తమిళ డైరెక్టర్ ను రెండో పెళ్లి చేసుకోబోతున్నతెలుగు హీరోయిన్ ఈషారెబ్బా...? నెటిజన్లు ఏమంటున్నారంటే..?

Published : Sep 07, 2022, 12:40 PM ISTUpdated : Sep 07, 2022, 12:44 PM IST

ఫిల్మ్ ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్లు చాలా మంది ఉన్నారు. అందులో హీరోయిన్లు ఉన్నారు. హీరోలు కూడా ఉన్నారు. ఆలిస్ట్ లో ఉన్న తెలుగు హీరోయిన్ ఈషా రెబ్బా. ఇక ఈమె కూడా బ్యాచిలర్ లైఫ్ కు గుడ్ బై చెప్పబోతుందని సమాచారం.   

PREV
17
తమిళ డైరెక్టర్ ను రెండో పెళ్లి చేసుకోబోతున్నతెలుగు హీరోయిన్ ఈషారెబ్బా...? నెటిజన్లు ఏమంటున్నారంటే..?

ఫిల్మ్ ఇండస్ట్రీలో వరుసగా పెళ్లి పీటలెక్కుతున్నారు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ స్టార్లు. ఈ రెండు మూడేళ్ళలోనే చాలా మంది స్టార్లు  బ్యాచిలర్ లైఫ్ కు బై బై చెప్పారు. చాలా మంది హీరోలు, హీరోయిన్లు.. తాము ప్రేమించిన వారిని పెళ్లాడి లైఫ్ లో సెటిలైపోతున్నారు. ఈ వరసలోనే  పెళ్లి చేసుకోబోతోంది తెలుగు తార ఈషా రెబ్బ. 
 

27

 బాలీవుడ్ స్టార్స్ ఆలియా- రణ్ బీర్,  కత్రినా- విక్కీ, కోలీవుడ్ హీరో ఆది పినిశెట్టి హీరోయిన్ నిక్కి గల్రాని..ఇలా  చాలా మంది స్టార్లు పెళ్లిళ్ళు చేసుకున్నారు. ఇక త్వరలోపెళ్లి పీటలెక్కబోతోంది టాలీవుడ్ హీరోయిన్ ఈషా రెబ్బ. ఆమె ఓ దర్శకుడిని పెళ్ళాడబోతున్నట్టు తెలుస్తోంది. 

37
Eesha Rebba

టాలీవుడ్ తో పాటు కోలీవుడ్ లో కూడా వరుస సినిమాలు చేసింది ఈషా. ఒక రకంగా చెప్పాలంటే ఇక్కడికన్నా కూడా కోలీవుడ్ లోనే ఎక్కువ సినిమాలు చేసి.. అక్కడ ఎక్కువగా పాపులర్ అయింది. ఈ క్రమంలోనే  ఆమె నటించిన సినిమాలలో ఓమూవీని  డైరెక్ట్ చేసిన టాప్ డైరెక్టర్ ని రెండో పెళ్లి చేసుకోబోతుందట ఈషా రెబ్బా. ఈ విషయాన్ని కోలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. 

47
Eesha Rebba

ఇక ఇందులో పెద్ద ట్విస్ట్ ఏంటీ అంటే.. ఆ దర్శకుడికి ఇంతకు ముందే పెళ్ళై పిల్లలు కూడా ఉన్నారట. రీసెంట్ గానే డివోర్స్ తీసుకున్న ఆ డైరెక్టర్ తో అమ్మడు పరిచయం స్నేహంగా మారి.. అది కాస్త ప్రేమగా వికసించిందట. ఇక  ఇప్పుడు అది పెళ్లి వరకు దారి తీసింది అని కోలీవుడ్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. 

57

ఈ ఈ విషయంలో నెటిజన్లు స్పందిస్తున్నారు. ముఖ్యంగా  తెలుగు జనాలు ఘాటు మాటలు అంటున్నారు.  ఇంత చక్కగా ఉన్నావు ఇంత అందంగా ఉన్నావ్ రెండో పెళ్లి వాడిని చేసుకోవాల్సిన కర్మ ఏంటి పాప నీకు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఈ విషయంలో నిజం ఎంత ఉందో.. తెలియాలి అంటే..  ఈషా రెబ్బ  స్పందించే వరకూ ఆగాల్సిందే. 

67

హడావిడిగా స్టార్ హీరయిన్ అయిపోవాలి అని ఈషా రెబ్బ ఎప్పుడూఅనుకోలేదు. తనదైన స్టైల్ లో మంచి కథలు సెలక్ట్ చేసుకుంటూ.. మంచి మంచి  సినిమాలో నటిస్తూ రాణిస్తుంది తెలుగమ్మాయి. జనరల్ గా సినీ ఇండస్ట్రీలో తెలుగు అమ్మాయిలకి అవకాశాలు చాలా తక్కువ కానీ ఆ టఫ్ కాంపిటీషన్ ని తట్టుకొని నిలబడింది బ్యూటీ. 

77

అటు సినిమాలతో పాటు.. ఇటు సోషల్ మీడియాలో కూడా తెగ హడావిడి చేస్తుంటుంది బ్యూటీ. అప్పుడప్పుడు హాట్ హాట్ గా..అప్పుడప్పుడు ట్రెడిషనల్ గా పిక్స్ ను శేర్ చేస్తూ.. నెట్టింట ఫాలోయింగ్ పెంచుకుంటుంది. చూడడానికి ట్రెడిషనల్ గా ఉండడం ఎలాంటి ఎక్స్ప్రెషన్స్ నైనా పలికించడంతో అమ్మడు ఇప్పటికి ఇండస్ట్రీలు అవకాశాలు అందుకుంటూ వస్తుంది.

click me!

Recommended Stories