Bigg boss telugu 8
బిగ్ బాస్ రియాలిటీ షోకి ఉన్న క్రేజ్ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగులో కూడా బిగ్ బాస్ గ్రాండ్ సక్సెస్. 2017లో ఎన్టీఆర్ హోస్ట్ గా బిగ్ బాస్ తెలుగు ప్రారంభమైంది. ఇప్పటి వరకు ఏడు సీజన్స్ పూర్తి చేసుకుంది. సీజన్ 1, సీజన్ 2లకు ఎన్టీఆర్, నాని హోస్ట్స్ గా వ్యవహరించారు. సీజన్ 3 నుండి నాగార్జున కొనసాగుతున్నారు.
సీజన్ 6 మాత్రమే ఆదరణ పొందలేదు. టీఆర్పీ రేటింగ్ లో వెనకబడింది. దాంతో సీజన్ 7 సరికొత్తగా రూపొందించి సక్సెస్ అయ్యారు. బిగ్ బాస్ తెలుగు 7లో సంచలనం నమోదు అయ్యింది. కామనర్ కోటాలో హౌస్లో అడుగు పెట్టిన పల్లవి ప్రశాంత్ టైటిల్ విన్నర్ అయ్యాడు. సీజన్ 7 గేమ్స్, టాస్క్స్, ఎలిమినేషన్స్, వైల్డ్ కార్డు ఎంట్రీలు భిన్నంగా ప్లాన్ చేశారు.
సీజన్ 8 సైతం విన్నూత్నంగా ఉంటుందనే ప్రచారం జరుగుతుంది. ఆల్రెడీ బిగ్ బాస్ 8 లోగో విడుదల చేశారు. కాన్సెప్ట్ టీజర్ సైతం వచ్చేసింది. నాగార్జున ఒక్కసారి కమిటైతే అన్ లిమిటెడ్ అంటున్నాడు. ఈ అన్ లిమిటెడ్ అనే పదంలోనే ఏదో మేటర్ ఉందనే ప్రచారం జరుగుతుంది.
Bigg boss telugu 8
కంటెస్టెంట్స్ ఎంపిక కూడా పూర్తి అయ్యింది. నటుడు అలీ తమ్ముడు ఖయ్యూమ్ అలీ, అమృత ప్రణయ్, రీతూ చౌదరి, ప్రభాస్ శ్రీను, సోనియా సింగ్, బంచిక్ బబ్లు, కుమారీ ఆంటీ, మై విలేజ్ షో అనిల్, బుల్లెట్ భాస్కర్, యాదమ్మ రాజు, విష్ణుప్రియ ఎంపికైన కంటెస్టెంట్స్ లిస్ట్ లో ఉన్నారని అంటున్నారు. వేణు స్వామి, అంబటి రాయుడు, అబ్బాస్, వినోద్ కుమార్, రోహిత్ వంటి క్రేజీ నేమ్స్ కూడా వినిపిస్తున్నాయి.
Bigg boss telugu 8
బిగ్ బాస్ 8 నుండి రెండు ప్రోమోలు వచ్చాయి. అయితే అధికారికంగా లాంచింగ్ డేట్ ప్రకటించలేదు. అయితే సెప్టెంబర్ 1న గ్రాండ్ లాంచ్ ఈవెంట్ జరిగే అవకాశం కలదు. స్టార్ మా లింక్డ్ ఇన్ ఖాతాలో మరో 30 రోజుల్లో బిగ్ బాస్ తెలుగు 8 అని పోస్ట్ చేసినట్లు సమాచారం. ఆ లెక్కన సెప్టెంబర్ నెలలో మొదటి ఆదివారం బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 ప్రారంభం అవుతుంది.
మరి అదే నిజమైతే కొద్ది రోజుల సమయం మాత్రమే ఉంది. ఇది బిగ్ బాస్ లవర్స్ కి కిక్ ఇచ్చే న్యూస్ అనడంలో సందేహం లేదు. కింగ్ నాగార్జున మరోసారి హోస్ట్ గా అలరించనున్నారు. మూడు నెలల పాటు ఆడియన్స్ తమ ఫెవరేట్ షో చూస్తూ ఎంజాయ్ చేయవచ్చు.