నేను మీకు తెలుసా చిత్రాన్ని మోహన్ బాబు సమర్పించగా, శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ బ్యానర్ పై లక్ష్మీ ప్రసన్న నిర్మించారు. అంతకు ముందు అజయ్ శాస్త్రి బారా(12) అనే షార్ట్ ఫిల్మ్ డైరక్ట్ చేసారు. దాన్ని దగ్గుపాటి రానా ప్రొడ్యూస్ చేసారు. అలాగే రాఖి, డేంజర్, చిత్రాలకు అశోశియేట్ డైరక్టర్, స్క్రీన్ ప్లే విభాగంలోనూ పనిచేసారు.