టేస్టీ తేజకు షాకింగ్ రెమ్యునరేషన్, 8 వారాలకి అంత వసూలు చేశాడా..?

First Published | Dec 1, 2024, 9:06 AM IST

ఈవారం డబుల్ ఎలిమినేషన్ అంటూ షాక్ ఇచ్చాడు కింగ్ నాగార్జున. శనివారం ఎలిమినేషన్ లో టేస్టీ తేజ్ బయటకు వచ్చేశాడు. 8 వారాలు బిగ్ బాస్ ఇంట్లో ఉన్న టేస్టీ తేజ్ ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నాడో తెలుసా..? 

బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 చివరి దశకు వచ్చేసింది. రెండు వారాలు మాత్రమేమిగిలి ఉండటంతో.. ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ప్రకటించాడు కింగ్ నాగార్జున. ఈ క్రమంలోనే శనివారం ఎలిమినేషన్ లో టేస్టీ తేజ్ బయటకు వచ్చాడు. ఈ సీజన్ బిగ్ బాస్ హౌస్ లో కంటెస్టెంట్స్ తో పాటు వైల్డ్ కార్డ్ ద్వారా హౌస్ లోకి వచ్చాడు టేస్టీ తేజ. అయితే ఈసారి టేస్టీ తేజ్ తీరు చూసి  ఆడియన్స్ తో పాటు హౌస్ లో ఉన్నవారు కూడా  సర్ప్రైజ్ కి గురయ్యారు.

Also Read: సుబ్బరాజు భార్య బ్యాగ్రౌండ్ ఏంటో తెలుసా... ఏం చేస్తుంది.. ఎక్కడ ఉంటుంది..?

 అంతకు ముందు సీజన్ లో టేస్టీ తేజ పాల్గొన్నాడు కాని.. చాలా బద్దకంగా ప్రవర్తించాడు. టాస్కలు ఆడలేదు. పనులు చేయలేదు. కాని ఈసీజన్ లో మాత్రం చాలా జాగ్రత్తగా ప్రవర్తించాడు తేజ. . గత సీజన్ లో టేస్టీ తేజ టాస్కులు పెద్దగా ఆడింది ఏమి లేదు. కానీ ఈ సీజన్ లో మాత్రం ఆయన ఎంటర్టైన్మెంట్ తో పాటు, టాస్కులు కూడా అద్భుతంగా ఆడాడు.  అయితే ఈసారి తాను ఆడిన ఏ టాస్క్ లోను విజయం సాధించలేదు తేజ. 

Also Read: బిగ్‌ బాస్ షోలో అవినాష్‌ సంచలనం.. టేస్టీ తేజ ఔట్‌, నెక్ట్స్ ఎలిమినేట్‌ అతనేనా?


Bigg boss telugu 8

దాన్నికవర్ చేసుకోవడం కోసం లాజిక్ లు మాట్లాడుతూ.. తన ఎనాలసిస్ ను వినసొంపుగా చెపుతూ..కవర్ చేసే ప్రయత్నం  కూడా చేశాడు. కాని తేజ గత సీజన్ కంటే బాగా యాక్టీవ్ గా ఉండటం.. అంతో ఇంతో ఎంటర్టైన్ చేయడం. అదికూడా అవినాశ్ సపోర్ట్ తోనే చేయగలిగాడు. ఇలా చేయడం వల్లే హౌస్ లో సర్వేవ్ అయ్యాడు. ఇక తేజ కప్పు కొట్టాలి, టాప్ 5 లో ఉండాలి అన్న టార్గెట్ తో ఇంట్లోకి రాలేదని అతని మాటలు, ప్రవర్తన ను బట్టి అర్ధం చేసుకోచ్చు.

Also Read: బిగ్ బాస్ విన్నర్ కు అరుదైన వ్యాధి..? అభిజిత్ అందుకే ఇండస్ట్రీకి దూర అయ్యాడా..? ఇలా అయిపోయాడేంటి..?

ఓన్లీ తన అమ్మను బిగ్ బాస్ హౌస్ లో చూడాలి అనే టార్గెట్ తోనే వచ్చానని నోరు జారి దొరికిపోయాడు టేస్టీ తేజ. ఏది ఏమైనా.. అంత భారీ  శరీరం పెట్టుకొని ఈ రేంజ్ టాస్కులు ఆడటం ఆ ప్రయత్నం చేయడం కూడా తేజాను మెచ్చుకోవచ్చు. సీజన్ అంతా ఒక ఎత్తు అయితే.. ఈ వారం టేస్టీ తేజ కి బాగా నెగటివ్ అయ్యింది అనే చెప్పాలి. టాస్కులు ఆడేందుకు చాలా ప్రయత్నం చేసాడు కానీ, ఒక్క టాస్కు కూడా గెలవలేదు.  

Also Read: హీరో నవీన్ పోలిశెట్టి నటించిన ఏకైకా తెలుగు సీరియల్ ఏదో తెలుసా..?

పైగా తానూ ఓడిపోవడానికి కారణం గౌతమ్ అంటూ అతని వైపుకి నెట్టి నెగటివ్ చేయాలనీ చూసాడు. గౌతమ్ కావాలని తానూ సోలో బాయ్ అని నిరూపించుకోవడానికి నన్ను ఎదవని చేసాడు అంటూ జనాలకు ఎదో చెప్పే ప్రయత్నం చేసాడు. అది మిస్ ఫైర్ అయ్యింది. ఈ వారం మొదటి రోజు నుండే ఓటింగ్ లైన్ లో అందరికంటే టేస్టీ తేజ కి తక్కువ ఓట్లు పడుతూ వచ్చింది. కచ్చితంగా ఇతను ఎలిమినేట్ అవుతాడని అందరికి తెలిసింది. 

ఇదంతా పక్కన పెడితే.. బిగ్ బాస్ హౌస్ లో టేస్టీ తేజా 8 వారాలు ఉన్నాడు. మరి ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నాడు అనేది ప్రస్తుతం వైరల్ అవుతున్నవార్త. హౌస్ లో చాలా మంది మీద టేస్టీ తేజకు రెమ్యునరేషన్ గట్టిగానే వచ్చినట్టు తెలుస్తోంది. వారానికి రెండు లక్షల చొప్పున 8 వారాలకు తేజ్ 16 లక్షల వరకూ అందుకున్నాడని తెలుస్తోంది. 
 

Goutham Krishna

తేజది మంచి బిజినెస్ మైండ్. గత సీజన్ లో వచ్చిన రెమ్యునరేషన్ తో తేజా వ్యాపారాలు కూడా చేస్తున్నాడట. అంతే కాదు అతని యూట్యూబ్ ఛానల్ చాలా ఫేమస్. పెద్ద పెద్ద సెలబ్రిటీలను భోజనానికి కూర్చోబెడుతుంటాడు తేజ. వారితో ఇంటర్వ్యూలు చేస్తూ.. టేస్ట్ లు గురించి ఎంక్వైరీ చేస్తుంటారు. దాంతో అతని ఛానల్ చాలా ఫేమస్ అయ్యింది. ఇక ఈసారి సినిమా అవకాశాలు కూడా అందుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. మరి బటయకు వచ్చిన తరువాత తేజ్ ప్లానింగ్ ఎలా ఉంటుందో చూడాలి. 

Latest Videos

click me!