. మానసికంగా ఎంతో మదనపడింది. దాన్నుంచి కోలుకుంటున్న సమయంలో మయోసైటిస్‌ ఆమెని మరింతగా కుంగదీసింది. దెబ్బ మీద దెబ్బలా మారిపోయింది. 

25

అయినా అన్నీ తానై భరించింది. వ్యాధితో పోరాడింది. ఒంటరిగా పోరాటం చేసింది. దాదాపుగా విజయం సాధించింది. కొంత ఆ ప్రభావం ఉన్నా,  ఇప్పుడిప్పుడే దాన్నుంచి బయటపడుతుంది. రెగ్యూలర్‌ లైఫ్‌లోకి వస్తుంది. అయితే ఇటీవల ఓ మీడియా సంస్థ సమంత `వీక్‌` అంటూ కామెంట్‌ చేస్తూ పోస్ట్ పెట్టారు. ఆమె తన గ్లామర్‌, వెలుగు కోల్పోయిందంటూ కామెంట్‌ చేశారు. అంతేకాదు చాలా `వీక్‌`  అయిపోయిందని కామెంట్‌ చేయడం గమనార్హం. 

35

దీనిపై సమంత కూడా  స్పందించింది. తన లాంటి వ్యాధి మీకు రాకూడదని దేవుడిని కోరుకుంటున్నా అని మతిపోయేలా కౌంటర్‌ ఇచ్చింది. అంతటితో ఆగలేదు ఇప్పుడు మరో కౌంటర్‌ పెట్టింది. తనపై వచ్చిన విమర్శలను సవాళ్లుగా తీసుకుని తానేంటో చాటుకుంటుంది. తాను వీక్‌ కాదని నిరూపించుకుంటుంది. అందులో భాగంగా జిమ్‌లో ఆమె శ్రమిస్తూ, కండరాలు తిరిగినా దేహంతో ఓ అదిరిపోయే పోస్ట్ పెట్టింది. `తాను అంత సున్నితం కాదు` అని పేర్కొంది. తన జిమ్‌ ఫోటోని తన ఫిట్‌ నెస్‌ ట్రైనర్‌ జునైద్‌ షేక్‌ తీయగా, దాన్ని ఇన్‌స్టా స్టోరీస్‌లో షేర్‌ చేసింది సమంత.
 

45

గత కామెంట్లకి సమాధానంగా ఈ పోస్ట్ పెట్టడం విశేషం. దీంతో ఇది వైరల్‌  అవుతుంది. హాట్‌ టాపిక్‌ అవుతుంది. నెట్టింట రచ్చ లేపుతుంది.  సమంత ఈజ్‌ బ్యాక్‌ అంటూ పోస్ట్ లు పెడుతున్నారు. సమాధానం అదిరిపోయిందని, ఇది చాలా ఇంకా కావాలా? అని,  సమంత ఇన్‌స్పైరింగ్‌ లేడీ అని  పోస్ట్  లు  పెడుతున్నారు. ఇంకొందరు సమంత తమకు ఎలా స్ఫూర్తినిచ్చిందో వెల్లడించారు. ఈ పోస్ట్ సైతం నెట్టింట చక్కర్లు కొడుతుంది. 
 

55
Shaakuntalam

ఆ మధ్య `యశోద` చిత్రంతో మెరిసి సమంత ఇప్పుడు `శాకుంతలం`తో ఆడియెన్స్ ముందుకు రాబోతుంది. గుణశేఖర్‌ రూపొందించిన ఈ ఎపిక్‌ లవ్‌ స్టోరీ చిత్రమిది.  శకుంతల, దుష్యంతుడి ప్రేమ కథతో ఈ సినిమా రూపొందుతుంది. శకుంతలగా సమంత, దుష్యంతుడిగా దేవ్‌ మోహన్‌ నటిస్తున్నారు. గుణశేఖర్‌, దిల్‌రాజు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఫిబ్రవరి 17న విడుదల కానుంది. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories