బేబీ డైరెక్టర్ తో మెంటల్ క్యారెక్టర్ చేస్తా... రష్మిక మందాన ఓపెన్ ఆఫర్!

Published : May 28, 2024, 08:18 AM IST

బేబీ మూవీ చూసిన రష్మిక మందాన స్ట్రాంగ్ గా ఫిక్స్ అయ్యిందట. దర్శకుడు సాయి రాజేష్ తో ఖచ్చితంగా పని చేయాలి అనుకుంటుందట. తన కోసం ఓ మెంటల్ క్యారెక్టర్ రాయమంటూ మొహమాటం లేకుండా అడిగింది.   

PREV
16
బేబీ డైరెక్టర్ తో మెంటల్ క్యారెక్టర్ చేస్తా... రష్మిక మందాన ఓపెన్ ఆఫర్!

గత ఏడాది విడుదలైన బేబీ ఒక సంచలనం. దర్శకుడు సాయి రాజేష్ తెరకెక్కించిన ట్రై యాంగిల్ లవ్ డ్రామా యువతకు తెగ నచ్చేసింది. ఆనంద్ దేవరకొండ, విరాజ్, వైష్ణవి చైతన్య ప్రధాన పాత్రలు చేశారు. ముఖ్యంగా వైష్ణవి చైతన్య నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో అద్బుతంగా నటించింది.

26

బేబీ సక్సెస్ లో వైష్ణవి చైతన్య చేసిన రోల్ చాలా కీలకంగా మారింది. దర్శకుడు సాయి రాజేష్ ఆ పాత్రను వినూత్నంగా తీర్చిదిద్దాడు. వాస్తవ సంఘటనలకు దగ్గరగా ఉన్న కథ, పాత్రలు ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యాయి. చిన్న సినిమాగా విడుదలై వంద కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. 
 

36
Rashmika Mandanna

కాగా ఈ చిత్రం చూసిన రష్మిక మందాన ఫిదా అయిపోయిందట. సాయి రాజేష్ తో ఒక చిత్రం చేయాలని ఫిక్స్ అయ్యానని ఆమె ఓపెన్ అయ్యారు. విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ లేటెస్ట్ మూవీ గం గం గణేశా. మే 31న విడుదల కానుంది. ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ కి రష్మిక మందాన గెస్ట్ గా హాజరైంది. 
 

46
Rashmika Mandanna

గం గం గణేశా ప్రీ రిలీజ్ ఈవెంట్లో రష్మిక మాట్లాడుతూ... నేను బేబీ మూవీ చూశాను. దర్శకుడు సాయి రాజేష్ తో ఎప్పటికైనా వర్క్ చేయాలని ఫిక్స్ అయ్యాను. ఆయన హార్డ్ వర్క్, డెడికేషన్ చాలా నచ్చాయి. మొదటి చిత్రంతో ఇలాంటి కథతో నిర్మాతలను ఒప్పించడం అంత సులభం కాదు.

56


బేబీ మూవీ చూసి నేను ఏడ్చేశాను. సాయి రాజేష్ మీరు నా కోసం ఒక మెంటల్ క్యారెక్టర్ రాయండి. మనం సినిమా చేద్దాం... అని అన్నారు. బేబీ మూవీలో వైష్ణవి చైతన్య ఓ సాహసోపేతమైన పాత్ర తనకు కూడా కావాలని, సాయి రాజేష్ దర్శకత్వంలో పని చేయాలన్న కోరికను ఆమె బయటపెట్టారు. రష్మిక కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. 

66

రష్మిక ప్రస్తుతం పుష్ప 2 చేస్తున్నారు. దర్శకుడు సుకుమార్-అల్లు అర్జున్ కాంబోలో వస్తున్న పుష్ప 2 పై భారీ అంచనాలు ఉన్నాయి. ఆగస్టు 15న ఈ చిత్రం విడుదల కానుంది. అలాగే రైన్ బో, గర్ల్ ఫ్రెండ్ టైటిల్ తో రెండు లేడీ ఓరియెంటెడ్ చిత్రాల్లో ఆమె నటిస్తున్నారు. 
 

Read more Photos on
click me!

Recommended Stories