Mirai Day 2 Box Office: తేజా సజ్జా హీరోగా వచ్చిన మిరాయ్ బాక్స్ ఆఫీస్ వద్ద సునామీ సృష్టిస్తోంది. తొలి రోజు 27.20 కోట్ల గ్రాస్ సాధించగా, రెండో రోజు కూడా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీని క్రియేట్ చేసింది. ఇంతకీ రెండో రోజూ కలెక్షన్స్ ఎన్ని కోట్లంటే?
Mirai Box Office Collection: యంగ్ హీరో తేజ సజ్జా హీరోగా, కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా "మిరాయ్". సూపర్ మెన్ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ మూవీని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మించారు. భారీ అంచనాలతో తెరకెక్కిన ఈ మూవీ సెప్టెంబర్ 12న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఫస్ట్ షో నుంచే మిరాయ్ పాజిటివ్ టాక్ తో దూసుకవెళ్తుంది. బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతోన్న మిరాయ్ మూవీ ఇప్పటి వరకూ ఎన్ని కోట్లు వసూళ్లు చేసిందంటే?
26
మ్యాజికల్ వండర్ మిరాయ్
సూపర్ మెన్ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ‘మిరాయ్’లో తేజ సజ్జా హీరోగా నటించగా, రితీక నాయక్ హీరోయిన్‌గా నటించారు. సీనియర్ హీరోయిన్ శ్రీయ సరన్ తొలిసారి తల్లి పాత్ర పోషించింది. ఇక మంచు మనోజ్ ప్రతినాయక పాత్రలో మరింత జోష్ నింపారు. సీనియర్ నటులు జగపతి బాబు, జయరాం, దర్శకులు తిరుమల కిషోర్, వెంకటేష్ మహా, గెటప్ శ్రీను తదితరులు కీలక పాత్రల్లో నటించారు. సెప్టెంబర్ 12న పాన్ ఇండియా మూవీగా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో మిరాయ్ మూవీ వరల్డ్ వైడ్ గా విడుదలైంది.
36
బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డు స్థాయి వసూళ్లు
యంగ్ హీరో తేజా సజ్జా హీరోగా, మంచు మనోజ్ విలన్‌గా నటించిన మిరాయ్ మొదటి రోజే సూపర్ డూపర్ హిట్ టాక్ అందుకుంది. థియేటర్లలో ప్రేక్షకులు కిక్కిరిసిపోవడంతో బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డు స్థాయి వసూళ్లు వచ్చాయి. మొదటి రోజే ₹27.20 కోట్లు వసూలు చేసి, సక్సెస్ పుల్ గా దూసుకెళ్తుంది. ప్రొడక్షన్ హౌస్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధికారికంగా వెల్లడించిన సమాచారం ప్రకారం, మిరాయ్ విడుదలైన మొదటి రోజే ప్రపంచవ్యాప్తంగా రూ.27.20 కోట్ల గ్రాస్ వసూలు చేసింది.
మిరాయ్ రెండో రోజు కలెక్షన్లు మరింత ఊపందుకోవడం విశేషం. ఇండియాలోనే ఓపెనింగ్ డే కంటే సెకండ్ డే ఎక్కువ వసూళ్లు రాబట్టడం సినిమా పాజిటివ్ టాక్‌కు నిదర్శనం. తాజాగా విడుదలైన కలెక్షన్ రిపోర్ట్స్ ప్రకారం, రెండో రోజు కూడా మిరాయ్ అదే జోరుతో కొనసాగింది.
తొలి రోజు నెట్ కలెక్షన్ ₹13 కోట్లు కాగా, రెండో రోజు ₹13.70 కోట్లు రాబట్టింది. అంటే ఓపెనింగ్ డేకి మించి రెండో రోజు వసూళ్లు రావడం విశేషం. శనివారం దాదాపు ఆల్‌మోస్ట్ హౌస్‌ఫుల్ అవ్వడం సినిమాకు అదనపు బూస్ట్ ఇచ్చింది.
భాషా పరంగా చూస్తే.. తెలుగు : ₹11 కోట్లు, తమిళం: ₹10 లక్షలు, కన్నడ: ₹5 లక్షలు, మలయాళం: ₹5 లక్షలు , హిందీ: తొలి రోజు ₹1.65 కోట్లు – రెండో రోజు ₹2.5 కోట్లు (సుమారు 50% వృద్ధి) హిందీ బెల్ట్‌లో రెండో రోజు కలెక్షన్స్ భారీగా పెరగడం విశేషం. పాజిటివ్ మౌత్‌టాక్ వసూళ్లను మరింత బలపరిచింది.
56
ఓవర్సీస్‌లో మిరాయ్ వైజ్ .. రెండు రోజుల్లో 50 కోట్ల గ్రాస్
ఓవర్సీస్ మార్కెట్లో కూడా మిరాయ్ అదరగొట్టింది. నార్త్ అమెరికాలో తొలి రోజు సుమారు $700K (సుమారు ₹5.8 కోట్లు) వసూలు చేసిన సినిమా నిలిచింది. రెండో రోజుల్లోనే మిలియన్ డాలర్ క్లబ్‌లోకి చేరిపోయింది. యూఎస్, కెనడాలోని NRI ప్రేక్షకులు థియేటర్లకు పెద్ద సంఖ్యలో రావడంతో ఓవర్సీస్ బజ్ మరింత పెరిగింది.
ప్రపంచవ్యాప్తంగా తొలి రోజు ₹27.20 కోట్ల గ్రాస్ సాధించిన మిరాయ్, రెండో రోజు కూడా అదే స్థాయిలో రాబట్టింది. దీంతో రెండు రోజుల్లోనే సినిమా ₹50 కోట్ల గ్రాస్ మార్క్ దాటేసింది.
66
వీకెండ్‌లో 100 కోట్లు ఖాయం!
ట్రేడ్ అనలిస్టుల అంచనాల ప్రకారం.. మిరాయ్ మూవీ ఫస్ట్ వీకెండ్ ముగిసేలోపు రూ. 100 కోట్ల మార్క్ దాటడం ఖాయమని అంచనా వేస్తున్నారు. మంచి మౌత్‌టాక్, అన్ని భాషల్లో పాజిటివ్ రెస్పాన్స్ ఉండటం, వర్క్‌డేస్ కలెక్షన్ల వేగం కొనసాగితే, వచ్చే వారం నాటికి ₹150 కోట్ల గ్రాస్ రాబట్టే ఛాన్స్ ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.