Thalapathy Vijay: బాక్సాఫీస్ నుంచి బ్యాలెట్ బాక్స్ వరకు.. దళపతి విజయ్ మాస్ జర్నీ ఎలా సాగిందో తెలుసా?

Published : May 04, 2026, 07:31 PM ISTUpdated : May 04, 2026, 07:41 PM IST

Thalapathy Vijay : వెండితెరపై దళపతిగా వెలిగిన విజయ్, ఇప్పుడు రాజకీయ రంగంలో సంచలనం సృష్టిస్తున్నారు. నటుడి నుంచి టీవీకే అధినేతగా ఆయన సాగించిన ప్రయాణంలో ఎన్నో అడ్డంకులు, ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. విజయ్ జర్నీలోని షాకింగ్ విషయాలు ఇక్కడ తెలుసుకుందాం.

PREV
16
తమిళనాడులో కొత్త చరిత్ర: దళపతి విజయ్ పొలిటికల్ ఎంట్రీ అదిరింది

మూడు దశాబ్దాల పాటు వెండితెరను ఏలిన దళపతి విజయ్, ఇప్పుడు తమిళనాడు రాజకీయ ముఖచిత్రాన్ని మార్చేస్తున్నారు. పక్కా కమర్షియల్ హీరో నుంచి పీపుల్స్ లీడర్‌గా ఆయన మారిన తీరు ఒక సెన్సేషన్. విజయ్ మక్కల్ ఇయక్కం ద్వారా సేవా కార్యక్రమాలు చేస్తూ, 'తమిళగ వెట్రి కళగం' (టీవీకే) పార్టీతో ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టిన విజయ్, ఇప్పుడు తన పొలిటికల్ పవర్‌ను నిరూపించుకుంటున్నారు.

26
విజయ్ నటుడిగా ఆరంభం అంత ఈజీగా సాగలేదు

దళపతి పూర్తి పేరు సి జోసెఫ్ విజయ్‌. 1992లో నాలైయ తీర్పు సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. కానీ, మొదటి సినిమా ఆశించిన విజయాన్ని అందించలేదు. ఆ తర్వాత వచ్చిన సెందూరపాండి, రసికన్, దేవా, విష్ణు, చంద్రలేఖ వంటి సినిమాలు ఆయనను నటుడిగా నిలబెట్టాయే తప్ప, స్టార్‌డమ్‌ను తీసుకురాలేదు. ఆ సమయంలో విజయ్ ఎన్నో విమర్శలను ఎదుర్కొన్నారు. కానీ, ఎక్కడా వెనక్కి తగ్గకుండా తన ప్రయత్నాన్ని కొనసాగించారు.

36
టర్నింగ్ పాయింట్ అదే: లవర్ బాయ్‌గా ఫ్యామిలీ ఆడియన్స్ మనసుల్లో..

1996లో వచ్చిన 'పూవే ఉనక్కాగా' సినిమా విజయ్ కెరీర్‌ను మలుపు తిప్పింది. ఈ సినిమాతో ఆయన యూత్, ఫ్యామిలీ ఆడియన్స్‌కు బాగా దగ్గరయ్యారు. ఆ తర్వాత లవ్ టుడే, కాదలుక్కు మరియాదై, నినైతేన్ వందాయ్, తుల్లాద మనముమ్ తుల్లుమ్ వంటి సినిమాలతో విజయ్ ఒక బలమైన ఫ్యాన్ బేస్‌ను క్రియేట్ చేసుకున్నారు. ప్రతి ఇంట్లో అబ్బాయిలా ఆయనను ప్రేక్షకులు ఓన్ చేసుకున్నారు. ఒక రకంగా చెప్పాలంటే, ఈ పీరియడ్‌లోనే ఆయన తన బ్రాండ్ ను సెట్ చేసుకున్నారు.

46
దళపతిగా గుర్తింపు.. మాస్ యాక్షన్ హీరోగా విశ్వరూపం

2000వ సంవత్సరం ప్రారంభంలో విజయ్ రూట్ మార్చారు. ఖుషి, ప్రియమానవాలే వంటి హిట్స్ ఉన్నప్పటికీ, 2003లో వచ్చిన 'తిరుమలై' ఆయన ఇమేజ్‌ను కంప్లీట్ గా మార్చేసింది. ఇక 2004లో వచ్చిన 'గిల్లి' సినిమా ఒక హిస్టరీ క్రియేట్ చేసింది. దీంతో విజయ్ మాస్ హీరోగా ఎస్టాబ్లిష్ అయ్యారు. తిరుపాచి, శివకాశి, పోకిరి వంటి సినిమాలతో తమిళ ఇండస్ట్రీలో టాప్ స్టార్‌గా ఎదిగారు. 'అప్పడి పోడు', 'వాతి కమింగ్' వంటి పాటల్లో ఆయన వేసిన స్టెప్పులకు థియేటర్లు దద్దరిల్లిపోయాయి. తుపాకి, కత్తి, మెర్సల్, సర్కార్, మాస్టర్, లియో వంటి సినిమాలతో విజయ్ కేవలం ఎంటర్టైనర్‌గానే కాకుండా, సామాజిక అంశాలను ప్రస్తావించే ఒక గొంతుకగా మారారు. అప్పుడే అభిమానులు ఆయనను ప్రేమగా దళపతి అని పిలవడం మొదలుపెట్టారు.

56
తమిళగ వెట్రి కళగం తో వెండితెర నుంచి ప్రజా క్షేత్రంలోకి..

సినిమాల్లో నటిస్తూనే విజయ్ తన 'విజయ్ మక్కల్ ఇయక్కం' ద్వారా సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ ప్రజల్లోకి వెళ్లారు. 2024లో ఆయన తన రాజకీయ పార్టీ 'తమిళగ వెట్రి కళగం' (టీవీకే)ను ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. తన చివరి సినిమా 'జన నాయకన్' తర్వాత సినిమాలకు గుడ్ బై చెప్పి, పూర్తిస్థాయిలో ప్రజా సేవకే అంకితమవుతానని ప్రకటించడం ఆయన డెడికేషన్‌కు నిదర్శనం. రాజకీయాల్లోకి రావడం అంటే కేవలం సెలబ్రిటీ హోదాను వాడుకోవడం కాదని, గ్రౌండ్ లెవల్ నుంచి పని చేయాలని ఆయన నిరూపించారు.

66
2026 ఎన్నికల సమరం: కొత్త శక్తిగా విజయ్

ప్రస్తుతం 2026 తమిళనాడు ఎన్నికల ఫలితాలు చూస్తుంటే, విజయ్ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. దశాబ్దాలుగా రాష్ట్రాన్ని ఏలుతున్న డీఎంకే, ఏఐఏడీఎంకే వంటి దిగ్గజ పార్టీలకు విజయ్ గట్టి దెబ్బనే కొట్టారు. కేవలం సినీ అభిమానులే కాకుండా, కొత్తదనం కోరుకునే యువత విజయ్ వైపు మొగ్గు చూపుతున్నారు. సినిమాల్లో బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసిన ఈ దళపతి, ఇప్పుడు రాజకీయాల్లో ఏ మేరకు మార్పు తీసుకువస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఇది కేవలం ఒక నటుడి రాజకీయ ఎంట్రీ కాదు, ఒక కొత్త ఆశకు ఆరంభం అని విశ్లేషకులు పేర్కొంటున్నారు.

Read more Photos on
click me!

Recommended Stories