ఒకప్పుడు బాలీవుడ్ సినిమాలు మాత్రమే సినిమాలు, సౌత్ వాళ్ళవి ఇడ్లీ సాంబార్ కథలు అనే కామెంట్లు వినిపించేవి. మన సౌత్ సినిమాలను చాలా చులకనగా చూసేవారు బాలీవుడ్ సినిమా జనాలు. అయితే ఇప్పుడు పరిస్తితి మారిపోయింది. తెలగు సినిమాల దెబ్బకు బాలవుడ్ ముడుచుకుని మూలన కూర్చోవలసిన పరిస్థితి వచ్చింది. ఈక్రమంలో టాలీవుడ్ హీరోలు అన్నా బాలీవుడ్ వాళ్ళకు చులకనగా ఉండేది. అటువంటి టైమ్ లో టాలీవుడ్ పరువు నిలబెట్టాడు అల్లు అర్జున్.