ఈ ఫోటో చూశారా? మెగాస్టార్ చిరంజీవి ఓ చిన్నారిని ఎత్తుకుని ఉన్నారు. ఓ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన ఈ చిన్నారి ప్రస్తుతం పాన్ ఇండియా హీరో, రీసెంట్ గా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన ఆ హీరో ఎవరో తెలుసా?
ఫిల్మ్ ఇండస్ట్రీలో చాలామంది హీరోలు చైల్డ్ ఆర్టిస్టులుగా వచ్చిన హీరోలుగా ఎదిగినవారే. టాలీవుడ్ లో అలా చాలామంది ఉన్నారు. మహేష్ బాబు, ఎన్టీఆర్, తరుణ్, కళ్యాణ్ రామ్. అఖిల్, ఇలా చాలామంది పిల్మ్ ఇండస్ట్రీలో చైల్డ్ ఆర్టిస్టులుగా ఎదిగిని వారే. అయితే ఎటువంటి సినిమా బ్యాక్ గ్రౌండ్ లేకుండా, సినిమా ఫ్యామిలీ నుంచి రాకుండా? చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ ను స్టార్ట్ చేసి, స్టార్ హీరోల ప్రశంసలు అందుకుని, ఆతరువాత కాలంలో హీరోగా మారిన కుర్రాడినే ఇప్పుడు మీరు చూస్తున్నారు. చైల్డ్ ఆర్టిస్ట్ గా చిరంజీవి ఎత్తుకుని ఆడించిన చిన్నారిని, హీరోగా మారి, సక్సెస్ సాధించిన తరువాత కూడా చిరంజీవి ఫోన్ చేసి మరీ అభినందించారు. ఇంతకీ చిరంజీవి ఒడిలో ఉన్న ఆ చిన్నారి హీరో ఎవరు?
26
చైల్డ్ ఆర్టిస్ట్ గా
ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న హీరో ఎవరో కాదు తేజ సజ్జా. ఎటువంటి సినిమా బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఫిల్మ్ ఇండస్ట్రీలోకి వచ్చిన తేజ సజ్జా, చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ ను కూడా విచిత్రమైన పరిస్థితుల్లో స్టార్ట్ చేశాడు. చిరంజీవి, సౌందర్య కాంబినేషన్ లో తెరకెక్కిన చూడాలని ఉంది సినిమాలో మెగాస్టార్ కొడుకుగా తేజ్ మొదటిసారి వెండితెరపై కనిపించాడు. అయితే ఈసినిమా ఆడిషన్ కోసం వచ్చిన వేల ఫోటోలలో తేజన చిరంజీవి సెలక్ట్ చేశారు. ఆ ఫోటో చిరంజీవి సెలక్ట్ చేయబట్టి ఇప్పుడు తేజ్ హీరోగా ఈ పరిస్థితుల్లో ఉన్నాడు. ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో కూడా వెల్లడించాడు తేజ సజ్జా.
36
మెగాస్టార్ ఎత్తుకుని ఆడించిన హీరో
ఆతరువాత కాలంలో కూడా చిరంజీవితో చాలా సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా తేజ కనిపించాడు. షూటింగ్ లో తేజ ను ఆడించడం, ఎత్తుకుని ముద్దాడటం చూసేవారు చిరు. ఈ ఫోటోలు కూడా ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. సినిమా ఈవెంట్లలో కూడా తేజ్ ను ఎత్తుకుని తిరిగాడు చిరంజీవి. తాను ఎత్తుకుని తిరిగిన చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడు పాన్ఇండియా హీరో అవ్వడంతో ఆయన కూడా తెగ సంతోషపడుతున్నారు. ఈ విషయాన్ని పలు సందర్భాల్లో కూడా మెగాస్టార్ వెల్లడించారు.
తేజ సజ్జ ప్రస్తుతం పాన్ఇండియా హీరో. రీసెంట్ గా మిరాయ్ సినిమాతో దుమ్మురేపాడు తేజ. పాన్ఇండియా లెవల్లో రిలీజ్ అయిన ఈసినిమాకు మంచి రెస్పాన్స్ తో పాటు భారీగా కలెక్షన్లు కూడా వస్తున్నాయి. స్టార్ హీరోల ప్రశంసలు కూడా అందుకుంటోంది ఈ సినిమా. ఈసినిమాతో తేజ రేంజ్ మారిపోబోతోంది. మంచు మనోజ్ విలన్ గా నటించి దాదాపు 12 ఏళ్ల తరువాత హిట్ కొట్టాడు.దాంతో మిరాయ్ సినిమా స్పెషల్ గామారింది. కార్తీక్ డైరెక్ట్ చేసిన ఈమూవీలో రితికా హీరోయిన్ గా నటించింది.
56
కెరీర్ లో ఎన్నో కష్టాలు
చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర ముగిసిన తరువాత హీరోగా కెరీర్ స్టార్ట్ చేయడానికి ఎన్నో కష్టాలు అనుభవించాడు తేజ సర్జా. చైల్డ్ ఆర్టిస్ట్ లు చాలామంది ఉంటారు. కాని వారు హీరోలుగా ఎదగడం అందరికి సాధ్యం కాదు. ఎన్నో అవమానాలు ఫేస్ చేసి తేజ్ ఈ స్టేజ కు వచ్చాడు. ప్రస్తుతం తేజ సజ్జా పాన్ ఇండియా హీరో. బేబీ సినిమా తరువాత తేజ్ కు కాస్త క్రేజ్ పెరిగింది. ఆతరువాత వచ్చిన వరుస సినిమాలు తేజ సజ్జాను స్టార్ గా మార్చాయి.
66
తేజకు ఫోన్ చేసిన చిరంజీవి
తేజను హీరోగా నిలబెట్టిన సినిమా హనుమాన్. ప్రశాంత్ వర్మ డైరెక్ట్ చేసిన ఈ సినిమాతోనే తేజ కు హీరోగా లైఫ్ వచ్చిందని చెప్పవచ్చు. ఈ సినిమా తరువాత తేజ కు అభిమానులు కూడా పెరిగారు. హనుమాన్ మూవీ చూసి ఆశ్చర్యపోయిన మెగాస్టార్ చిరంజీవి తేజకు ఫోన్ చేసి దాదాపు 20 నిమిషాలు మాట్లాడారట. ఈ విషయాన్ని మిరాయ్ ప్రమోషన్స్ లో తేజ స్వయంగా వెల్లడించారు. ఇక మిరాయ్ దెబ్బకు తేజకు అవకాశాలు వెల్లవెత్తుతున్నాయి. కాని ఈ స్టేజ్ లోనే తేజ సరైన స్టెప్ వేస్తే.. ముందు ముందు స్టార్ హీరోగా టైర్ 1 స్టార్స్ లిస్ట్ లో చేరే అవకాశం కూడా ఉంది. అంతే కాదు మిరాయ్ తరువాత తేజ్ తన రెమ్యుునరేషన్ కూడా పెంచాడట. చూడాలి ముందు ముందు ఈ హీరో లైఫ్ ఎలా ఉండబోతోందో.