గణేష్ నిమజ్జనంలో కూతురితో ఐకాన్ స్టార్.. సంస్కృతిని మర్చిపోని అల్లు అర్జున్.. బన్నీపై ప్రశంసల వర్షం..

First Published Sep 5, 2022, 6:38 PM IST

పాన్ ఇండియా స్టార్ గా ఎదిగినప్పటికీ.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) మన సంస్కృతిని మాత్రం మరిచిపోలేదు.  తాజాగా గణేష్ నిమజ్జనంలో కూతురు అల్లు అర్హతో కలిసి సందడి చేయడం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
 

ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి.. అనేలా నడుకుంటున్నారు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. కొన్నేండ్లుగా దేశభక్తి చాటుతూ, అలాగే మన సంప్రదాయాలను గౌరవిస్తూ వస్తున్నారు. ఇటీవల 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లోనూ అల్లు అర్జున్ పాల్గొని దేశభక్తిని చాటుకున్న విషయం తెలిసిందే. 
 

తాజాగా అల్లు అర్జున్, కూతురు అల్లు అర్హ కలిసి గణేష్ నిమజ్జనంలో సందడి చేయడం అందరినీ ఆకట్టుకుంటోంది. అందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలో ఇంటర్నెట్ లో వైరల్ అవుతున్నాయి. గణేష్ నిమజ్జన  కార్యక్రమంలో ఈ తండ్రీ కూతురు పాల్గొనడం అందరికీ సంతోషాన్నిచ్చింది. 
 

పాన్ ఇండియా స్టార్ గా ఎదిగినప్పటికీ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మన సంస్కృతిని మాత్రం మరిచిపోలేదు. ప్రతి సంవత్సరం లాగే, ఈ సారి కూడా అల్లు అర్జున్ తన ఆఫీస్ లో వినాయకుడి విగ్రహాన్ని  ప్రతిష్టించి పూజలు జరిపించారు. గణేష్ చతుర్థి పండుగను (Ganesh Chaturthi 2022) తన సిబ్బందితో ఘనంగా నిర్వహించారు.  
 

అయితే వినాయకుడి నిమజ్జనం సందర్బంగా అల్లు అర్జున్, తన  కూతురు అల్లు అర్హతో పాల్గొన్నారు. దేవుడికి కొబ్బరికాయ కొట్టి ఆటపాటతో సాగనంపారు. పాన్ ఇండియా స్టార్ గా ఎనలేని గుర్తింపు సాధించుకున్న అల్లు అర్జున్, భారతీయ సంస్కృతిని మరిచిపోకపోవడం పట్ల ఆయన అభిమానులు, నెటిజన్లు కొనియాడుతున్నారు. 
 

నిమజ్జన వేడుకల సందర్భంగా ఏకంగా రోడ్డుపైకి రావడానికి వెనుకాడకపోవడంతో పొగడ్తలతో ముచెత్తున్నారు. అలాగే తన కూతురిని పక్కన పెట్టుకుని స్వామికి వీడ్కోలు పలకడంతో మరింతగా ప్రశంసిస్తున్నారు. అదేవిధంగా అల్లు అర్హను ఊరేగింపులో భాగమవ్వాలని, నిమజ్జనాన్ని దగ్గరగా చూడమని, పండుగ ప్రాముఖ్యత గురించి తెలియజేయడం అభినందనీయమంటున్నారు. 
 

ప్రస్తుతం అల్లు అర్జున్ ‘పుష్ఫ 2’లో నటిస్తున్నారు. ఇప్పటికే చిత్రం పూజా కార్యక్రమాన్ని గ్రాండ్ గా నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ నెలలో సీక్వెల్ ను సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారు. ‘పుష్ఫ : ది రైజ్’ సెన్సేషన్ క్రియేట్ చేయడంతో.. ‘పుష్ఫ : ది రూల్’ (Pushpa The Rule)ను మరింత గ్రాండ్ గా నిర్మించబోతున్నారు. రూ.350 కోట్ల వరకు బడ్జెట్ కేటాయించినట్టు తెలుస్తోంది. 

click me!