Thalapathy Vijay సినిమా స్టోరీ లీక్, జన నాయగన్ కథ ఇదేనా? షాక్ లో మూవీ టీమ్

Published : Dec 19, 2025, 02:43 PM ISTUpdated : Dec 19, 2025, 02:58 PM IST

దళపతి విజయ్ కెరీర్‌లో చివరి సినిమా, ఆయన పొలిటికల్ కెరీర్ కు కూడా టర్నింగ్ పాయింట్‌గా నిలుస్తుందంటున్న 'జన నాయగన్' రిలీజ్ కు రెడీగా ఉంది. ఈ సినిమా జనవరి 9న రిలీజ్ కానుంది. ఈక్రమంలో ఈసినిమా  కథ లీక్ అవ్వడం.. మేకర్స్ ను కలవరపెడుతోంది. 

PREV
15
దళపతి విజయ్ జన నాయగన్ కథ

దళపతి విజయ్ కెరీర్‌లో టర్నింగ్ పాయింట్‌గా నిలుస్తుందంటున్న 'జన నాయగన్' సినిమాపై అంచనాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. సినిమా గురించి వరుస అప్‌డేట్స్ వస్తుండగా, మూవీ టీమ్ కు షాక్ తగిలింది. ఈ సినిమా  కథ లీకైనట్టు తెలుస్తోంది.  'జన నాయగన్' బలమైన రాజకీయ నేపథ్యం, మంచి సస్పెన్స్ యాక్షన్ కథాంశంతో ఉంటుందని ఇది స్పష్టం చేస్తుంది.

25
జననాయకన్ కథ ఇదే?

'జన నాయగన్' సినిమా కథ రెండు సిద్ధాంతాల మధ్య ఘర్షణ (Clash of Ideologies) నేపథ్యంలో సాగుతుంది. అందులో "ఒకరు ప్రజల కోసం నిలబడితే, మరొకరు అధికారాన్ని నియంత్రించడంలో ఆనందపడతారు." ఈ రెండు విభిన్న సిద్ధాంతాలు కలిగి ఉన్న ఇద్దరు  నాయకుల మధ్యే ప్రధాన ఘర్షణగా ఈ కథ కొనసాగుతుంది.  విజయ్ రాజకీయ జీవితానికి ఉపయోగపడేలా సినిమా కథను రాసుకున్నాట్టు తెలుస్తోంది. 

35
ఇద్దరు ప్రత్యర్థుల మధ్య గొడవ..

డిఫరెంట్ ఆలోచనలు ఉన్న ఇద్దరు ప్రత్యర్థుల మధ్య సంఘర్షణ జననాయగన్ సినిమా. గతంలో కలిసి ఉన్న వారిద్దరు ఎలా విడిపోయారు. వారి మధ్య ఏం జరిగింది. చాలా ఏళ్ల ముందు జరిగిన ప్లాష్ బ్యాక్ స్టోరీ ఏంటి అనేది ఈ సినిమాలో ఇంట్రెస్టింగ్ పాయింట్.  ఈ రెండు పాత్రల మధ్య  పాత ఘర్షణ ప్రభావమే వారిని మళ్లీ వర్తమానంలో కలిసేలా చేస్తుంది. ఇది సినిమా మొదట్లోనే బలమైన సస్పెన్స్‌ను క్రియేట్ చేస్తుంది.

45
న్యాయం కోసం పోరాడే పోలీసు కథ

కథలో  ఒక చిన్నారి వల్ల పాత గొడవను మళ్లీ బయటకు వస్తుంది. ఆ చిన్నారి భయం గతం తాలూకు గాయాలను మళ్లీ తెరిచి, సంఘటనలను వర్తమానంలోకి లాక్కొస్తుంది. ఇదే కథలో మలుపు కావచ్చు. ఈ నేపథ్యంలో, ఒక మాజీ పోలీస్ అధికారి రంగంలోకి దిగుతారు. అతను ఆ చిన్నారి భయానికి న్యాయం చేయడానికి పోరాడతాడు. అతనే విజయ్ దళపతి. 

55
విజయ దళపతి రెండు పాత్రల్లో

ఈ కథ మొదట వ్యక్తిగత పగతో మొదలైనా, సమయం గడిచేకొద్దీ ఇది పెద్ద యుద్ధంగా మారుతుంది. ఒక వ్యక్తితో మొదలై.. సామాజిక న్యాయం కోసం వ్యవస్థపై పోరాటంగా ఇది మారుతుంది.  ప్రజల మంచి కోసం జరిగే యుద్ధంగా మారుతుంది. ఈ సినిమాలో దళపతి విజయ్  రాజకీయ నాయకుడిగానే కాకుండా, మాజీ పోలీస్ అధికారిగా కూడా ద్విపాత్రాభినయం చేయవచ్చని కోలీవుడ్ టాక్. ఈ కథ సారాంశం, 'జన నాయగన్' కేవలం బాక్సాఫీస్ హిట్ సినిమానే కాకుండా,రాజకీయంగా విజయ్ కు ఉపయోగపడే విధంగా తీర్చిదిద్దినట్టు తెలుస్తోంది. 

Read more Photos on
click me!

Recommended Stories