విజయ్ ప్రస్తుతం నటిస్తున్న ‘జన నాయకన్’ సినిమా తరువాత సినిమాలకు గుడ్‌బై చెప్పి పూర్తి స్థాయిలో రాజకీయాల్లోకి ప్రవేశించనున్నట్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా మీద అభిమానుల్లోనే కాదు, పరిశ్రమలో కూడా భారీ ఆసక్తి నెలకొంది. ఈ సినిమాను హి. వినోద్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో యాక్షన్ సన్నివేశాలు ప్రధాన ఆకర్షణగా ఉండనున్నాయి.
ఈ సినిమా కోసం ర్యాపర్ హనుమన్‌కైండ్‌తో కలిసి మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ ఓ హై వోల్టేజ్ ర్యాప్ ట్రాక్ రూపొందిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇది నిజమైతే, విజయ్ సినిమాల్లో ఇది ఒక ప్రత్యేకమైన కాంబినేషన్‌గా నిలుస్తుంది.