ఎంతైనా సమంత లాంటి స్టార్ బ్యూటీకి ఆ బ్రాండ్ నచ్చింది అంటే దాని స్పెషాలిటీ వేరే ఉంటుంది అని నెటిజన్లు అంటున్నారు. మరికొందరైతే అత్తారింటికి దారేది చిత్రంలో డైలాగ్ ని గుర్తు చేసుకుంటున్నారు. అతని వాచ్ అమ్మితే మీ బ్యాచ్ సెటిల్ అయిపోద్ది అని ఆ మూవీలో డైలాగ్ చెబుతుంది. ఇప్పుడు సమంత నిజంగానే అలాంటి వాచ్ ధరించింది అని నెటిజన్లు అంటున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇలాంటి వాళ్ళ కోసమే ఆ డైలాగ్ రాశాడని నెటిజన్లు అంటున్నారు.