మహేష్ ని దారుణంగా ఆడుకుంటున్న విజయ్‌ ఫ్యాన్స్.. ఇదే అదునుగా రెచ్చిపోతున్న బన్నీ ఫ్యాన్స్.. ఏంటీ ఫ్యాన్స్ గోల?

Published : Sep 05, 2022, 07:28 PM ISTUpdated : Sep 05, 2022, 07:31 PM IST

మరోసారి మహేష్‌, దళపతి విజయ్‌ ఫ్యాన్స్ వార్‌కి దిగుతున్నారు. మహేష్‌ని దారుణంగా ఆడుకుంటున్నారు. ఊహించని విధంగా మహేష్‌ని ట్రోల్‌ చేయడం ఇప్పుడు హాట్‌ టాపిక్‌ అవుతుంది.   

PREV
16
మహేష్ ని దారుణంగా ఆడుకుంటున్న విజయ్‌ ఫ్యాన్స్.. ఇదే అదునుగా రెచ్చిపోతున్న బన్నీ ఫ్యాన్స్.. ఏంటీ ఫ్యాన్స్ గోల?

ఇటీవల కాలంలో ఫ్యాన్స్ వార్‌ అనేది ఓ ట్రెండ్‌ అయిపోయింది. ఇతర హీరోలను ఏదో రూపంలో కామెంట్‌ చేస్తున్నారు ఇతర హీరోల అభిమానులు. ఆ మధ్య పవన్‌, బన్నీ ఫ్యాన్స్, అలాగే బన్నీ-చరణ్‌ ఫ్యాన్స్, మహేష్‌-బన్నీ ఫ్యాన్స్ వార్‌కి దిగిన విషయం తెలిసిందే. తాజాగా మహేష్‌(Mahesh)పై విరుచుకుపడుతున్నారు విజయ్‌(Vijay) ఫ్యాన్స్. దారుణమైన పదంతో పోల్చుతూ దుమారం రేపుతున్నారు. 
 

26

`బైకాట్‌ గే మహేష్‌బాబు`(#boycottgaymaheshbabu) అంటూ యాష్‌ ట్యాగ్‌ పేరుతో ట్రోల్స్ చేస్తున్నారు దళపతి విజయ్‌ అభిమానులు. ట్విట్టర్‌ వేదికగా రెచ్చిపోతున్నారు. అంతేకాదు మహేష్‌ ఫోటోలకు అమ్మాయి డ్రెస్సులు వేసి, మహిళకు మహేష్‌ తలని యాడ్‌ చేసి ట్రోల్‌ చేస్తున్నారు. సినిమాలోని కొన్ని వీడియో క్లిప్పులు తీసుకుని వాటికి మహేష్‌ ఫేస్‌ని యాడ్‌ చేస్తూ, విజయ్‌ చేత కొట్టించడం వంటి ట్రోల్స్ తో వైరల్‌ చేస్తున్నారు. 
 

36

ఉన్నట్టుండి మహేష్‌పై విజయ్‌ ఫ్యాన్స్ ఈ రేంజ్‌లో రెచ్చిపోవడం ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఎక్కడ వీరి మధ్య వివాదం రాజుకుందనేది ప్రశ్నార్థకంగా మారింది. అయితే మహేష్‌ ఫ్యాన్స్ కూడా దీటుగానే బదులిస్తున్నారు. బాబులకే బాబు మహేష్‌బాబు అంటూ విజయ్‌ ఫ్యాన్స్ కి కౌంటర్లిస్తున్నారు. `బైకాట్‌ లెస్బియన్‌ విజయ్‌` (#Boycottlesbianvijay)అని, `బైకాట్‌ విజయ్‌ ఫ్రమ్‌ ఐఎఫ్‌ఐ` (#boycottvijayfromifi) అంటూ ఘాటుగా బదులిస్తున్నారు. దీంతో ఇప్పుడు ఇద్దరు ఫ్యాన్స్ మధ్య బిగ్‌ వార్‌ జరుగుతుండటం గమనార్హం.

46

అయితే విజయ్‌ కి, మహేష్‌కి మధ్య ఎలాంటి వివాదం లేదు. కానీ ఆశ్చర్యపోయేలా ఈ వార్‌ ఏంటనేది అందరిని ఆలోచింప చేస్తుంది. ఇదే అదనుగా భావించిన బన్నీ ఫ్యాన్స్ సైతం రెచ్చిపోతున్నారు. విజయ్‌ అభిమానులకు అల్లు అర్జున్‌ ఫ్యాన్స్ సపోర్ట్ చేస్తున్నారు. పోస్టర్‌పై వేసే కలెక్షన్లని చూసి మురిసిపోతాడంటూ ట్రోల్‌ చేస్తున్నారు. 
 

56

తరచూ మహేష్‌, బన్నీ(Allu Arjun) ఫ్యాన్స్ కి ఇక్కడ వార్‌ జరుగుతున్న విషయం తెలిసిందే. బాక్సాఫీసు కలెక్షన్ల విషయంలో వీరిద్దరు తరచూ వార్‌ జరుగుతుంటుంది. ఇదే అభిమానులను వేరు చేసింది. `అల వైకుంఠపురములో`, `సరిలేరు నీకెవ్వరు` టైమ్‌లో ఈ రచ్చ మరింత పీక్‌లోకి వెళ్లింది. ఆ తర్వాత ఇటీవల `పుష్ప`, `సర్కారు వారి పాట`టైమ్‌లోనూ ఇలాంటి ఫ్యాన్స్ వారే చోటు చేసుకుంది. ఇప్పుడు విజయ్‌ ఫ్యాన్స్ కి సపోర్ట్ చేస్తూ మహేష్‌ని ఆడుకుంటున్నారు బన్నీ ఫ్యాన్స్. 

66
vijay Mahesh Babu

ఫ్యాన్స్ ఎంతగా సోషల్‌ మీడియా వేదికగా ఫైటింగ్ కి దిగినా, స్టార్లు మాత్రం అంతా కలిసే ఉంటారనే విషయం తెలిసిందే. బర్త్ డేలకు విషెస్‌ చెబుతూ, సినిమా రిలీజ్‌ టైమ్‌లో ఆల్‌ ది బెస్ట్ చెబుతూ పోస్టులు పెడుతుంటారు. అవసరం వచ్చినప్పుడు వాళ్లంతా ఒక్కటవుతుంటారు. ఆ విషయాన్ని అభిమానులు అర్థం చేసుకోవాలని, ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటూ ముందుకెళ్లాలని అంటున్నారు నెటిజన్లు. ఇలాంటి ట్రోల్స్ వారి ఇమేజ్‌ డ్యామేజ్‌ చేసేవిగా ఉంటాయని, అభిమాన హీరోకి సపోర్ట్ గా ఉండాలనే కానీ, ఇలా దిగజారే కామెంట్లు చేయకూడదని క్లాసులు పీకుతున్నారు జనరల్‌ నెటిజన్లు. మరి ఈ ట్రోల్స్ ఎంత దూరం వెళ్తాయో చూడాలి. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories