అప్పుడు జగతి నవ్వుకోని, నువ్వు ఎవరి గురించి ఆలోచిస్తున్నావో నాకు తెలుసు అమ్మ కానీ నేను చెప్పేది విను, ఇప్పటివరకు మీ ఇద్దరి మధ్య ఆటలు చాలు. నీ చదువు అని,పరీక్షలు అని, నీ వ్యక్తిగత జీవితానికి అడ్డు చెప్పావు. ఇప్పుడు పరీక్షలు అయిపోయాయి కదా అని అనేలోగా రిషీ, వసుకి ఫోన్ చేస్తాడు. అప్పుడు వసు, రిషి సార్ ఏంటి ఇప్పుడు చేస్తున్నారు.ఇప్పుడు మేడం ఫోన్ కట్ చేస్తే ఏమనుకుంటారు,పోని రిషి సార్ ఫోన్ ఎత్తకపోతే కొప్పడటారు అని అనుకుంటుంది. ఇంతలో జగతి, ఇప్పటికైనా నీ మనసులో విషయం చెప్పమ్మా అని అనగానే నేను రిషి సార్ తో మాట్లాడుతాను మేడం.