అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి తో సుబ్బరాజుకు బ్రేక్ వచ్చింది. ఇక వరుసగా విలన్ పాత్రలు చేస్తూ వచ్చాడు. దేశముదురు, ఆర్య, పోకిరి.. నమో వెంకటేష, దూకుడు, శ్రీమంతుడు ఇలావరుసగా సినిమాలు చేసుకుంటూ వచ్చాడు సుబ్బరాజు. ఇలా అన్ని సినిమాల్లో వేసింది విలన్ పాత్రలే కాని..హీరోల గ్లామర్ కు మనోడేమితీసిపోడు.
సినీ ఇండస్ట్రీలో స్టార్ కాస్ట్ తో పాటు.. క్యారెక్టర్ ఆర్టిస్టులు, సపోర్టింగ్ యాక్టర్స్ కు కూడా మంచి డిమాండ్ ఉంది. అందులోనూ పాత్రకు తగ్గట్టుగా నటించే సత్తా ఉన్న నటులకు మరింత మార్కెట్ ఉంది. అలాంటి జాబితాలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ సుబ్బరాజు పేరు ముందు వరుసలో ఉంటుంది.