`మైసా` ఫస్ట్ గ్లింప్స్ చూస్తే, `నా బిడ్డ సచ్చిందన్నారు. కానీ మట్టే ఒణికిపోయింది నా బిడ్డ రక్తాన్ని దాసలేక, గాలే ఆగిపోయింది నా బిడ్డ ఊపిరి మోయ లేక, అగ్గే బూడిదయ్యింది మండుతున్న నా బిడ్డని చూడలేక.. ఆఖరికి సావే సచ్చిపోయింది నా బిడ్డని సంపలేక. నా బిడ్డ ఎవరో తెలుసా?` అంటూ టీజర్ సాగగా, రష్మిక మందన్నా గర్జించిన తీరు అదిరిపోయింది. తన యోధురాలు లాంటి కూతురు వీరత్వం గురించి ఒక తల్లి చెప్పిన ఈ మాటలు గూస్ బంమ్స్ తెప్పిస్తున్నాయి. వాయిస్ ఇచ్చింది ఈశ్వరీ రావు కావడం విశేషం. ఇందులో రష్మిక మందన్నా గోండు బిడ్డగా కనిపిస్తుంది. ఆమె తిరుగుబాటు చేస్తుంది. రష్మిక పాత్రలో క్రూరత్వం, గాంభీర్యం, తిరుగుబాటు, పోరాడేతత్వం, దేనికైనా తెగించే తత్వం కనిపిస్తున్నాయి. అడవిలో ప్రత్యర్థులను ఒంటరిగా ఎదుర్కోవడం, ఈ క్రమంలో రక్తం మడుగులో ఆమె కనిపించడం విశేషం. ఊరమాస్ లుక్ లో మైండ్ బ్లాక్ చేస్తోంది రష్మిక మందన్నా.