చిరంజీవి తమ్ముడికి చుక్కలు చూపించిన స్టార్ హీరోయిన్, జీవితంలో ఆమెతో నటించకూడదని డిసైడ్ అయిన మెగాస్టార్

Published : Oct 16, 2025, 10:30 AM IST

ఓ హీరోయిన్ బిహేవియర్ వల్ల చిరంజీవి, ఆయన తమ్ముడు ఇద్దరూ ఇబ్బంది పడ్డారు. దీనితో ఆమెతో ఇకపై నటించకూడదని చిరంజీవి నిర్ణయించుకున్నారు. ఆ హీరోయిన్ ఎవరనేది ఈ కథనంలో తెలుసుకుందాం. 

PREV
15
హీరోయిన్ బిహేవియర్ తో చిరంజీవి అప్సెట్

మెగాస్టార్ చిరంజీవి సినీ కెరీర్ లో వివాదాలు చాలా తక్కువ. తన సహా నటీనటులు, నిర్మాతలు, దర్శకులతో చిరంజీవి మంచి రిలేషన్ మైంటైన్ చేసేవారు. నిర్మాతల డబ్బు వృధా కాకుండా షూటింగ్ సమయానికి పూర్తి కావాలని చిరంజీవి భావిస్తారు. అయితే తన కెరీర్ లో ఒక్కసారి మాత్రం ఓ స్టార్ హీరోయిన్ తో విభేదాలు మొదలయ్యాయి. ఆ హీరోయిన్ తో ఇక జీవితంలో నటించకూడదు అని చిరంజీవి డిసైడ్ అయ్యారట. ఆ హీరోయిన్ ఎవరో కాదు.. చిరుతో ఘరానా మొగుడు లాంటి ఇండస్ట్రీ హిట్ లో నటించిన నగ్మా.

25
నగ్మా, చిరంజీవి సినిమాలు

ఘరానా మొగుడు సమయంలో ఆమె ఇండస్ట్రీకి కొత్త. దీనితో దర్శక నిర్మాతల సమయం వృధా చేసేది కాదు. కానీ ఆ తర్వాత స్టార్ డమ్ వచ్చాక నగ్మాలో అహం పెరిగిందట. ఘరానా మొగుడు తర్వాత చిరంజీవి.. ముగ్గురు మొనగాళ్లు, రిక్షావోడు లాంటి చిత్రాల్లో కూడా నగ్మాకి అవకాశం ఇచ్చారు. ముగ్గురు మొనగాళ్లు చిత్రాన్ని చిరంజీవి సొంతంగా నిర్మించారు. చిరంజీవి సోదరుడు నాగబాబు కూడా ఈ చిత్రానికి నిర్మాత. రాఘవేంద్రరావు దర్శకుడు.

35
మెగా బ్రదర్ కి చుక్కలు చూపించిన నగ్మా

ఈ చిత్ర షూటింగ్ సమయంలో నగ్మా నాగబాబుకు చుక్కలు చూపించింది. అసలు ఏమాత్రం సహకరించేది కాదట. ప్రతి ఒక్కరికీ ఎదురుచెప్పేదట. ప్రొడక్షన్ లో ప్రతిసారి కంప్లైంట్స్ చేసేది. డ్యాన్స్ మాస్టర్ స్టెప్పులని ఫాలో కాకుండా ఇబ్బంది పెట్టేది. అది గమనించిన చిరంజీవి.. నగ్మాకి సపరేట్ గా క్లాస్ పీకారు. ఆ రోజు చిరంజీవి కోపం కట్టలు తెంచుకుందట. చిరంజీవి వార్నింగ్ తో నగ్మా మిగిలిన షూటింగ్ పూర్తి చేసింది.

45
చిరంజీవి నిర్ణయం ఇదే

కానీ నగ్మా పూర్తిగా మారలేదు. ఆ తర్వాత రిక్షావోడు చిత్రంలో కూడా అవకాశం ఇచ్చారు. ఈ మూవీ కోడి రామకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కింది. ఈ మూవీ షూటింగ్ సమయంలో నగ్మా.. దర్శకుడు కోడి రామకృష్ణని అసలు లెక్క చేసేది కాదట. షూటింగ్ ఆలస్యంగా రావడం, త్వరగా వెళ్లిపోవడం, తనకి ఇష్టం వచ్చినట్లు ఉండడం లాంటివి చేసేదట. ఎలాగోలా షూటింగ్ పూర్తి చేశారు. ఈ మూవీ తర్వాత ఇకపై నగ్మాతో జీవితంలో నటించకూడదని చిరంజీవి డిసైడ్ అయ్యారు.

55
వద్దని చెప్పిన చిరంజీవి

ఈ మూవీ తర్వాత నగ్మాకి తన బిహేవియర్ కారణంగా తెలుగులో ఒకటి అరా అవకాశాలు మాత్రమే హీరోయిన్ గా దక్కాయి. దీనితో నగ్మా తమిళ ఇండస్ట్రీపై ఫోకస్ పెట్టింది. స్నేహం కోసం మూవీలో హీరోయిన్ గా నగ్మా పేరుని పరిశీలించారట. కానీ ఆమె బిహేవియర్ కారణంగా చిరంజీవి వద్దని చెప్పారు. దీనితో మీనాకి ఆ అవకాశం దక్కింది.

Read more Photos on
click me!

Recommended Stories