బాలీవుడ్ హీరోయిన్ శిల్పా శెట్టి ఇంట్లో ఐటీ దాడులు జరిగాయా..?కోట్ల లావాదేవీల విషయంలో విచారణ జరుగుతోందా? ఈ విషయంలో బాలీవుడ్ జంట ఇచ్చిన క్లారిటీ ఏంటి? అసలు శిల్పా శెట్టి విషయంలో ఏం జరుగుతోంది?
స్టార్ సీనియర్ హీరోయిన్ శిల్పా శెట్టి ఇంట్లో ఆదాయపు పన్ను శాఖ దాడులు చేసిందని.. ఇది 60 కోట్ల రూపాయల మోసం కేసుకు సంబంధించిన విషయంలో కేసు నమోదు అయ్యిందని వార్తలు వైరల్ అయ్యాయి. శిల్పాతో పాటు రాజ్ కుంద్రా పై ఐపీసీ 420 కింద మోసం కేసు నమోదైందని, ఈడీ విచారణ కొనసాగుతోందంటూ వార్తలు వచ్చాయి.
25
శిల్పా శెట్టి, రాజ్ కుంద్రాపై 60 కోట్ల మోసం కేసు
అంతే కాదు శిల్పా శెట్టికి సబంధించిన బెంగళూరులోని బాస్టియన్ రెస్టారెంట్‌పై లేట్ నైట్ పార్టీలు జరిగాయన్న ఆరోపణలతో ఎఫ్‌ఐఆర్ నమోదైందని కూడా ప్రచారం జరుగుతోంది. వ్యాపారవేత్త దీపక్ కొఠారి ఫిర్యాదు మేరకు, శిల్పా దంపతులపై ఐపీసీ సెక్షన్ 420 కింద మోసం కేసు నమోదైనట్టు, అందుకు గాను ఈడీ ఈ కేసుపై విచారణ జరుపుతోందని కూడా వార్తలు బయటకు వచ్చాయి. కానీ స్టార్ జంట ఈ ఆరోపణలను ఖండించింది.
35
పెట్టుబడి పేరుతో మోసం చేశారని ఆరోపణలు.
బెస్ట్ డీల్ ప్రైవేట్ లిమిటెడ్‌లో పెట్టుబడి పెట్టమని ఒప్పించి, 60 కోట్ల డబ్బును తమ వ్యక్తిగత ప్రయోజనాలకు వాడుకున్నారని వ్యాపారవేత్త దీపక్ కొఠారి ఆరోపించారు. చాలా కాలంగా ఈ వివాదం నడుస్తున్న క్రమంలో శిల్పా శెట్టి, రాజ్ కుంద్రాకు సబంధించిన రకరకాల వార్తలు వైరల్ అవుతూ వస్తున్నాయి.
ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా, నిర్ణీత సమయం దాటిన తర్వాత కూడా రెస్టారెంట్‌ను నడుపుతున్నారని, లేట్ నైట్ పార్టీలు నిర్వహిస్తున్నారని బెంగళూరులోని శిల్పాశెట్లి రెస్టారెంట్ పై రకరకాల ఆరోపణలు వచ్చాయి.
55
ఖండించిన శిల్పా శెట్టి, రాజ్ కుంద్రా
తమపై వస్తున్న ఆరోపణలు నిరాధారమైనవని, కేసు కోర్టులో విచారణలో ఉన్నందున సంయమనం పాటించాలని శిల్పా, రాజ్ కుంద్రా దంపతులు కోరారు. ఇప్పటికే శిల్పా శెట్టి, రాజ్ కుంద్రా రకరకాల కారణాలతో వివాదాల్లో చిక్కుకుని ఉన్నారు. ఇలా ప్రతీ సారి ఏదో ఒక రూమర్ సోషల్ మీడియాలో వస్తుండటంతో.. వారు మరితగా ఇబ్బందిపడాల్సి వస్తోంది.