బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కృతి సనన్ (Kriti Sanon) స్టన్నింగ్ గా ఫొటోషూట్లు చేస్తోంది. మొన్నటి వరకు సంప్రదాయ దుస్తుల్లో మైమరిపించిన ఈ ముద్దుగుమ్మ తన సినిమా ప్రమోషన్ కోసం రెచ్చిపోయింది.
హిందీ చిత్రాల్లో మంచి గుర్తింపు పొందిన కృతి సనన్ తెలుగు ప్రేక్షకులకు కూడా బాగానే పరిచయం అయ్యింది. మహేశ్ బాబు ‘వన్ నేనొక్కడినే’, చైతూ ‘దోచేయ్’, ప్రభాస్ ‘ఆదిపురుష్’ చిత్రాలతో అలరించింది.
రీసెంట్ గా తను నటించిన ‘గణపథ్’ చిత్రం కూడా తెలుగులో విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక ప్రస్తుతం తన రాబోయే చిత్ర ప్రమోషన్స్ లో బిజీగా ఉంది. ఈ సందర్భంగా వరుసగా ఫొటోషూట్లు చేస్తోంది.
షాహిద్ కపూర్ - కృతి సనన్ జంటగా నటించిన లేటెస్ట్ ఫిల్మ్ Teri Baaton Mein Aisa Uljha Jiya. ఈ మూవీ ఫిబ్రవరి 9న గ్రాండ్ విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా ప్రచార కార్యక్రమాలను జోరుగా నిర్వహిస్తున్నారు.
ఇందులో భాగంగా కృతి సనన్ మైండ్ బ్లోయింగ్ ఫొటోషూట్ చేసింది. మినీ డ్రెస్ లో టాప్ గ్లామర్ తో పాటు డీప్ థైస్ అందాలతో మతులు పోగొట్టింది. గ్లామర్ మెరుపులతో చూపుతిప్పుకోకుండా చేసింది.
ప్రస్తుతం ఆ ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఫ్యాన్స్, నెటిజన్లు ఈ బ్యూటీ స్టిల్స్ కు ఫిదా అవుతున్నారు. ఈ రాబోయే చిత్రం నుంచి తాజాగా ట్రైలర్ కూడా విడుదలై ఆకట్టుకుంటోంది.