సినీ సెలబ్రిటీలు తమ అందం, యవ్వనంతో అభిమానులను ఆకర్షిస్తున్నారు. ఇంతకు ముందు సినిమాల్లో హీరోయిన్ల కెరీర్ టైమ్ చాలా తక్కువ ఉండేది. హీరోలతో పోల్చుకుంటే అది చాలా తక్కువ. ఒక హీరోయిన్ తక్కువలో తక్కువ 10 ఏళ్ళు కొనసాగితే ఎక్కువే. అయితే కొద్ది మంది హీరోయిన్లు మాత్రం ఏజ్ బార్ అయినా.. అందాన్ని అలానే మెయింటేన్ చేస్తున్నారు. అలాంటి అతి కొద్ది మంది నటీమణుల్లో మాధురీ దీక్షిత్ ఒకరు.