కాబోయే భర్తతో మెహరీన్‌ ఫోటో షూట్‌.. ఎంగేజ్‌మెంట్‌ డేట్‌ కూడా ఫిక్స్..?

First Published Mar 9, 2021, 3:34 PM IST

మెహరీన్‌ త్వరలో పెళ్లి పీటలెక్కబోతుందనే వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా తనకు కాబోయే వాడితో ఫోటో షూట్‌ చేసింది మెహరీన్‌. తన ఫ్రెండ్‌ మ్యారేజ్‌లో వీరిద్దరు ఫోటోలు దిగి సోషల్‌ మీడియా ద్వారా పంచుకున్నారు. మొత్తంగా మ్యారేజ్‌ విషయాన్ని కన్ఫమ్‌ చేశారనే చెప్పాలి. మరోవైపు ఎంగేజ్‌మెంట్‌ డేట్‌ కూడా ఫిక్స్ అయ్యిందట. 

మెహరీన్‌ తన ప్రియుడు భవ్య బిష్ణోయ్‌ని వివాహం చేసుకోబోతుందట. ఆయన హర్యానా మాజీ ముఖ్యమంత్రి భజన్‌ లాల్‌ బిష్ణోయ్‌ మనవడు కావడం విశేషం. తను కూడా ఇప్పుడు రాజకీయ నాయకుడిగా, సామాజిక వేత్తగా రాణిస్తున్నారు.
undefined
ఇది చూసిన నెటిజన్లు, సినీ ప్రముఖులు వీరికి విషెస్‌ చెబుతున్నారు. మెహరీన్‌తో ఉన్న అబ్బాయి ఎవరు అని కొందరు అడగ్గా మరికొందరు స్పందిస్తూ కాబోయే భర్త అని చెప్పడం విశేషం.
undefined
తాజాగా మెహరీన్‌, భవ్య బిష్ణోయ్‌ కలిసి ఓ ఫ్రెండ్‌ పెళ్లికి హాజరయ్యారు. ఆ పెళ్లిలో వీరిద్దరే హైలైట్‌ కావడం విశేషం. ఇద్దరు కలిసి ఫోటోలకు పోజులిచ్చారు. ఓ రకంగా సపరేట్‌గా వీరిద్దరు ఫోటో షూట్‌ పెట్టుకున్నంత పని చేశారు.
undefined
ఇదిలా ఉంటే తాజాగా వీరి ఎంగేజ్‌మెంట్‌ డేట్‌ కూడా ఫిక్స్ అయ్యిందని తెలుస్తుంది. ఈ నెల 12న రింగులు మార్చుకునే ప్రోగ్రామ్‌ పెట్టుకున్నారట. ఇప్పటికే ఇరు కుటుంబ సభ్యులు వీరి మ్యారేజ్‌కి ఓకే చెప్పారట. ఇటీవల వీరంతా కలిసి పార్టీ కూడా చేసుకున్నారు.
undefined
రాజస్థాన్‌లోని జోద్‌పూర్‌ విల్లా ప్యాలెస్‌లో ఈ ఎంగేజ్‌మెంట్‌ జరుగుతుందని సోషల్‌ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ఎంగేజ్‌మెంట్‌నే చాలా గ్రాండ్‌గా చేయబోతున్నట్టు సమాచారం.
undefined
ఇక పెళ్లి కనీ వినీ ఎరుగని రీతిలో అత్యంత వైభవంగా నిర్వహించాలని ప్లాన్‌ చేస్తున్నారట. అబ్బాయిది ఎలాగూ రాజకీయకుటుంబం, మాజీ సీఎం ఫ్యామిలీ కావడంతో వీరి మ్యారేజ్‌ వేడుక అంగరంగ వైభవంగా చేయాలనుకుంటున్నారట.
undefined
పంజాబ్‌కి చెందిన మెహరీన్‌ తెలుగుతోనే నటిగా మారింది. ఆమె టాలీవుడ్‌లో నాని సరసన `కృష్ణగాడి వీరప్రేమ గాథ` చిత్రంలో నటించింది. తొలి చిత్రంతోనే తన అందచందాలతో ఆకట్టుకుంది.
undefined
ఆ సినిమా హిట్ తర్వాత కొంత గ్యాప్ తీసుకొని మారుతి దర్శకత్వంలో శర్వానంద్ హీరోగా వచ్చిన 'మహానుభావుడు' సినిమా చేసింది. ఈ సినిమా కూడా ప్రేక్షకుల్నీ భాగానే అలరించింది. రవితేజతో `రాజాది గ్రేట్‌`లో నటించి మరో హిట్‌ని అందుకుంది.
undefined
ఆ మధ్య అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన 'ఎఫ్2'లో నటించి మరో మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో హానీ ఈజ్‌ ద బెస్ట్ అంటూ కనువిందు చేసింది. ప్రస్తుతం ఈసినిమాకి సీక్వెల్‌గా రూపొందుతుంది `ఎఫ్‌3`లో నటిస్తుంది. ఇక మెహ్రీన్‌కు ఇదే చివరి సినిమా కానుందని సమాచారం.
undefined
మెహరీన్‌ పెళ్లి కూడా అతి త్వరలోనే ఉండే అవకాశాలున్నాయట. మరి మ్యారేజ్‌ తర్వాత మెహరీన్‌ సినిమాలు చేస్తుందా? లేక పూర్తిగా ఫ్యామిలీ లైఫ్‌కి షిఫ్ట్ అయిపోతుందో చూడాలి.
undefined
హాట్‌ ఫోటోలతో ఆకట్టుకుంటున్న మెహరీన్‌.
undefined
హాట్‌ ఫోటోలతో ఆకట్టుకుంటున్న మెహరీన్‌.
undefined
హాట్‌ ఫోటోలతో ఆకట్టుకుంటున్న మెహరీన్‌.
undefined
click me!