ఇండియన్‌ వైడ్‌గా తెలుగు హీరోలదే హవా.. ప్రభాస్‌, మహేష్‌, బన్నీ, తారక్‌, చరణ్‌ ఎవరి స్థానం ఎంతంటే?

Published : Apr 21, 2024, 04:19 PM ISTUpdated : Apr 23, 2024, 12:59 PM IST

స్టార్ హీరోల మధ్య సినిమా పోటీ ఎప్పుడూ ఉంటుంది. సక్సెస్‌ ని బట్టి వారి క్రేజ్‌, రేంజ్‌ కనిపిస్తుంది. తాజాగా టాప్‌ 10 ఇండియన్ స్టార్స్ లిస్ట్ వచ్చింది. ఇందులో తెలుగు హీరోలదే హవా ఉండటం విశేషం.   

PREV
19
ఇండియన్‌ వైడ్‌గా తెలుగు హీరోలదే హవా.. ప్రభాస్‌, మహేష్‌, బన్నీ, తారక్‌, చరణ్‌ ఎవరి స్థానం ఎంతంటే?

టాప్‌ తెలుగు స్టార్స్, టాప్‌ ఇండియన్‌ స్టార్స్, టాప్‌ ఇండియన్‌ హీరోయిన్లకి సంబంధించిన ప్రతి నెల ఓర్మాక్స్ మీడియా అనే సంస్థ లిస్ట్ లను విడుదల చేస్తుంటుంది. ఒక్కో నెలలో ఆడియెన్స్, అభిమానులు ఎక్కువగా ఎవరిని ఇష్టపడుతున్నారనే విషయాన్ని వెల్లడిస్తుంది. ఈ క్రమంలో తాజాగా మార్చి నెలకు సంబంధించిన లిస్ట్ ని విడుదల చేసింది ఓర్మాక్స్. టాప్‌ ఇండియన్‌ స్టార్స్ లిస్ట్ రాగా, ఇందులో తెలుగు హీరోలదే హవా కావడం విశేషం. 
 

29

టాప్‌ 10లో ఐదుగురు తెలుగు హీరోలే ఉన్నారు. నలుగురు హిందీ స్టార్స్ ఉండగా, ఒక్కరు మాత్రమే కోలీవుడ్ స్టార్‌ ఇందులో స్థానం సంపాదించుకున్నారు. ఇక టాప్ వన్‌లో షారూఖ్‌ ఖాన్‌ నిలిచారు. ఆయన గతేడాది `పఠాన్‌`, `జవాన్‌`, `డంకీ` చిత్రాలతో హ్యాట్రిక్‌ హిట్‌ని అందుకున్న విషయం తెలిసిందే. దీంతో ఇటీవల కాలంలో ఆయన బాగా టాక్‌ ఆఫ్ ది టౌన్‌ అయ్యారు. 
 

39

ఆ తర్వాత రెండో స్థానంలో ప్రభాస్‌ నిలిచారు. ఆయన `సలార్‌`తో పెద్ద హిట్ అందుకున్నారు. ఇప్పుడు `కల్కి2898ఏడీ`కి సంబంధించిన చర్చ జరుగుతుంది. గత రెండు మూడు నెలలుగా దీనిపైనే చర్చ జరుగుతుంది. సినిమా ఎప్పుడు రిలీజ్‌ అనేది ఆసక్తికరంగా మారింది. దీనికితోడు ఆయన సినిమాల బిజినెస్‌, ఆయన సినిమాల లైనప్‌ వంటి వాటి విషయాల్లో డిస్కషన్‌ పాయంట్‌గా మారారు ప్రభాస్‌. దీంతో రెండో స్థానంలో నిలిచారు. 

49
Thalapathy Vijay

మూడో స్థానంలో కోలీవుడ్‌ స్టార్‌ విజయ్‌ కి దక్కింది. ఆయన అభిమానులు సోషల్‌ మీడియాలో బాగా రచ్చ చేస్తుంటారు. అదే సమయంలో విజయ్‌ రాజకీయ పార్టీని ప్రారంభించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికలను లక్ష్యంగా చేసుకున్నారు. మరోవైపు ప్రస్తుతం ఓ మూవీలో నటిస్తున్నారు. ఈ మూవీ తరచూ వార్తల్లో నిలుస్తున్న నేపథ్యంలో విజయ్‌ మూడో స్థానం దక్కించుకున్నారు. ఎక్కువగా ఇష్టపడే హీరోగా మూడో స్థానంలో నిలిచారు. 
 

