50 ఏళ్లు దాటినా.. కుర్ర హీరోలను మించి ఫిట్ నెస్ చూపిస్తున్నాడు సౌత్ స్టార్ హీరో దళపతి విజయ్. ఆయన చివరి సినిమా జన నాయగన్ కోసం దళపతి విజయ్ చెమటలు కక్కుతూ డ్యాన్స్ రిహార్సల్స్ చేస్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
జన నాయగన్ రిలీజ్ డేట్.. దళపతి విజయ్ సిగ్నేచర్ స్టెప్
తమిళ ఫిల్మ్ ఇండస్ట్రీలో డ్యాన్స్ అంటే ముందుగా గుర్తుకు వచ్చే పేరు దళపతి విజయ్. ఆయన ప్రతి పాటకు ఒక సిగ్నేచర్ స్టెప్ ఉంటుంది. పాట విడుదల కాగానే చిన్నపిల్లల నుంచి పెద్ద వాళ్ల వరకూ అందరూ ఆ స్టెప్‌లతో రీల్స్ కూడా చేస్తుంటారు.
29
అభిమానులు ఊగిపోతుంటారు..
తమిళంలో డ్యాన్స్‌కు ఉదాహరణగా అందరూ విజయ్‌నే చెబుతారు. విజయ్ డ్యాన్స్ మూమెంట్స్ కు అభిమానులు పూనకాలు వచ్చినట్టు ఊగిపోతుంటారు. రీసెంట్ గా ఆయన డాన్స్ చేసిన రంజితమే సాంగ్ ఎంత హిట్ అయ్యిందో అందరికి తెలుసు. ఒక్కసారి చూస్తే చాలు, ఆ డ్యాన్స్ స్టెప్‌ను విజయ్ దళపతి అలవోకగా వేసేస్తాడని పేరు.
39
జన నాయగన్ రిలీజ్ డేట్
నటన విషయంలో కానీ.. డ్యాన్స్ విషయంలో కానీ.. అంకితభావం, కృషి, పట్టుదల చూపిస్తుంటాడు. అందుకే ఆయన పాటలు, డాన్స్ కు అభిమానుల్లో డిమాండ్ ఎక్కువ. ఇక 2026 పొంగల్ సందర్భంగా జనవరి 9న విడుదల కానున్న 'జన నాయగన్' సినిమాలోని పాటకు అదిరిపోయే పెర్ఫామెన్స్ ఇవ్వబోతున్నాడు విజయ్. అందుకోసం దళపతి ఎంత కష్టపడ్డాడో తెలిపే ఫోటోలు ఇప్పుడు ట్రెండ్ అవుతున్నాయి.
ప్రతి పాటకు ముందు విజయ్ ఎక్కువగా డ్యాన్స్ రిహార్సల్స్ చేస్తుంటారు. అలా చేయడమే అతన్ని గొప్ప డ్యాన్సర్‌గా మార్చింది. హెచ్ వినోద్ దర్శకత్వంలో విజయ్ నటిస్తున్న సినిమా 'జన నాయగన్'. కేవీఎన్ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు.
59
జన నాయగన్ ట్రైలర్
తమిళగ వెట్రి కళగం పార్టీని ప్రారంభించిన విజయ్, 2026 అసెంబ్లీ ఎన్నికల కోసం రాజకీయ ప్రచారం చేస్తూ సినిమాలకు దూరమయ్యారు. 'జన నాయగన్' తన చివరి సినిమా అని ప్రకటించారు. అందుకే ఈ సినిమాను రాజకీయ ప్రచారానికి వాడుకుంటారని తెలుస్తోంది.
69
యాక్షన్ ఎంటర్టైనర్ గా
పూర్తి యాక్షన్ కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమా, తెలుగు లో బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన 'భగవంత్ కేసరి'కి రీమేక్ అని తెలుస్తోంది. ఈ చిత్రంలో విజయ్‌తో పాటు పూజా హెగ్డే, బాబీ డియోల్, మమితా బైజు, గౌతమ్ మీనన్, ప్రియమణి, ప్రకాష్ రాజ్, రేవతి, సిద్ధార్థ్, అర్జున్ రాంపాల్, సముద్రఖని, అనుష్క శర్మ వంటి తారలు నటిస్తున్నారు.
79
జన నాయగన్ దళపతి కచేరి పాట
ఇటీవల విడుదలైన 'దళపతి కచేరి' పాట లిరికల్ వీడియో అభిమానులను ఆకట్టుకుంది. దీనికి ప్రధాన కారణం విజయ్ డ్యాన్స్. పాటలోని సాహిత్యంకు తగ్గట్టుగా డ్యాన్స్ చేసి అభిమానుల మనసు దోచుకుంటున్నాడు దళపతి.
89
దళపతి విజయ్ డ్యాన్స్ రిహార్సల్
విజయ్ ప్రాక్టీస్ చాలా తీవ్రంగా ఉంటుంది. చెమటలు కక్కుతూ పాటలకు ప్రాక్టీస్ చేస్తాడు. ఒకటి లేదా రెండు టేకుల్లోనే డ్యాన్స్ పూర్తి చేస్తాడని కొరియోగ్రాఫర్లు చెబుతుంటారు.రెమ్యూనరేషన్ సమస్యల వల్ల విజయ్ డబ్బింగ్ పూర్తి చేయలేదని వార్తలు వచ్చాయి. కానీ విజయ్, పూజా హెగ్డే ఇద్దరూ తమ డబ్బింగ్ పనులు పూర్తి చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
99
జన నాయగన్ ఆడియో లాంచ్ వేడుక
జన నాయగన్ సినిమా ఆడియో లాంచ్ వేడుక డిసెంబర్ 27న మలేషియాలో జరగనుంది. ఈ వేడుకకు పలువురు సినీ ప్రముఖులు హాజరై సందడి చేయనున్నారు.