71st National Film Awards: 71వ జాతీయ చలన చిత్ర అవార్డుల్లో తెలుగు సినిమా సత్తా చాటింది. ప్రశాంత్ వర్మ హను మాన్, భగవంత్ కేసరి, బేబీ చిత్రాలకి అవార్డులు లభించాయి.
71వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో తెలుగు సినీ ఇండస్ట్రీకి గౌరవం దక్కింది. తెలుగు సినిమాల ప్రతిభను దేశం మరోసారి గుర్తించింది. పలువురు తెలుగు సినీ ప్రముఖులు తమ చిత్రాలతో సత్తా చాటి నేడు రాష్ట్ర చేతుల మీదుగా అవార్డులు అందుకున్నారు.
25
సాయి రాజేష్ ఖాతాలో మరో అవార్డు
ప్రతిభావంతుడైన దర్శకుడు సాయి రాజేశ్ "బేబీ" సినిమాకు ఉత్తమ కథా రచయిత (Best Screenplay Writer) విభాగంలో జాతీయ పురస్కారం అందుకున్నారు. ఈ అవార్డును భారత రాష్ట్రపతి ప్రదానం చేశారు. అంతకుముందు ఆయన నిర్మాతగా "కలర్ ఫోటో" సినిమాతో జాతీయ అవార్డు అందుకున్నారు. దీంతో ఆయన ఖాతాలో రెండవ జాతీయ అవార్డు చేరింది.
35
బేబీ చిత్రానికి అవార్డుల పంట
బేబీ మూవీ ఖాతాలో మరో నేషనల్ అవార్డు పడింది. గాయకుడు పీవీఎన్‌ఎస్ రోహిత్ ఉత్తమ నేపథ్య గాయకుడిగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా జాతీయ అవార్డు అందుకున్నారు. ప్రేమిస్తున్నా అనే సాంగ్ పడినందుకు రోహిత్ ఈ అవార్డు అందుకున్నారు. తన వినసొంపైన గాత్రంతో కోట్లాది మంది మనసులను గెలుచుకున్న రోహిత్, ఇప్పుడు జాతీయ స్థాయిలో ఘనతను సాధించారు.
తెలుగు ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న "హనుమాన్" చిత్రం జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది. ఈ సినిమా బృందం అత్యుత్తమ యానిమేషన్ & VFX విభాగంలో జాతీయ అవార్డు అందుకుంది. దర్శకుడు ప్రశాంత్ వర్మ, VFX సూపర్‌వైజర్ జెట్టి వెంకట్ కుమార్, నిర్మాత నిరంజన్ రెడ్డి ఈ గౌరవాన్ని సొంతం చేసుకున్నారు.
55
తెలుగు సినిమాకు జాతీయ గుర్తింపు
అదే విధంగా భగవంత్ కేసరి చిత్రం టాలీవుడ్ నుంచి ఉత్తమ చిత్రం గా ఎంపికైంది. ఈ అవార్డుని డైరెక్టర్ అనిల్ రావిపూడి, నిర్మాత సాహు గారపాటి రాష్ట్రపతి చేతుల మీదుగా అందుకున్నారు. మొత్తంగా హను మాన్, భగవంత్ కేసరి, బేబీ చిత్రాలు 71వ జాతీయ చలన చిత్ర అవార్డుల్లో సత్తా చాటాయి.