59

నాల్గో స్థానంలో మహేష్‌ బాబు ఉండటం విశేషం. ఇప్పటి వరకు ఒక్క పాన్‌ ఇండియా మూవీ చేయలేదు మహేష్‌ బాబు. ఈ ఏడాది `గుంటూరు కారం` చిత్రంతో వచ్చారు. ఇది పెద్దగా ఆడలేదు. కానీ బాగా నెగటివ్‌ కామెంట్లని ఎదుర్కొంది.అయితే ప్రస్తుతం ఆయన రాజమౌళితో గ్లోబల్‌ ఫిల్మ్  చేస్తున్నారు. ఈ మూవీకి సంబంధించిన చర్చఇండియా వైడ్‌గా సాగుతుంది. దీంతో మహేష్‌ బాబు పాన్‌ ఇండియా లెవల్‌లో క్రేజ్‌ని సొంతం చేసుకున్నారు. సినిమా ప్రారంభానికి ముందే ఈ రేంజ్‌ క్రేజ్‌ ఉంటే, ఇక సినిమా రిలీజ్‌ అయి పెద్ద హిట్‌ అయితే మహేష్‌ రేంజ్‌ మారిపోతుందని చెప్పొచ్చు. 
 

69

ఐదో స్థానంలో ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ నిలిచారు. `పుష్ప2`తో ఆయన చేస్తున్న రచ్చ వేరే స్థాయిలో ఉందని చెప్పొచ్చు. ఈ మూవీ నార్త్ లో బిజినెస్‌ సంచలనం సృష్టిస్తుంది. రెండు వందల కోట్లకుపైగా థియేట్రికల్‌ బిజినెస్‌ దక్కించుకున్నట్టు సమాచారం. ఈ మూవీపై మన తెలుగులో కంటే నార్త్ లోనే ఎక్కువగా చర్చకి తెరలేపింది. ఆ ఆడియెన్సే ఎక్కువగా వెయిట్‌ చేస్తున్న నేపథ్యంలో బన్నీకి ఐదో స్థానంలో నిలవడం విశేషం. 
 

79

ఆ తర్వాతి స్థానంలో ఎన్టీఆర్‌ ఉన్నారు. ఆయన ప్రస్తుతం `దేవర`సినిమాలో నటిస్తున్నారు. ఈ మూవీపై కూడా ఇండియా వైడ్‌గా బజ్‌ నెలకొంది. దీనికితోడు తారక్‌ హిందీలోకి ఎంట్రీ ఇస్తూ `వార్‌ 2`లో నటిస్తున్నారు. ఇటీవలే ఆయన `వార్‌ 2` షూటింగ్‌లోనూ పాల్గొన్నారు. అలాగే మరో హిందీ మూవీ చేయబోతున్నారనే టాక్‌ వినిపించింది. దీంతో పాన్‌ ఇండియా వైడ్‌గా ఆయన పేరు వినిపిస్తుంది. ఓర్మాక్స్ మీడియా ప్రకటించిన లిస్ట్ లో 6వ స్థానంలో నిలిచారు. 
 

89

వీరితోపాటు రామ్‌ చరణ్‌ కూడా టాప్‌ 10లో స్థానం దక్కించుకున్నాడు. ఆయన టాప్‌ 9వ స్థానంలో నిలవడం విశేషం. అయితే ఇటీవల ఎక్కువగా తెలుగులో ప్రచారంలో ఉన్న పేరు రామ్‌చరణ్‌ది. కానీ పాన్‌ ఇండియా వైడ్‌గా మాత్రం మిగిలిన హీరోలతో పోల్చితే ఆయన క్రేజ్‌ తక్కువగానే ఉంది. 
 

99

బాలీవుడ్‌ స్టార్స్ లో గ్రీకు వీరుడు హృతిక్‌ రోషన్‌ ఏడో స్థానంలో, అక్షయ్‌ కుమార్‌ ఎనిమిదో స్థానంలో ఉండగా, కండల వీరుడు సల్మాన్‌ ఖాన్‌ పదవ స్థానంలో నిలవడం విశేషం. ఒకప్పటి టాప్‌ ఇండియన్‌ స్టార్స్ ఇప్పుడు టాప్‌ 10 స్థానానికే పరిమితం కావడం గమనార్హం. ఆయనకు విజయాలు లేకపోవడం, పెద్దగా బయటకు రాకపోవడంతో ఈ స్థానంలో ఉన్నారు. అయితే `యానిమల్‌`తో సంచలనం రేపిన రణ్‌ బీర్‌ కపూర్‌, రణ్‌వీర్‌ సింగ్‌, మిస్టర్‌ పర్‌ఫెక్ట్ అమీర్‌ ఖాన్‌ ఇందులో స్థానం కోల్పోవడం గమనార్హం. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories