కీర్తి సురేష్ ను హీరో నాని కొడుకు అలా పిలుస్తాడా..? స్వయంగా వెల్లడించిన మహానటి

First Published | Aug 3, 2024, 2:26 PM IST

టాలీవుడ్ నేచురల్ స్టార్ నానికి.. మహానటి కీర్తి సురేష్ కు మధ్య మంచి స్నేహం ఉంది. ఇద్దరు జంటగా హిట్ సినిమాలు కూడా చేశారు. అయితే హరో నాని గారాల కొడుకు అర్జున్.. కీర్తి సరేష్ ను ఏమని పిలుస్తాడో తెలుసా..? 

మహానటి కీర్తి సురేష్ తో టాలీవుడ్ నేచురల్ స్టార్  నాని కి మంచిస్నేహం ఉంది. ఇద్దరు కలిసి నటించింది రెండు సినిమాలే అయినా.. ఇండస్ట్రీలోనిబెస్ట్ ఫ్రెండ్స్ లో వీరిద్దరు ఓకరు. ఇద్దరికి నటన విషయంలో మంచి పేరు ఉంది. ఇద్దరు ఫ్యామిలీ ఆడియన్స్ కు బాగా దగ్గరైన వారు కావడంతో వీరి కాంబినేషన్ కు కూడా మంచి క్రేజ్ ఉంది. ఇక ఈ ఇద్దరు తారలు  కలిసి  నేను లోకల్,  దసరా సినిమాలో నటించారు. 
 

Keerthy Suresh Photos

ఈ రెండు సినిమాలు మంచి విజయం సాధించాయి. అయితే వీరి స్నేహానికి సబంధించి కీర్తి సురేష్ ఇదివరకు కొన్ని కామెంట్లు కూడా చేశారు. గతంలో ఇచ్చిన  ఓ ఇంటర్వ్యూలో ఆమె  మాట్లాడుతూ.. హైదరాబాద్ కి వస్తే నాని ఇంటికే మిస్ అవ్వకుండా వెళ్తాను, వాళ్ళ వంటింట్లోకి కూడా వెళ్లి వంట కూడా చేసిపెడుతుంటాను..  నాని ఫ్యామిలీ నాకు అంత క్లోజ్. నాని భార్య అంజనా కూడా చాలా క్లోజ్ అని వెల్లడించింది. 


ఇలా వారి స్నేహం గురించి చాలా మందికి తెలిసిన విషయమే అయితే తాజాగా మరో విషయం వైరల్ అవుతుంది. అదేంటంటే.. నాని కొడుకు అర్జున్ కీర్తి సురేష్ ను ఏమని పిలుస్తాడో తెలుసా..? అర్జున్ అంటే కీర్తి సురేష్ కు బాగా ఇష్టమట. ఇంటికి వస్తే ఎక్కువగా అర్జున్ తోనే ఆడుకుంటుందట. దాంతో ఆమెను నాని కొడుకు ఏమని పిలుస్తాడు అనేది ఆసక్తి కరంగా మారింది. 

ఈ విషయంలో కూడా కీర్తి సురేష్ క్లారిటీ ఇచ్చింది. కీర్తి ప్రస్తుతం  రఘు తాత అనే సినిమాలో నటిస్తోంది. తమిళంలో  రాబోతుంన్న ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా.. అక్కడి మీడియాకు  ఓ ఇంటర్వ్యూ ఇచ్చింది కీర్తి సురేష్. ఆ ఇంటర్వ్యూలో  నాని కొడుకు అర్జున్ గురించి కీర్తి సురేష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

కీర్తి సురేష్ మాట్లాడుతూ.. నాని కొడుకు జున్ను నా స్ట్రెస్ బస్టర్. జున్ను నన్ను కీర్తి అత్త అని పిలుస్తాడు. వాడి క్యూట్ నెస్ చూస్తే నాకు హ్యాపీగా ఉంటుంది. జున్ను చాలా తొందరగా పెరుగుతున్నాడు. జున్ను పెద్దవాడవడం సంతోషంగా ఉంది. హైదరాబాద్ కి వస్తే కచ్చితంగా జున్నుని కలిసే వెళ్తాను. వాడి వాయిస్ మెసేజెస్ వింటూ ఉంటాను. నాకు బర్త్ డే విషెష్ కూడా క్యూట్ గా చెప్పాడు అని ఆమె వెల్లడించింది. 
 

అంతే కాదు చెప్పడంతో పాటు..  అర్జున్ హ్యాపీ బర్త్ డే కిట్టి అత్త అని  చెప్పిన వాయిస్ క్లిప్ ని కూడా  ఆ ఇంటర్వ్యూలో వినిపించింది. దీంతో నాని ఫ్యామిలీకి కీర్తి సురేష్ తో మంచి స్నేహం ఉందో తమిళ ఆడియన్స్ కు కూడా అర్ధం అయ్యింది. నాని ఫ్యాన్స్ కూడా ఈ విషయంలో దిల్ ఖుష్ అవుతున్నారు. కాని అర్జున్ అలా పిలవడంతో నానికి కీర్తి చెల్లెలు అయిపోయింది అంటూ... కామెంట్లు కూడా వినిపిస్తున్నాయి. 

Latest Videos

click me!