చదువుకోవడానికి డబ్బుల్లేక కూలి పని.. తోటి విద్యార్థుల సపోర్ట్ తో చదివిస్తే.. స్టార్‌ డైరెక్టరై సంచలనం..

First Published | Aug 3, 2024, 2:45 PM IST

ఆయన ఇండస్ట్రీని శాషించిన దర్శకుడు. అత్యధిక సినిమాలు తీసి రికార్డు సృష్టించిన దర్శకుడు. కట్‌ చేస్తే డబ్బుల్లేక స్కూల్‌ మానేసి కూలీ పని చేశాడు. ఆయనెవరో తెలుసా?
 

దర్శకరత్న దాసరి నారాయణరావు.. తెలుగు సినిమాని మలుపుతిప్పిన దర్శకుడు. ఇంకా చెప్పాలంటే టాలీవుడ్‌ని కొత్త పుంతలు తొక్కించాడు. నాలుగు దశాబ్దాలపాటు టాలీవుడ్‌ని శాషించాడు. కేవలం సినిమాలతోనే కాదు, పెద్దరికంలోనూ ఆయన శాషించాడు. ఇండస్ట్రీకి పెద్దదిక్కుగా ఉన్నాడు. ఆపదలో ఉన్న వారిని ఆడుకున్నాడు, చేయి చాచి వచ్చిన వారికి సాయం చేశాడు. టాలెంట్‌ని నమ్ముకుని వచ్చిన వారిని ఆదరించి స్టార్స్ ని చేశాడు. ఎంతో మందికి జీవితాలను ఇచ్చాడు. ఎంతో మంది ఆర్టిస్టులు, టెక్నీషియన్లని తయారు చేశారు. ఒక వృక్షంలా ఎదిగి, ఎంతో మందికి నీడనిచ్చాడు. 
 

సినిమాల పరంగా మన ఇండియాలోనే అత్యధిక సినిమాలు చేసిన దర్శకుడిగా నిలిచారు. 150కిపైగా చిత్రాలకు ఆయన దర్శకత్వం వహించారు. లిమ్కా బుక్‌ రికార్డుల్లోకి ఎక్కారు. అదే సమయంలో దర్శకుడిగా అనేక జోనర్‌ చిత్రాలు చేశారు. ముఖ్యంగా సాంఘీక అసమానతలు, లింగ వివక్షపై ఆయన సినిమాల రూపంలో పోరాటం చేశాడు. సమానత్వాన్ని కోరుకున్నారు. ఆయన అన్నిరకాల కాన్సెప్ట్ చిత్రాలు చేశారు. టాలీవుడ్‌లోనే దిగ్గజ దర్శకుడిగా ఎదిగాడు. నిలిచాడు. శాషించాడు. 
 


ఇండస్ట్రీలో ఎవరికి ఏ బాధ వచ్చినా దాసరి గడపతొక్కేవాళ్లు. ఆయన వద్దకు వెళ్లితే సమస్య పరిష్కారం అవుతుందనే నమ్మకం అందరిలోనూ ఉండేది. కార్మికుల సమస్యల కోసం పోరాడారు. పరిష్కరించారు. ఇండస్ట్రీ సమస్యలపై కూడా ఆయన తనవంతు పోరాటం చేశారు. సహాయం చేశారు. ఇలా అన్ని రకాలుగా పెద్దదిక్కుగా ఉన్నారు దర్శకరత్న దాసరి నారాయణ రావు. 

దర్శకుడికి ఒక ఇమేజ్‌, గుర్తింపు, స్టార్‌ స్టేటస్‌ని తీసుకొచ్చిన డైరెక్టర్‌ దాసరి నారాయణరావు. అలాంటిది ఆయన చిన్నప్పుడు డబ్బుల్లేకి కూలి పని చేయాల్సి వచ్చిందట. స్కూల్లో చదువుకునే సమయంలో ఫీజ్‌ కట్టి చదివేందుకు డబ్బుల్లేకపోవడంతో వాళ్ల నాన్న చదువు మార్పించి వడ్రంగి పనికి చేరాడట. అక్కడే సైకిల్‌పై టీచర్‌ వెళ్తుండగా, ఆయన సైకిల్‌ చైన్‌ ఊడింది. అది గమనించిన దాసరి వచ్చి వాళ్ల సర్‌ చైన్‌ సరి చేశాడు. ఏంట్రీ నువ్వు ఇక్కడ ఉన్నావంటే, మానాన్న చదివించలేనని చెప్పాడు. దీంతో వండ్రంగి పనిలో కూలికి చేరానని తెలిపాడట. 
 

దీంతో చలించిపోయిన ఆ టీచర్‌ దాసరి నారాయణరావుని వాళ్ల నాన్న వద్దకు తీసుకెళ్లి, మీ అబ్బాయి చాలా క్లవర్‌ స్టూడెంట్‌, చదివించకపోతే లైఫ్‌ పాడవుతుందని చెప్పినా, వాళ్ల నాన్న చదివించే స్థోమత లేదని చెప్పడంతో ఆ టీచర్‌ స్కూల్‌కి తీసుకెళ్లి, అందరు స్టూడెంట్స్ కి ఈ విషయం చెప్పి, వాళ్ల వద్ద ఉన్న మనీ జమ చేసి ఫీజు కట్టించేలా చేశాడు. ఈ క్రమంలో తోటి స్టూడెంట్స్ అంతా తన వద్ద ఉన్న అణా, బేడ, పావలా కలేసి దాసరి నారాయణ రావు స్కూల్‌ ఫీజు కట్టారట. అనంతరం స్కాలర్‌షిప్‌ వచ్చిందని, దీంతో అలా తాను ఉన్నత చదువులు చదివినట్టు తెలిపారు దాసరి నారాయణరావు. ఓపెన్‌ హార్ట్ వీత్‌ ఆర్కే షోలో ఈ విషయాన్ని వెల్లడించారు. అప్పుడు ఆ టీచర్‌ కలవకపోతే, ఆ స్టూడెంట్స్ తమ చిల్లర డబ్బులు ఇవ్వకపోయినా దాసరి అనే గొప్ప దర్శకుడిని మనం చూసే వాళ్లం కాదేమో. 

దాదాపు నాలుగు దశాబ్దాలపాటు దర్శకుడిగా, నిర్మాతగా, రైటర్ గా, నటుడిగా రాణించారు దాసరి. ఎన్నో అవార్డు చిత్రాలు చేశారు. రెండు సార్లు జాతీయ అవార్డులు అందుకున్నారు. రఘుపతి వెంకయ్య పురస్కారం కూడా దక్కింది. రాజకీయాల్లోనూ ఆయన కీయాశీలకంగా పనిచేశారు. కేంద్ర మంత్రిగా పనిచేశారు. 2017లో ఆయన అనారోగ్యంతో కన్నుమూశారు. 

Latest Videos

click me!