దళపతి విజయ్ టీమ్‌కు మలేషియా పోలీసుల స్ట్రిక్ట్ వార్నింగ్, ఎందుకంటే?

Published : Dec 24, 2025, 03:51 PM IST

  దళపతి విజయ్  'జన నాయగన్' సినిమాకు మలేషియా పోలీసులు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తోంది. అక్కడ నిర్వహించబోయే కార్యక్రమంపై  షరతులు విధించినట్లు సమాచారం. అసలు ఎందుకు ఇలా వార్నింగ్ ఇచ్చారు. కారణం ఏంటి? 

PREV
16
రిలీజ్ కు రెడీగా విజయ్ జననాయగన్

విజయ్ చివరి సినిమా 'జన నాయగన్' 2026 జనవరి 9న విడుదల కానుంది. రూ.300 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈసినిమా విజయ్  రాజకీయ జీవితానికి ఉపయోగపడేలా తీస్తున్నట్టు సమాచారం.  ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన  పాటలు అభిమానులను బాగా ఆకట్టుకున్నాయి.

26
మలేషియాలో జననాయగన్ ఆడియో లాంచ్

త్వరలో ఈసినిమా  ఆడియో లాంచ్ జరగనుంది. ఈసారి చెన్నైలో కాకుండా, మలేషియాలోని బుకిత్ జలీల్ స్టేడియంలో ఈ ఈవెంట్ ను చాలా గ్రాండ్ గా  నిర్వహిస్తున్నారు. దీన్ని రాజకీయ ప్రచారానికి  వాడుకోవాలని ప్లాన్ చేసినట్లు టాక్.

36
మలేషియా పోలీసుల షరతులు..?

మలేషియా పోలీసులు టీమ్‌కు కొన్ని షరతులు పెట్టారు. ఇది సినిమా వేడుక మాత్రమే, రాజకీయ కార్యక్రమం కాదు. పార్టీ జెండాలు, రాజకీయ ప్రసంగాలు ఉండకూడదని చెప్పినట్లు సమాచారం. దీనిపై ఎటువంటి  అధికారిక ప్రకటన మాత్రం రాలేదు.

46
అభిమానులకు ఇబ్బంది కలగకుండా

తమిళనాడులో అభిమానుల  రద్దీ, ప్రాణనష్టం జరిగే ప్రమాదం ఉండటంతో మలేషియాలో ఆడియో లాంచ్ చేస్తున్నారని అంటున్నారు. అధికార పార్టీ ప్రభావం కూడా ఒక కారణమని చెబుతున్నారు. ఎవరు ఈ కార్యక్రమానికి ఆటంకం కలిగించకుండా.. విదేశాల్లో పెడితే.. అది సక్సెస్ అవుతుందని ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. 

56
జననాయగన్ స్టార్ కాస్ట్..

ఈ సినిమాలో విజయ్‌తో పాటు మమితా బైజు, బాబీ డియోల్, పూజా హెగ్డే, ప్రియమణి, ప్రకాష్ రాజ్ నటించారు. అనిరుధ్ సంగీతం అందించారు. విజయ్ చివరి సినిమా కావడంతో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా తరువాత విజయ్ పూర్తిగా సినిమాలు వదిలేసి.. రాజకీయాలకే పరిమితం కాబోతున్నారు. అందుకు తగ్గ ప్రణాళిక కూడా సిద్దం చేసుకున్నారు దళపతి విజయ్. 

66
1000 కోట్లు వసూలు చేస్తుందని అంచనాలు..

ఈ సినిమాకు పోటీగా 'పరాశక్తి' జనవరి 10న విడుదల కానుంది. తెలుగులో కూడా ఈసినిమాకు పోటీగా ప్రభాస్, చిరంజీవి సినిమాలు రిలీజ్ అవుతున్నాయి.  దీనివల్ల 'జన నాయగన్' కలెక్షన్లు ప్రభావితం కావొచ్చు. అయినా ఈ సినిమా రూ.1000 కోట్లు వసూలు చేస్తుందని అంచనా వేస్తున్నారు.

Read more Photos on
click me!

Recommended Stories