తమిళనాడుకు చెందిన రమ్యకృష్ణ తమిళ చిత్రాలతో పాటు తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ ఫిల్మ్స్ లోనూ నటించిన లక్షలాది అభిమానులను సంపాదించుకుంది. అటు సినిమాల్లోనే కాకుండా ఇటు బుల్లితెరపైన రమ్యకృష్ణ అందాల విందు చేస్తోంది. ఐదుపదుల వయస్సులోనూ వన్నె తగ్గని అందంతో టెలివిజన్ ప్రేక్షకులను అలరిస్తోంది. మరోవైపు తన ఇమేజ్ తగ్గట్టుగా టీవీషోలలో వ్యవహరిస్తూ హుందా తనాన్ని చాటుకుంటోంది.