గుప్పెడంత మనసు జగతి మేడం రెండో పెళ్లి.. టాలీవుడ్ డైరెక్టర్ తో డేటింగ్ లో జ్యోతీరాయ్..

జగతీ మేడం పెళ్లి చేసుకోబోతోంది. అవును.. గుప్పెడంత మనసు సీరియల్ ను ఫాలో అయ్యేవారికి.. జగతీ మేడం అలియాస్ జ్యోతీరాయ్ కు పెద్ద ఫ్యాన్స్ అవ్వక మానరు. రిషీకి తల్లిగా.. పెద్ద వయసు మహిళగా నటించిన ఆమె.. తాజాగా పెళ్లి పీటలెక్కబోతుదంట. 
 

Guppedantha Manasu Jagathi Madam Wedding with Tollywood Director JMS
jyothi rai

తెలుగు ఆడియన్స్  సినిమా స్టార్స్ కంటే కూడా.. తెలుగు సీరియల్ స్టార్స్ నే ఎక్కువగా ఆదరిస్తుంటారు. బుల్లితెర తారలలో కొంత మందికి ఎంత ఫ్యాన్ బేస్ ఉందంటే..? స్టార్ హీరోలకు సమానంగా ఫ్యాన్స్ ఉన్నవారు కూడా సినిమాలతో పాటు సీరియల్స్ ని కూడా అదే స్థాయిలో ఆదరిస్తుంటారు. ఇక సినిమాల్లో నటించే స్టార్స్ ని ఎలా అభిమానిస్తుంటారో సీరియల్ స్టార్స్ ని కూడా అలానే ఫాలో అవుతుంటారు.

Jyothi rai

ఇక తెలుగు ప్రేక్షకులు బాగా అభిమానించే సీరియల్స్ లో  గుప్పెడంత మనసు (Guppedantha Manasu) అనే సీరియల్ కి మంచి ప్రేక్షకాదరణ వస్తుంది. ఫ్యామిలీ ఎమోషన్స్ తో పాటు యూత్ కి నచ్చేలా లవ్ ట్రాక్ ని కూడా పెట్టి ఇంటరెస్టింగ్ గా నడిపిస్తున్నారు. ఈ  సీరియల్ లో హీరో రిషికి తల్లి పాత్రలో అద్భుతంగా నటిస్తోంది కన్నడ నటి జ్యోతీరాయ్. ఈమె వయస్సు చిన్నదైనా.. తల్లి పాత్రలో ఒదిగిపోయింది. 


jyothi rai

ఈ సీరియల్ చూసేవారికి జగతి మేడం క్యారెక్టర్ బాగా పరిచయమే. సీరియల్ లో హీరోకి తల్లిగా ప్రధాన పాత్ర చేస్తున్న జగతి మేడం అసలు పేరు జ్యోతి రాయ్. కన్నడ భామ అయిన జ్యోతి రాయ్ తెలుగు, కన్నడ సీరియల్స్ చేస్తూ వస్తుంది.  ఈ సీరియల్ వల్ల జ్యోతీరాయ్ కు భారీగా ప్యాన్ బేస్ తయారయ్యింది. అందులో ఆమె బ్యూటీకి కూడా మంచి ఫ్యాన్స్ ఉన్నారు. 
 

jyothi rai

చేయడానికి తల్లి పాత్ర చేస్తున్నా.. జ్యోతీరాయ్ వయస్సు చాలా తక్కువే. కాగా ఈమె ఇప్పుడు ఒక టాలీవుడ్ డైరెక్టర్ ని పెళ్లాడబోతుంది. మాటరాని మౌనమిది, శుక్ర సినిమాలతో టాలీవుడ్ లో దర్శకుడిగా ఒక గుర్తింపు సంపాదించుకున్న సుకు పూర్వాజ్ అలియాస్ సురేష్ కుమార్.. తాజాగా ఏ మాస్టర్ పీస్ అనే సూపర్ హీరో సినిమాని తెరకెక్కిస్తున్నాడు.

jyothi rai

ఈ దర్శకుడినే జ్యోతి రాయ్ పెళ్లాడబోతుంది. గత కొంతకాలంగా వీరిద్దరూ డేటింగ్ చేస్తూ వస్తున్నారు. ఇటీవల సుకు పూర్వాజ్, జ్యోతి రాయ్ తో ఉన్న ఫోటో షేర్ చేసి.. త్వరలో ఒక గుడ్ న్యూస్ చెబుతాను అని పోస్ట్ పెట్టారు. అంతే కాదు కలిసి తిరుగూ.. డేటింగ్ లో ఉన్నారు. ఒకరకంగా సహజీవనం కూడా చేస్తున్నారని టాక్. 

Jyothi rai

ఇక అంతే కాదు తాజాగా వీరిద్దరూ ఎంగేజ్మెంట్ అంటూ ఒక పోస్ట్ షేర్ చేశారు. మరి నిశ్చితార్థం వేడుక ఆల్రెడీ అయ్యిపోయిందా..? లేదా త్వరలో చేసుకోబోతున్నారా..? అనేది క్లారిటీ ఇవ్వలేదు. అలాగే పెళ్లి ఎప్పుడు అనేది కూడా తెలియాల్సి ఉంది. కాగా వీరిద్దరికి ఇది రెండు పెళ్లి అని సమాచారం

తల్లి పాత్రలో చీరకట్టులో మెరిసిన జ్యోతీరాయ్.. ఇన్ స్టాలో మాత్రం గట్టిగా అందాలు ఆరబోస్తుంటుంది. ఈమధ్య ఓ వెబ్ సిరీస్ లో కూడా నటిస్తోంది. ఈ వెబ్ సిరీస్ లో హాట్ హాట్ అందాలు ఆరబోస్తూ.. ఆమె చేసిన రచ్చ చూసి.. మన జగతీమేడమేనా ఈమె అంటూ కామెంట్లు చేస్తున్నారు ఫ్యాన్స్. 

jyothi rai

ఇక ఇన్ స్టా గ్రామ్ లో జ్యోతీరాయ్ అందాలు చూస్తూ.. మెస్మరైజ్ అవుతున్నారు నెటిజన్లు. ఆమె ఫ్యాన్స్ లో కొంత మంది మాత్రం...జ్యోతీరాయ్ ను ఇలా చూడలేకపోతున్నాం అంటూ డిస్సపాయింట్ అవుతున్నారు. త్వరలో హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తుందేమో అని టాక్ కూడా నడుస్తోంది. చూడాలి కెరీర్ లో ఆమె ఏం స్టెప్ వేస్తుందో. 

Latest Videos

vuukle one pixel image
click me!