రజినీకాంత్ తో కమల్ హాసన్ భారీ బడ్జెట్ మూవీ.. హీరో, డైరెక్టర్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?

Published : Nov 08, 2025, 04:25 PM IST

సూపర్‌స్టార్ రజనీకాంత్ 173 సినిమా కోసం కమల్ హాసన్ భారీ బడ్జెట్‌ను కేటాయించినట్టు తెలుస్తోంది. ఈ సినిమా కోసం, రజినీతో పాటు దర్శకుడు సుందర్ సి  రెమ్యునరేషన్ ఎంతో తెలుసా? 

PREV
14
రజినీకాంత్ 173వ సినిమా

సూపర్ స్టార్  రజనీకాంత్ ప్రస్తుతం జైలర్ 2 చేస్తున్నారు. ఇదిలా ఉండగా, ఆయన తలైవర్ 173 సినిమాకు సుందర్ సి దర్శకత్వం వహించనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. గతంలో వీరిద్దరి కాంబోలో అరుణాచలం సినిమా వచ్చింది. ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది. 

24
కమల్ హాసన్ నిర్మాతగా..

తలైవర్ 173కి సుందర్ సి దర్శకుడు కాగా, కమల్ హాసన్ నిర్మిస్తున్నారు. కమల్ నిర్మాణంలో, సుందర్ సి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా రజనీ కెరీర్‌లో పెద్ద హిట్ అవుతుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.

34
రజినీకాంత్ సినిమాకు కమల్ బడ్జెట్ ?

కమల్ హాసన్ ఈసినిమా కోసం భారీ బడ్జెట్ ను కేటాయించినట్టు తెలుస్తోంది.  రజనీకాంత్ రెమ్యూనరేషన్‌తో కలిపి ఈ సినిమాకు మొత్తం 275 కోట్ల బడ్జెట్ కేటాయించారని సమాచారం. అంతే కాదు  సుందర్ సి కెరీర్‌లో కూడా ఇదే అతిపెద్ద బడ్జెట్ సినిమా.

44
రజినీకాంత్ రెమ్యునరేషన్ ..?

ఈ సినిమాకు రజనీకాంత్ 180-200 కోట్లు, దర్శకుడు  సుందర్ సి 30 కోట్లు పారితోషికం తీసుకుంటున్నట్లు సమాచారం. సుందర్ సి రెమ్యూనరేషన్ గతంకంటే రెట్టింపు అవ్వడం విశేషం. ఈ సినిమా 2027 పొంగల్‌కు విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. 

Read more Photos on
click me!

Recommended Stories