ఘనంగా బిగ్ బాస్ కంటెస్టెంట్ నటరాజ్ భార్య సీమంతం... ఆయన దూరంగా ఉన్నా, బాధ్యత నిర్వర్తించిన బుల్లితెర స్టార్స్

Published : Sep 19, 2021, 04:40 PM IST

బిగ్ బాస్ సీజన్ 5 కంటెస్టెంట్స్ లో ఒకరిగా ఉన్నారు నటరాజ్ మాస్టర్. నటరాజ్ మాస్టర్ భార్య నీతూ ప్రస్తుతం గర్భవతి. ఏడు నెలల గర్భవతిని వదిలి బిగ్ బాస్ షోకి వెళ్లడం సరికాదని భావించిన నటరాజ్, అవకాశం వదులుకుందామని అనుకున్నారట. అయితే భార్య నీతూ తనను బలవంతం చేసి షోకి పంపినట్లు నటరాజ్ మాస్టర్ తెలిపారు. 

PREV
17
ఘనంగా బిగ్ బాస్ కంటెస్టెంట్ నటరాజ్ భార్య సీమంతం... ఆయన దూరంగా ఉన్నా, బాధ్యత నిర్వర్తించిన బుల్లితెర స్టార్స్


అయితే భార్య నీతూ తనను బలవంతం చేసి షోకి పంపినట్లు నటరాజ్ మాస్టర్ తెలిపారు. బిగ్ బాస్ షో మొదటి ఎపిసోడ్ నాడు నటరాజ్ తో పాటు భార్య నీతూ కూడా వేదిక పంచుకున్నారు. 

27

బిగ్ బాస్ షో మొదటి ఎపిసోడ్ నాడు నటరాజ్ తో పాటు భార్య నీతూ కూడా వేదిక పంచుకున్నారు. తన భార్య, బిడ్డకు జన్మనిచ్చే నాటికి బహుశా నేను బయట ఉండకపోవచ్చని నటరాజ్ ఎమోషనల్ అయ్యారు. టైటిల్ గెలిచి వస్తానని హౌస్ కి వచ్చిన నటరాజ్, స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా కొనసాగుతున్నారు. 
 

37

అయితే నటరాజ్ భార్య నీతూ సీమంతం వేడుకలు ఘనంగా జరిగాయి. నీతూ సీమంతం వేడుకకు బుల్లితెర స్టార్స్ హాజరయ్యారు. ప్రముఖ సీరియల్ నటులు నవీన, శ్రీవాణి,అంజలి పవన్‌, జ్యోతి రెడ్డి తదితరులు వచ్చి సందడి చేశారు.


 

47

నీతూ సీమంతం ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, ఆమెకు అందరూ బెస్ట్ విషెష్ తెలియజేస్తున్నారు. ఇక కృష్ణాజిల్లాకు చెందిన నటరాజ్ కొరియోగ్రాఫర్ గా స్టార్స్ చిత్రాలకు పనిచేశారు. 
 

57

2009లో నటరాజ్ తన శిష్యురాలు నీతూని ఆయన ప్రేమ వివాహం చేసుకున్నారు. భార్యతో కలిసి అనేక బుల్లితెర షోలు, ఈవెంట్స్ చేశారు. 

67


కొన్నాళ్లుగా నటరాజ్ సైలెంట్ అయ్యారు. ఆయన పరిశ్రమకు గుడ్ బై చెప్పి వెళ్లిపోయారని అందరూ భావించారు. మళ్ళీ ఇలా బిగ్ బాస్ సీజన్ 5 కంటెస్టెంట్ గా సడన్ ఎంట్రీ ఇచ్చారు. 

77

ఈ వారం ఎలిమినేషన్ లిస్ట్ లో నటరాజ్ ఉన్న విషయం తెలిసిందే. ఉమాదేవి ఈ వారం ఎలిమినేట్ కానున్నారని తెలుస్తుండగా, నటరాజ్ మాస్టర్ పేరు కూడా వినిపిస్తుంది.

Read more Photos on
click me!

Recommended Stories