వెండితెర ‘సీత’లు... జానకి పాత్రలో అలరించిన పది మంది హీరోయిన్లు.. ఎవరో తెలుసా?

Published : Jan 19, 2024, 05:04 PM ISTUpdated : Jan 19, 2024, 05:06 PM IST

మూడురోజుల్లో అయోధ్య Ayodhyaలో రామ మందిరం ప్రారంభోత్సవం జరగనుంది. ఈ సందర్భంగా ఎక్కడ చూసిన సీతారాముల మాటే వినిపిస్తోంది. ఈ క్రమంలో వెండితెరపై సీతాదేవికి అలరించిన హీరోయిన్ల గురించి తెలుసుకుందాం.  

PREV
110
వెండితెర ‘సీత’లు... జానకి పాత్రలో అలరించిన పది మంది హీరోయిన్లు.. ఎవరో తెలుసా?

ఈ తరం ప్రేక్షకులకు సీతాదేవి అంటే సూపర్ స్టార్ నయనతార (Nayanthara)నే. ఈమె సీతాదేవి ప్రాతలో నటించిన విషయం తెలిసిందే. ఈ జనరేషన్ కు సీతాగా వెండితెరపై మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. 2011లో వచ్చిన ‘శ్రీ రామ రాజ్యం’ చిత్రంలో నందమూరి బాలకృష్ణతో కలిసి చక్కటి నటనతో మెప్పించారు. ఆధ్యాత్మికత ఉట్టిపడేలా నటించింది. ఇప్పటి వరకు నయనతారను ఎవరూ బీట్ చేయలేకపోయారు. 

210

‘ఆదిపురుష్’ Adipurush తో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కృతి సనన్ (Kriti Sanon)  కూడా సీత పాత్రలో అలరించారు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రాఘవుడిగా నటించిన ఈ చిత్రం  రిజల్ట్ ఎలా ఉన్నా.... సీతాదేవిగా మాత్రం కృతి మంచి ప్రశంసలు అందుకున్నారు.  

310

సీనియర్ నటి జయప్రద Jaya prada  కూడా సీతాదేవి పాత్రలో నటించి మెప్పించారు. బాపు దర్శకత్వంలో 1976లో వచ్చిన ‘సీతా కళ్యాణం’ చిత్రంలో జానకీ పాత్రలో అలరించారు. 

410

అలనాటి నటి, తెలుగు తొలి సినిమా నటీమణి సురభి కమలాబాయి (Surabhi Kamalabai)  తెలుగు ప్రేక్షకులకు సీత పాత్రలో నటించి ఆకట్టుకున్నారు. 1932లో వచ్చిన ‘రామ పాదుక పట్టాభిషేకం’ చిత్రంలో సీతాదేవిగా జీవించి ప్రేక్షకులను మెప్పించారు. 

510

తెలుగు, తమిళ చిత్రాలతో వెండితెరపై అలరించిన అలనాటిని పుష్పవల్లి (Pushpavalli) కూడా సీతాదేవి పాత్రలో మెప్పించారు. 1936లో వచ్చిన ‘సంపూర్ణ రామయణం’ చిత్రంలో బాల సీతగా నటించారు. 
 

610

జానకీ పాత్రలో నటించిన మరో అలనాటి నటి త్రిపుర సుందరి (Tripura Sundari). 1994లో వచ్చిన ‘శ్రీ సీతా రామ జననం’తో వెండితెరపై అలరించారు. ఘంటశాల బలరామయ్య దర్శకుడు. ఈ చిత్రంలో రాముడిగా అక్కినేని నాగేశ్వర్ రావు నటించారు. 

710

తెలుగు చిత్రాల్లో ‘రామాయణం’ అనే  ‘లవకుశ’ మూవీ తప్పకుండా గుర్తుకు వస్తుంది. ఈ చిత్రంలో సీతాదేవిగా అంజలీదేవి (Anjali Devi)  అలరించారు. ఆమె నటనకు రాష్ట్రపతి గోల్డ్ మెడల్ కూడా అందింది. 

810

అలనాటి నటి చంద్రకళ (Chandrakala)  ’సంపూర్ణ రామాయణం’ ద్వారా సీతాదేవిగా అలరించారు. సీత పాత్రలో చక్కటి నటనతో ఆకట్టుకున్నారు. 
 

910

ఇక అన్నగారు, సీనియర్ ఎన్టీఆర్ నటించిన ‘శ్రీరామ పట్టాభిషేకం’ చిత్రంలో నటి సంగీత (Sangeetha) సీతాదేవిగా అలరించారు. ఈ చిత్రాన్ని అన్నగారే డైరెక్ట్ చేశారు. 

1010

నటి అర్చన Archana ‘శ్రీరామదాసు’ సినిమాలో సీతాదేవిగా ఆకట్టుకున్నారు. చక్కటి రూపం, అద్భుతమైన నటతో ప్రేక్షకులకు సీతమ్మ తల్లిగా కనిపించారు. సుమన్ రాముడి పాత్రలో జీవించారు. 

click me!

Recommended Stories