తెలంగాణా రాష్ట్ర గీతంపై కీరవాణి పెత్తనం ఏంది బై!

Published : May 28, 2024, 08:34 AM IST

ఈ పాటని స్వరపరిచే బాధ్యతల్ని టాలీవుడ్ ప్రముఖ సంగీత దర్శకుడు ఎమ్ఎమ్ కీరవాణికి తాజాగా అప్పగించారు. ఈ క్రమంలోనే తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రిని కీరవాణి కలిశారు.

PREV
16
 తెలంగాణా రాష్ట్ర గీతంపై   కీరవాణి పెత్తనం ఏంది బై!
Keeravani


తెలంగాణ రాష్ట‍్ర గీతంగా 'జయ జయహే తెలంగాణ'ని ఇప్పటికే అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక ఈ పాటని స్వరపరిచే బాధ్యతల్ని  తెలుగులో ప్రముఖ సంగీత దర్శకుడు ఎమ్ఎమ్ కీరవాణికి తాజాగా అప్పగించారు. ఈ క్రమంలోనే తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రిని కీరవాణి కలిశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు కూడా కొన్ని బయటకొచ్చాయి. కానీ ఇప్పుడు ఈ పాట విషయంలో వివాదాలు  చోటుచేసుకుంటున్నాయి.తెలంగాణ సినీ మ్యూజిషియన్స్ అసోసియేషన్ తాజాగా ఓ లేఖ విడుదల చేసింది.

26
Keeravani


''జయ జయహే తెలంగాణ' పాటకు కీరవాణిని సంగీతం అందించమని కోరటం చారిత్రక తప్పిదం అవుతుంది. తెలంగాణ అస్తిత్వం మీకు తెలియంది కాదు, మన ఉద్యోగాలు, మన అవకాశాలు మనకే కావాలి అనే నినాదంతో తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసింది. సకల జనుల సహకారంతో  ఎంతో మంది అమర వీరుల త్యాగ ఫలంగా ఏర్పడింది మన తెలంగాణ రాష్ట్రం. ఇంతటి ఖ్యాతి గడించిన మన రాష్ట్ర గీతాన్ని పక్క రాష్ట్రాల వాళ్ళు పాడటమేంటి? 

36
Keeravani


అలా చేయడం అంటే మన తెలంగాణ కళాకారులని అవమానించడమే అవుతుంది. ఎంతో ప్రతిభావంతులు మన తెలంగాణాలో ఉన్నారు మన తెలంగాణ కళాకారులకు ఈ గొప్ప అవకాశాన్ని ఇచ్చి తెలంగాణ కళాకారులకి గౌరవాన్ని ఇస్తారని ఆశిస్తున్నాం' అని తెలంగాణ సినీ మ్యూజిషియన్స్ అసోసియేషన్ ఓ ప్రకటన విడుదల చేసింది.

46
Keeravani


మరో ప్రక్క తెలంగాణ కవులపై ఆంధ్ర సంగీత దర్శకుల పెత్తనం ఇంకెంతకాలం అని సూటిగా ప్రశ్నించారు బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. "అందెశ్రీ తెలంగాణ రాష్ట్ర గీతం పై ఆంధ్రా' సంగీత దర్శకుడు ఎమ్ఎమ్ కీరవాణి పెత్తనం ఏంది భై ? గీత స్వరకల్పనకు మళ్లీ ఇప్పుడేం అవసరమొచ్చింది?" అంటూ ఆయన ట్వీట్ చేశారు. తెలంగాణ వచ్చి పదేళ్లయిన తర్వాత ఇప్పుడు స్వరకల్పన ఏంటని అడిగారు.  

56
Keeravani


కీరవాణి సంగీతం ఇవ్వడానికి ఇది "నాటు నాటు" పాట కాదని, నాటి ఆంధ్ర పాలకుల పెత్తనంపై తిరుగుబాటు బావుటా ఎగరేసిన వందలాది మంది అమరుల త్యాగాలు, నాలుగు కోట్ల ప్రజల కలల ప్రతి రూపం ఇదని అన్నారు . అందెశ్రీ గీతం ఒక రణ నినాదం, ధిక్కార స్వరం అని చెప్పారు. ఆయన ఇచ్చిన ఒరిజినల్ ట్యూన్ తోనే ఈ గీతాన్ని యావత్తు తెలంగాణ ఆనాడు ఆలాపించిందని గుర్తు చేశారు. ఇప్పుడెందుకు ఆ ట్యూన్ మార్చే సాహసం చేస్తున్నారని ప్రశ్నించారు.
 

66


 
   'జయ జయహే తెలంగాణ' పాటని అన్ని పాఠశాలల్లో, ప్రభుత్వ కార్యక్రమాలలో ఆలపించే విధంగా రూపొందించాలని ప్రభుత్వ వర్గాలు కసరత్తు చేస్తున్నాయి. జూన్ 2న తెలంగాణ అవతరణ దినోత్సవం ఉంది. అంతలో ఈ పాటను రూపొందించాలని కీరవాణికి సీఎం రేవంత్ రెడ్డి సూచించినట్లు వార్తలు వస్తున్నాయి.
 

click me!

Recommended Stories