Chiranjeevi ని నిలబెట్టిన దళపతి విజయ్ తండ్రి, ఆ ఒక్క మూవీతోనే మెగాస్టార్ నెంబర్ 1 అని తేల్చేసిన శోభన్ బాబు

Published : May 04, 2026, 06:04 PM IST

తమిళనాడు రాజకీయాల్లో దళపతి విజయ్ చరిత్ర సృష్టించారు. ఆయన తండ్రి ఎస్ ఏ చంద్రశేఖర్ చిరంజీవి కెరీర్ కి బలమైన పునాది వేశారని తెలుసా ? ఆ వివరాలు ఈ కథనంలో.. 

PREV
15
దళపతి విజయ్ తండ్రి ఎస్ఏ చంద్రశేఖర్

దళపతి విజయ్ తమిళనాడు ఎన్నికల్లో సాధించిన విజయం కారణంగా అతడి పేరు దేశవ్యాప్తంగా మారుమోగుతోంది. విజయ్ కుటుంబ సభ్యులు కూడా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నారు. దళపతి విజయ్ తండ్రి సౌత్ లో మంచి గుర్తింపు ఉన్న దర్శకుడిగా వెలుగు వెలిగారు. విజయ్ తండ్రి ఎస్ ఏ చంద్రశేఖర్ తెలుగు తమిళ భాషల్లో సినిమాలు తెరకెక్కించారు.

25
చిరంజీవి, ఎస్ఏ చంద్రశేఖర్ కాంబినేషన్

తెలుగులో ఆయన మెగాస్టార్ చిరంజీవితో కూడా మూడు సినిమాలు చేశారు. వీరిద్దరి కాంబోలో చట్టానికి కళ్ళు లేవు, దేవాంతకుడు, పల్లెటూరి మొనగాడు లాంటి చిత్రాలు వచ్చాయి. ఈ మూవీ చిత్రాలు సూపర్ హిట్స్ గా నిలిచాయి. బిగినింగ్ లో చిరంజీవి కెరీర్ కి బలమైన పునాది వేసిన దర్శకులలో ఎస్ ఏ చంద్రశేఖర్ కూడా ఒకరు. చట్టానికి కళ్ళు లేవు చిత్రం అయితే అద్భుతమైన విజయం అందుకుంది. తమిళంలో సూపర్ హిట్ అయిన చట్టం ఓరు ఇరట్టై అనే చిత్రానికి ఇది రీమేక్. ఆ మూవీకి కూడా ఆయనే దర్శకుడు. ఈ కథని 20 మంది నిర్మాతలు రిజెక్ట్ చేశారట. అయినప్పటికీ చంద్రశేఖర్ తన ప్రయత్నం ఆపకుండా సినిమా పూర్తి చేసి విజయం అందుకున్నారు.

35
చట్టానికి కళ్ళు లేవు మూవీతో ఘనవిజయం

చట్టానికి కళ్ళు లేవు మూవీ ప్రారంభ వేడుకకి సూపర్ స్టార్ కృష్ణ, శోభన్ బాబు అతిథులుగా హాజరయ్యారు. కేవలం 27 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసి 1981 అక్టోబర్ 30 న ఈ చిత్రాన్ని రిలీజ్ చేశారు. తొలి రోజు నుంచి ఈ చిత్రాన్ని సూపర్ హిట్ టాక్ మొదలైంది. తన తండ్రి మరణానికి ప్రతీకారం తీర్చుకునే కొడుకుగా చిరంజీవి పెర్ఫార్మెన్స్ అదరగొట్టారు. నటి లక్ష్మి పోలీస్ అధికారిగా, మాధవి హీరోయిన్ గా నటించారు. చిరంజీవిని స్టార్ హీరోగా మార్చిన చిత్రం ఖైదీ కాగా, చట్టానికి కళ్ళు లేవు చిత్రం చిరంజీవికి హీరోగా మంచి గుర్తింపు తీసుకువచ్చింది.

45
శోభన్ బాబు అప్పుడే చెప్పారు

హైదరాబాద్ సంధ్య థియేటర్ లో 100 రోజులు ప్రదర్శించబడిన తొలి చిత్రం ఇదే. దీనితో విజయేత్సవ కార్యక్రమం ఆ థియేటర్ లోనే నిర్వహించారు. 100 రోజుల వేడుకకి శోభన్ బాబు చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు. ఈ ఈవెంట్ లో శోభన్ బాబు మాట్లాడుతూ.. గతంలో ఎన్టీఆర్, ఏఎన్నార్.. ఇప్పుడు నేను, కృష్ణ.. ఇక భవిష్యత్తు మొత్తం చిరంజీవిదే అని శోభన్ బాబు జోస్యం చెప్పారు.

55
చిరంజీవి కెరీర్ పై విజయ్ తండ్రి బలమైన ముద్ర

శోభన్ బాబు చెప్పిన మాటలు నిజం కావడానికి ఎంతో టైం పట్టలేదు. ఖైదీ బ్లాక్ బస్టర్ అయ్యాక చిరంజీవి ఏకంగా నెంబర్ 1 పీఠానికి చేరువయ్యారు. దేశవ్యాప్తంగా పొలిటికల్ గా సంచలనం అయిన దళపతి విజయ్ తండ్రి చంద్రశేఖర్.. చిరంజీవి కెరీర్ లో కీలక పాత్ర పోషించారు.

Read more Photos on
click me!

Recommended Stories