రష్మిక మందన్నా, విజయ్ దేవరకొండల వెండితెర ప్రేమ నిజ జీవితంలో కూడా కొనసాగుతుందనే గాసిప్స్ వినిపిస్తున్నాయి. ఈ వార్తలను వీళ్ళు ఖండించలేదు, కన్ఫమ్ చేయలేదు. పైగా చాలాసార్లు కలిసి కనిపించారు. ఇప్పుడు కలిసి అమెరికా వెళ్తున్నారు.
25
అమెరికాలో ఇండిపెండెన్స్ డే వేడుకలకు ఆహ్వానం
విజయ్, రష్మిక లకు అరుదైన గౌరవం దక్కబోతుంది. అమెరికాలో జరిగే స్వాతంత్య్ర దినోత్సవ పరేడ్ కి వీళ్ళని ఆహ్వానించారు. అక్కడ ఇండిపెండెన్స్ డే వేడుకల్లో పాల్గొనేందుకు ఈ జంట అంగీకరించడం విశేషం.
35
స్వాతంత్య్ర దినోత్సవ పరేడ్‌లో స్టార్ జోడీ
అమెరికాలోని ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ అసోసియేషన్ ఈపరేడ్ ని నిర్వహిస్తోంది. ఇది ఆగస్టు 17న న్యూయార్క్ లో జరుగుతుంది. విజయ్, రష్మిక ఈ పరేడ్‌కి నాయకత్వం వహిస్తారు. ఇది అరుదైన ఛాన్స్ గా చెప్పొచ్చు.
45
పహల్గామ్ మృతులు నివాళ్లు
ఇది న్యూయార్క్‌లో 43వ స్వాతంత్య్ర దినోత్సవ పరేడ్. ఈసారి కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. పహల్గామ్ దాడిలో మరణించిన వారికి నివాళులు అర్పిస్తారు. ఈ విషయాన్ని ఈ జంట ప్రకటించడం విశేషం.
55
రష్మిక, విజయ్ రియాక్షన్ ఇదే
న్యూయార్క్‌లో జరిగే స్వాతంత్య్ర దినోత్సవ పరేడ్ లో పాల్గొంటున్నందుకు సంతోషంగా ఉంది. అందరూ రండి, భారత్ కు గౌరవం తెలుపుదాం అని విజయ్, రష్మిక అన్నారు. వీళ్ళు ప్రత్యేక అతిథులుగా పాల్గొంటున్నారు.
రష్మిక మందన్నా ఇటీవలే `కుబేర`తో ఆడియెన్స్ ముందుకు వచ్చింది. ఇప్పుడు `మైసా` అనే చిత్రంలో నటిస్తుంది. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ అదిరిపోయింది. కత్తి పట్టి రష్మిక చేసే రచ్చ వేరే లెవల్. ఇక విజయ్ త్వరలో `కింగ్‌డమ్` మూవీతో రాబోతున్నారు.