నాగార్జున కంటే మందు.. శివ సినిమా కథ ఏ స్టార్ హీరో దగ్గరకు వెళ్లిందో తెలుసా?

Published : Nov 08, 2025, 03:56 PM IST

నాగార్జున శివ సినిమాతో ఎన్ని రికార్డులు క్రియేట్ చేశాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. టాలీవుడ్ లో సరికొత్త హిస్టరీని క్రియేట్ చేసిన  శివ సినిమా కోసం…రామ్ గోపాల్ వర్మ ముందుగా అనుకున్న హీరో ఎవరో తెలుసా? 

PREV
15
నాగార్జున శివ సినిమా రీరిలీజ్

తెలుగు సినిమా చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోయిన కల్ట్ క్లాసిక్ సినిమా శివ. ఈసినిమాను మరోసారి అభిమానుల కోసం సరికొత్త హంగులతో రీ రిలీజ్ చేయబోతున్నారు మేకర్స్. అందుకోసం చాలా రోజులుగా హడావిడి కొనసాగుతోంది. 1989లో రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ ట్రెండ్‌సెట్టర్ మూవీ రీసెంట్ గా 36 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా.. కొత్త సాంకేతిక హంగులతో ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్టు నిర్మాతలు ప్రకటించారు. ఇక ఈసినిమాను నవంబర్ 14, 2025న 4K డాల్బీ ఆట్మాస్ టెక్నాలజీతో రీ-రిలీజ్ చేయనున్నారు.

25
శివ సినిమా విశేషాలు

అయితే శివ సినిమా రీ రిలీజ్ సందర్భంగా గత కొన్ని రోజులుగా ఇండస్ట్రీలో హడావిడి నడుస్తోంది. ఈసినిమాకు సబంధించిన ఈవెంట్ ను రీసెంట్ గా నిర్వహాంచారు టీమ్. అంతే కాదు శివ సినిమాకు సబంధించిన ఆసక్తికరమైన పాత విషయాలెన్నో బయటకు వస్తున్నాయి. ఇక తాజాగా సోషల్ మీడియాలో శివ సినిమా హీరోకు సబంధించిన ఓ వార్త వైరల్‌గా మారింది. అంతే కాదు ఈన్యూస్ చాలా మందిని ఆశ్చర్యానికి గురి చేసింది కూడా. అదేంటంటే శివ సినిమా కోసం హీరోగా ముందు నాగార్జునను అనుకోలేదట. వర్మ ఈకథను ముందుగా మరో హీరో దగ్గరకు తీసుకెళ్లాడట. ఇంతకీ ఆ హరో ఎవరో కాదు విక్టరీ వెంకటేష్.

35
నాగార్జున కంటే ముందు..

రామ్ గోపాల్ వర్మ కథను ఏ హీరో కోసం రాయడు. ఆయన సినిమాలో కథ బలంగా ఉండాలని నమ్ముతాడు. అందుకే ఈసినిమా కథను రాసుకున్న తరువాత.. మొదటగా విక్టరీ వెంకటేశ్ దగ్గరకు వెళ్లాడట వర్మ. ఆ సమయంలో వెంకటేశ్న కుటుంబ కథా చిత్రాలతో మంచి గుర్తింపు పొందుతున్నారు. దర్శకుడు వర్మ, కథను వెంకటేష్ తండ్రి, స్టార్ నిర్మాత డి. రామానాయుడుకు వినిపించగా, ఆయనకు కథ బాగా నచ్చిందట. అయితే, ఆ కథలో ఉన్న యాక్షన్ సీన్స్, బోల్డ్ క్యారెక్టరైజేషన్.. వెంకటేశ్ ఇమేజ్‌కి సరిపోనని భావించి, రామానాయుడు ఆ ప్రాజెక్ట్‌ను సున్నితంగా తిరస్కరించినట్లు తెలుస్తోంది.

45
యూత్ ను ఆకట్టుకున్న సినిమా

వెంకటేశ్ స్థానంలో కొత్త హీరో ఎవరు సరిపోతారనే ఆలోచనలో ఉన్న వర్మకు, రామానాయుడే ఒక కీలక సలహా ఇచ్చారని తెలుస్తోంది. అప్పటికే రొమాంటిక్ సినిమాలతో దూసుకెళ్తున్న నాగార్జున ఈ పాత్రకు భిన్నంగా, కొత్తగా కనిపిస్తారని ఆయన సూచించారట. రామానాయుడి సలహా మేరకు వర్మ నాగార్జునకు కథ వినిపించగా, ఆయన వెంటనే అంగీకరించారు. దాంతో శివ సినిమా రూపుదిద్దుకుంది. ఈ సినిమా విడుదలైన వెంటనే హిట్ టాక్ రాలేదు.. కొన్నిరోజుల తరువాత బాక్సాఫీస్ ను షేక్ చేసింది మూవీ. యూత్ ను విపరీతంగా ఆకర్శించింది శివ సినిమా.

55
టాలీవుడ్ లో గేమ్ ఛేంజర్ మూవీ..

‘శివ’ సినిమా నాగార్జున కెరీర్‌లోనే కాకుండా, తెలుగు సినిమా పరిశ్రమలో కూడా ఒక గేమ్ చేంజర్‌గా నిలిచింది. ఈ సినిమా రిలీజ్ అయిన వెంటనే నాగార్జునను ఓవర్‌నైట్ స్టార్‌గా మారిపోయాడు. అప్పట్లోనే ఈమూవీ 5 కోట్లకు పైగా షేర్ వసూలు చేసి ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసింది. ఇక ఈసినిమా 36 ఏళ్ల తర్వాత తాజాగా రీ-రిలీజ్ కు రెడీ అవుతోంది. నవంబర్ 14న విడుదల కాబోతున్న శివ సినిమా 4K వెర్షన్‌ గురించి అక్కినేని అభిమానులు వెయ్యికళ్లతో ఎదురుచూస్తున్నారు.

Read more Photos on
click me!

Recommended Stories