తెలుగు హీరోలకు ఏడుపు‌ సీన్లు చేయడం రాదు.. సెట్‌లో వెంకీకి దారుణమైన అవమానం.. ప్రతీకారంతో ఏం చేశాడో తెలుసా?

First Published Jan 6, 2024, 4:20 PM IST

విక్టరీ వెంకటేష్‌ ఫ్యామిలీ ఆడియెన్స్ కి బాగా దగ్గరయ్యారు. ఫ్యామిలీ ఎమోషన్స్ ని పలికించడంలో దిట్ట. అయితే ఆయన ఓ సినిమా సెట్‌లో దారుణమైన అవమానం ఎదుర్కొన్నాడు. ఇన్నాళ్లు దాచిన ఓ సంచలన విషయాన్ని ఆయన బయటపెట్టారు. 
 

తెలుగు హీరోలకు ఎమోషన్స్ పలికించడం రాదా? ఏడుపు సీన్లు చేయడం రాదా? బయట జనాల్లో ఉన్న అభిప్రాయం ఇది. వెంకటేష్‌కి ఇదే ప్రశ్న, ఇదే అవమానం ఎదురయ్యింది. సినిమా సెట్‌లో ఆయన్ని అవమానించారు. దీంతో వెంకీ షాక్‌ తిన్నాడు. ఇలాంటి ఓ విచిత్రమైన కామెంట్‌ని ఆయన ఫేస్‌ చేశాడు. దీంతో తానేంటో చూపించాడు. ఇండస్ట్రీ ఏంటో చూపించాడు. నటనతోనే సమాధానం చెప్పాడు. మరి ఇంతకి ఏం జరిగిందంటే..
 

విక్టరీ వెంకటేష్‌ ప్రస్తుతం `సైంధవ్‌` చిత్రంలో నటించారు. ఆయన నటిస్తున్న 75వ చిత్రమిది. శైలేష్‌ కొలను రూపొందించిన ఈ మూవీలో శ్రద్ధా శ్రీనాథ్‌ హీరోయిన్‌ గా చేయగా, ఆర్య, ఆండ్రియా, రుహానీ శర్మ ముఖ్య పాత్రలు పోషించారు.సారా బాలనటిగా మెరిసింది. ఈ మూవీ సంక్రాంతికి రాబోతుంది. జనవరి 13న రిలీజ్ కానుంది. ఈ చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా `సైంథవ్‌` టీమ్‌ చిట్‌ చాట్‌ సాగింది. ఇందులో ఓ సంచలన విషయాన్ని బయటపెట్టారు వెంకీ. 
 

Latest Videos


సినిమా చేసేందుకు, పాత్రలో నటించే ముందు మీరు ఎలా ప్రీపేర్‌ అవుతారు? ఒక పాత్రలో మీ అప్రోచ్‌ ఎలా ఉంటుందని రుహానీ శర్మ ప్రశ్నించింది. దీనికి వెంకటేష్‌ స్పందిస్తూ ఓ ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. కెరీర్‌ బిగినింగ్‌లో ఒక అనుభవాన్ని ఆయన వెల్లడించారు. హీరోగా చేస్తున్న బిగినింగ్‌లో తెలుగులో హీరోలపై ఒక నెగటివ్‌ కామెంట్ ఉండేదట. తెలుగు హీరోలు ఎమోషన్స్ సీన్స్‌ చేయడం రాదని, కన్నీళ్లు పెట్టే సన్నివేశాల్లో ముఖం చాటేసి నటిస్తారని, కెమెరా ముందుస్ట్రెయిట్‌గా చూస్తూ యాక్ట్ చేయడం రాదనే విమర్శ ఉండేదట.
 

అలా తన సినిమా షూటింగ్‌ కోసం ఔట్‌ డోర్‌ వెళ్లినప్పుడు కొందరు బయట నుంచి అరుస్తూ ఉన్నారట. ఏంటని కనుకుంటే మీకు(తెలుగు హీరోలకు) ఎమోషన్స్ సీన్లు చేయడం రాదని, కన్నీళ్లు పెట్టుకునే సీన్లలో చేయడం రాదని అన్నారు. కెమెరా ముందు కాకుండా తల వంచి కనిపిస్తారని అవమానంగా మాట్లాడారట. సెట్‌లో అంత మాట అనడంతో వెంకటేష్‌ రగిలిపోయాడట. ఏంటి ఇలాంటి ఒపీనియన్‌ మనపైన ఉందా అని ఆలోచించాడట. కొన్నాళ్లపాటు అలాంటి సీన్లని ప్రాక్టీస్‌ చేశాడట. చాలా వర్కౌట్‌ చేసినట్టు చెప్పాడు వెంకటేష్‌. 

ఆ సమయంలో `ధర్మఛక్రం` సినిమాలో అలాంటి సీన్ చేయాల్సి వచ్చిందట. అందులో హీరోయిన్‌ చనిపోయినట్టు ఎమోషనల్‌ సీన్లు తీసేటప్పుడు కెమెరాని తన ఫేస్‌కి క్లోజ్‌గా పెట్టమని చెప్పి మరీ నటించాడట. అప్పుడు తానేంటో తెలుగు హీరోలు అంటే ఏంటో చూపించాడట. ఇదే కాదు, ఇలా రెండు మూడు సినిమాలు తాను చాలా వర్కౌట్‌ చేసినట్టు చెప్పాడు. ఆయా సీన్లు బాగా వచ్చేలా కెమెరాకి క్లోజ్‌గానే  చేసినట్టు తెలిపారు వెంకటేష్‌. కొన్ని సార్లు ఇలియరాజా సాడ్‌ సాంగ్స్ విని ఆ కన్నీటి సీన్లు చేసేవాడిని అని తెలిపారు. అలా తెలుగు ఇండస్ట్రీ పరువు, హీరోల పరువు నిలబెట్టాడు వెంకీ. 
 

Saindhav Trailer

వెంకటేష్‌ అంటే ఇప్పుడు ఎమోషనల్‌ సీన్లకి కేరాఫ్‌ అడ్రెస్. నిలబెట్టి ఏడిపించగల సత్తా ఆయన సొంతం. భావోద్వేగాలను పలికించడంలో ఆయన దిట్ట. ఆయన నటించిన ఎన్నో సినిమాల్లో తనదైన నటనతో ఏడిపించాడు వెంకీ. అదే సమయంలో ఏడుపు సీన్లలోనే అంతే రక్తి కట్టేలా చేసి మెప్పిస్తున్నారు. నవ్వించడం, ఏడిపించడం ఆయన తర్వాతే ఎవరైనా అనేంతగా పేరుతెచ్చుకున్నారు. ఇప్పుడు ప్రస్తుతం నటించిన `సైంధవ్‌`లోనూ ఆయన కన్నీళ్లు పెట్టుకునే సీన్లు ఉన్నాయి, కన్నీళ్లు పెట్టించే సీన్లు కూడా ఉన్నాయి. 

click me!